ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 142

1. నేను ప్రభువునకు మొరపెట్టెదను. ఆయనకు విన్నపము చేసెదను.
2. ఆయన ఎదుట నా గోడు వినిపింతును. నా వేదనలు ఆయనకు తెలుపుకొందును.
3. నా ప్రాణము శోషించుచున్నది. అయినను నా మార్గము ఆయనకు తెలియును. నా త్రోవలో శత్రువులు బోనులు పెట్టిరి.
4. నేను నా కుడిప్రక్కన పరిశీలించి చూడగా నన్ను ఆదుకొను వాడెవడును లేడయ్యెను. నన్ను కాపాడువాడుగాని, ఆదరించువాడుగాని ఎవడును కన్పింపడయ్యెను.
5. ప్రభూ! నేను నీకు మొర పెట్టుచున్నాను. నీవే నాకు ఆశ్రయనీయుడవని తలంచుచున్నాను. ఈ నేలమీద నీవే నా భాగ్యమని ఎంచుచున్నాను.
6. నా ఆర్తనాదమును ఆలకింపుము. నేను మిగుల క్రుంగిపోయితిని. నన్ను పీడించువారు నాకంటెను బలాఢ్యులు. కావున వారినుండి నీవు నన్ను కాపాడుము.
7. ఈ చెరనుండి నన్ను విడిపింపుము. అప్పుడు నీవు నాకు చేసిన ఉపకారమునకుగాను నీతిమంతుల సమాజమున నన్ను బట్టి వారు నిన్ను స్తుతించుదురు.