ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2nd timothy Chapter 1 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము

 1. క్రీసు యేసునందును జీవమును గూర్చియు వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు,

2. నాప్రియ పుత్రుడగు తిమోతికి వ్రాయునది: పితయగు దేవునినుండియు, మన ప్రభువగు క్రీస్తుయేసునుండియు, నీకు కృప, కనికరము, సమాధానము.

3. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను స్మరించుచు, నా పితరులవలె నిర్మలమైన అంతఃకరణ ముతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను.

4. నీ కన్నీరు తలంచుకొని, నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవ లెనని రేయింబవళ్ళు ఎంతగానో ఆశించుచున్నాను.

5. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి, తల్లియగు యూనీకేలోను ఉండెడిది. కనుక ఇపుడు అట్టి విశ్వాసము నీలోను ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు.

6. అందు వలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింప వలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.

7. దేవుడు మనకు పిరికితనముగల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను.

8. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకుగాని, ఆయన బందీనగు నన్ను గూర్చిగాని, నీవు సిగ్గుపడకుము. దానికి మారుగ దేవుని శక్తివలన సువార్తకొరకై నావలె పాటుపడుము.

9. మనము చేసిన కార్యములవలనగాక, అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి, పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అను గ్రహమును మనకు ప్రసాదించెను.

10. కాని ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్యజీవ మును మనకు ప్రదర్శించెను.

11. అపోస్తలునిగ, బోధకునిగ, ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను.

12. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచు న్నాను. అయినను నేను సిగ్గుపడుట లేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియును. ఆయన నాకు అప్పగించిన దానిని, ఆనాటివరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది.

13. నీవు నానుండి  వినిన దానిని స్వచ్చమైన సిద్దాంతమునకు ఆదర్శముగ పాటించుచు, క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమల యందు నిలిచియుండుము.

14. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మనయందు అవసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరచు కొనుము.

15. పుగెల్లు, హెర్మొగెనెతో సహా ఆసియా మండలములోని వారు అందరును నన్ను విడిచిపోయిరని నీకు తెలియును.

16. నన్ను పెక్కు మారులు ఉత్సాహపరచిన ఒనేసీఫోరు కుటుంబమును ప్రభువు కనిక రించునుగాక! నేను చెరయందు ఉంటినని అతడు సిగ్గుపడక,

17. రోమునకు వచ్చిన వెంటనే నా కొరకై శ్రద్దగ వెదకి నన్ను కనుగొనెను.

18. మహా దినమున ఆయన కనికరమునకు పాత్రుడగునట్లు ప్రభువు అతనిని అనుగ్రహించునుగాక! అతడు ఎఫెసులో నాకు ఎంతగా తోడ్పడెనో నీవు ఎరుగుదువు కదా!