Psalms 134 1. ప్రభువు సేవకులెల్లరును, రాత్రి ప్రభువు మందిరమున పరిచర్యచేయువారు ఎల్లరును ప్రభువును స్తుతింపుడు.2. మీరు పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి ప్రభువును స్తుతింపుడు.3. భూమ్యాకాశములను సృజించిన ప్రభువు సియోనునుండి మిమ్ము దీవించునుగాక!