1. ప్రభువు మన పక్షమున ఉండనియెడల యిస్రాయేలీయులు ఈ పలుకులు పునశ్చరణము చేయుదురుగాక!
2. ప్రభువు మన పక్షమున ఉండనియెడల శత్రువులు మన మీదికి ఎత్తివచ్చినపుడు
3. కోపావేశముతో మనలను సజీవులనుగా మ్రింగివేసెడివారే.
4. జలములు మనలను ముంచివేసెడివే, వెల్లువలు మన మీదుగా పొర్లిపారెడివే.
5. ఘోషించుచు పారు ప్రవాహములు మనలను ముంచివేసెడివే.
6. శత్రువులనెడు వన్యమృగముల కోరలనుండి మనలను కాపాడిన ప్రభువు స్తుతింపబడునుగాక!
7. మనము వేటకాండ్ర ఉచ్చులనుండి పక్షివలె తప్పించుకొంటిమి. ఉచ్చులు తెగిపోయినవి, మనము తప్పించుకొంటిమి
8. భూమ్యాకాశములను చేసిన దేవునినుండి మనకు సహాయము లభించును.