ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 122

1. “మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము” అని జనులు పల్కగా నేను ఆనందము చెందితిని.

2. యెరూషలేమూ! మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి.

3. యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి.

4. యిస్రాయేలు తెగలు, ప్రభువు తెగలు, ఇచటికి ఎక్కివచ్చి ప్రభువు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును.

5. ఇచట న్యాయ సింహాసనములు, దావీదు వంశజుల న్యాయసింహాససములు నెలకొనియున్నవి.

6. యెరూషలేమునకు శుభము కలుగునట్లు ప్రార్ధింపుడు “నిన్ను అభిమానముతో చూచువారు వర్ధిల్లుదురుగాక! .

7. నీ ప్రాకారములలో శాంతి నెలకొనునుగాక! నీ ప్రాసాదములు సురక్షితముగా నుండునుగాక!”

8.  నా మిత్రులు బంధువులకొరకు నేను యెరూషలేముతో “నీకు శాంతి కలుగునుగాక!” అని పలుకుదును.

9. మన ప్రభువైన దేవుని మందిరముకొరకు నేను నీకు అభ్యుదయము కలుగవలెనని ప్రార్థింతును.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services