1. విశ్వధాత్రీ! ప్రభువునకు జేకొట్టుము.
2. సంతోషముతో ప్రభువును పూజింపుము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము.
3. ప్రభువే దేవుడని తెలిసికొనుడు. ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము.
4. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు. స్తుతిగీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన నామమును కీర్తింపుడు.
5. ప్రభువు మంచివాడు. ఆయన స్థిరమైన కృపశాశ్వతమైనది. ఆయన విశ్వసనీయత కలకాలము నిలుచును.