ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

the holy bible in telugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కొరింతీయులకు వ్రాసిన 1వ లేఖ

1వ అధ్యాయము + -  1. దేవుని సంకల్పము వలన క్రీస్తుయేసు అపోస్తలునిగ పిలువబడిన పౌలును, మరియు మన సోదరుడు సొస్తెనేసును 2. కొరింతులోని దైవసంఘమునకు వ్రాయునది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరుపబడి, ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించువారితో సహా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడినవారు. ఆయన వారికిని మనకును ప్రభువు. 3. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువు యేసుక్రీస్తునుండియు మీకు అనుగ్రహమును, శాంతియు లభించునుగాక! 4. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన కృపానుగ్రహమును ఒసగెను. కనుక, మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును. 5. ఏలయన, క్రీస్తుతో ఐక్యమువలన, మీరు సర్వ విధముల  వాక్కునందును, జ్ఞానమునందును, ఐశ్వర్యవంతులైతిరి. 6. క్రీస్తునుగూర్చిన సందేశము మీయందు ఎంతయో దృఢపడినది. 7. కనుకనే, మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు, ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. 8. మన ప్రభువగు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగ ఉండునట్లు, ఆయన మిమ్ము తుదివరకు సుస్థిరముగ ఉంచును. 9. తన కుమారుడును, మన ప్రభువును అగు యేసుక్రీస్తుతో సహవాస మునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడ...