ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 93

1. ప్రభువు రాజు. అతడు ప్రాభవమును వస్త్రమువలె ధరించెను. బలమును వస్త్రమువలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చలింపదు.
2. ప్రభూ! నీ సింహాసనము అనాదికాలము నుండియు స్థిరముగా నిల్చియున్నది. నీవు అనాదికాలమునుండియు ఉన్నవాడవు.
3. ప్రభూ! సాగరగర్భములు ఉప్పొంగినవి. అవి గళమెత్తి హోరుమని శబ్దించినవి.
4. కాని ప్రభువు కడలిహోరుకంటెను, సాగర తరంగములకంటెను అధికుడై ఆకాశమున మహోన్నతుడుగా పరిపాలన చేయును.
5. ప్రభూ! నీ శాసనములు ఎన్నటికిని మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది.