1. ప్రభువు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినపుడు మొదట అది ఒక కలవలె కన్పించెను.
2. అప్పుడు మనము నోరార నవ్వి, సంతసముతో పాటలు పాడితిమి. అన్యజాతి వారును “ప్రభువు వీరికి ఘనకార్యములు చేసెను' అని పలికిరి.
3. ప్రభువు మనకు అద్భుతకార్యములు చేసెను. మనము మిగుల సంతసించితిమి.
4. ప్రభూ! ఎండిన యేరులు వాననీటితో నిండినట్లుగా మమ్ము మరల సంపన్నులను చేయుము.
5. కన్నీళ్ళు విడుచుచూ విత్తువారు, పాటలు పాడుచు పంట కోసికొందురు.
6. ఏడ్చుచు విత్తుటకు విత్తనములెత్తుకొనిపోయినవారు ఆనందముతో పాటలు పాడుచు, పనలతో తిరిగివత్తురు.