ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 143

1. ప్రభూ! నా ప్రార్థనను ఆలకింపుము. నీవు విశ్వసనీయుడవును, న్యాయవంతుడవును కనుక నాకు ప్రత్యుత్తరము ఒసగుము.
2. నీ దాసుని దోషినిగా నిర్ణయింపకుము. నీ ఎదుట నీతిమంతుడుగా గణింపబడు వాడెవడును లేడు.
3. నా శత్రువు నన్ను వెన్నాడెను, నన్నోడించి మన్నుగరపించెను, నన్ను గాఢాంధకారమున ఉంచెను. నేను చిరకాలము క్రితమే గతించిన వారివలెనైతిని.
4. నేను మిగుల క్రుంగిపోయితిని. నా హృదయము విషాదమున మునిగెను.
5. నేను పూర్వదినములను జ్ఞప్తికి తెచ్చుకొంటిని. నీ కార్యములెల్ల స్మరించుకొంటిని. నీ చెయిదములెల్ల ధ్యానించుకొంటిని.
6. చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. ఎండిన నేలవలె నీ కొరకు దప్పిగొనుచున్నాను.
7. ప్రభూ! శీఘ్రమే నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను మిగుల అలసియున్నాను. నీవు నాకు కనుమరుగయ్యెదవేని నేనును పాతాళము చేరుకొనువారిలో ఒకడనగుదును.
8. నేను నిన్ను నమ్మితిని గనుక నీవు నా పై కృప చూపితివని వేకువనే విందునుగాక! నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నడువవలసిన మార్గమేదియో తెలియజేయుము
9. ప్రభూ! నేను నిన్ను శరణు వేడుచున్నాను. శత్రువులనుండి నన్ను కాపాడుము.
10. నీవు నా దేవుడవు కనుక నీ చిత్తమును పాటించు విధానమును నాకు ఎరిగింపుము. దయగల నీ ఆత్మ నన్ను సరళమార్గమున నడిపించునుగాక!
11. ప్రభూ! నీ నామము నిమిత్తము నన్ను రక్షింపుము. నీవు న్యాయవంతుడవు కనుక బాధలనుండి నన్ను తప్పింపుము.
12. నేను నీ దాసుడను కావున నాపై కృపజూపి నా శత్రువులను మట్టుపెట్టుము.  నన్ను పీడించు వారిని తుదముట్టింపుము.