ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

roman catholic bible in telugu free download లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Revelation chapter 10 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 10వ అధ్యాయము

 1. అంతట మహా బలవంతుడగు మరియొక దేవదూత దివి నుండి క్రిందికి బయల్వెడలుట గమనించితిని. అతడు మేఘమును వస్త్రముగా ధరించెను. వాని తల చుట్టును ఒక రంగుల ధనుస్సు ఉండెను. వాని వదనము నూర్యబింబమువలె ఉండెను. వాని పాదములు అగ్ని స్తంభములవలె ఉండెను. 2. వాని చేతియందు తెరవబడిన చిన్న గ్రంథము ఒకటి ఉండెను. అతడు తన కుడి పాదమును సముద్రముపైనను, ఎడమ పాదమును భువిపైనను ఉంచెను. 3. అంతట అతడు సింహగర్జనను పోలిన గంభీరమగు కంఠముతో పిలిచెను. అతని పిలుపును అనుసరించి ఏడు ఉరుములు ప్రతిధ్వనించెను. 4. అవి అట్లు పలుకగనే నేను వ్రాయ మొదలిడితిని. కాని అంతలో దేవలోకము నుండి నాకు ఒక స్వరము వినబడెను. “ఏడు ఉరుములు ఏమి చెప్పెనో అది రహస్యముగా ఉంచుము. దానిని లిఖింపకుము!” అని ఆ స్వరము నాతో పలికెను. 5. అంతట సముద్రముపైనను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దేవదూత తన కుడి చేతిని దేవలోకము వైపునకెత్తెను. 6. అట్లు చేతిని ఎత్తి నిత్యుడును, దివిని, భువిని, సముద్రమును, వానియందలి సర్వమును సృజించినవాడగు దేవుని నామమున ఇట్లు శపథమొనర్చెను: “ఇక ఆలస్యము ఉండదు! 7. ఏడవ దేవదూత తన బాకాను ఊదిన వెంటనే దేవుడు తన రహస్య ప్రణాళికను నెరవేర్చును. అది ఆయన తన సేవకులగు ప

2nd Thessalonians Chapter 2 || Roman catholic Bible in Telugu || తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము

 1. సోదరులారా! మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క రాకడ విషయమునను, మనము ఆయనను కలిసికొనుటకు సమావేశమగు విషయమునను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. 2. దేవుని దినము వచ్చెనను వాదమును విని మీరు తేలికగా పొరబడరాదు. తబ్బిబ్బు పడరాదు. బహుశ ప్రవచన పూర్వకముగ గాని, లేక బోధన పూర్వకముగగాని ఎవరో అటుల చెప్పియుండవచ్చును. లేక మేము ఏదియో ఒక లేఖలో అటు వ్రాసితిమనియు చెప్పియుండవచ్చును. 3. ఎవని చేతను ఏ విధముగను మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలెను. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చునంతవరకు ఆ దినము రాదు. 4. మానవులు పూజించు సమస్తమును, మానవుడు దైవికముగ భావించు దేనినైనను, ఆ దుష్టుడు వ్యతిరేకించును. అతడు సమస్తమునకు అతీతునిగ, తనను భావించు కొనును. అంతేకాక దేవుని ఆలయమున ప్రవేశించి కూర్చుండి, తానే దేవుడనని చెప్పుకొనును. 5. మీకు జ్ఞాపకములేదా? నేను మీతో ఉన్న ప్పుడు ఈ విషయములన్నియు చెప్పియుంటిని గదా! 6. కాని ఇప్పుడు ఇది జరుగకుండ ఆపుచున్నది ఏమియో మీకు తెలియును. కనుక యుక్త సమయమున దుష్టుడు కనిపించును. 7. ఆ తిరుగుబాటు ఇప్పటికే తన పనిని ప్రారంభించినది. కాని అది రహస్యముగా జరుగుచున్నది. తిరుగుబాటుదారుడు బహిరంగముగ రాకముందు దానిని నిరోధించుచు