ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 127

1. ప్రభువు ఇల్లు కట్టనియెడల దానిని కట్టువారి శ్రమ వ్యర్ధమే. మనం ప్రభువు నగరమును కాపాడనియెడల కావలివారు మేల్కొనియుండియు వ్యర్ధమే.
2. వేకువనే నిద్రలేచి, రేయి ప్రొద్దుపోయినవరకు మేల్కొనియుండి, కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొనుట వ్యర్ధము. ప్రభువు తాను ప్రేమించు ప్రజలకు వారు నిద్రించునపుడును సంపదలొసగును.
3. పుత్రులు ప్రభువు ఇచ్చు వరము. తనయులు దేవుని బహుమానము.
4. యవ్వనమున పుట్టిన కుమారులు వీరుని చేతిలోని బాణములవంటివారు.
5. అట్టి బాణములతో తన అమ్ములపొదిని నింపుకొనువాడు ధన్యుడు. నగరద్వారమువద్ద శత్రువులు తారసిల్లినపుడు అతడు పరాజయమునొందడు.