ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 9

1. ప్రభూ! నేను నిన్ను పూర్ణహృదయముతో స్తుతింతును. నీ అద్భుత కార్యములనెల్ల ప్రకటన చేయుదును.
2. నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడెదను.
3. నిన్ను చూచి నా శత్రువులు భయముతో వెనుదిరుగుదురు. నేలమీద కూలిపడి అసువులు బాయుదురు.
4. నీవు న్యాయముగల న్యాయాధిపతివిగాసింహాసనముపై కూర్చుండి,నాకు అనుకూలము గా తీర్పు తీర్చితివి.
5. నీవు అన్యజాతులను అణచివేసి, దుష్టులను నాశనము చేసితివి. వారి పేరు శా శ్వతముగా మాసిపోవునట్లు చేసితివి.
6. మా శత్రువులు శాశ్వతముగా అణగారిపోయిరి. నీవు వారి పట్టణములను నాశము చేసి, వారి పేరు మరల విన్పింపకుండునట్లు చేసితివి.
7. ప్రభువు కలకాలము రాజుగా నుండును. అతడు సింహాసనమునెక్కి తీర్పుతీర్చును.
8. అతడు న్యాయముతో లోకమును పరిపాలించును. ధర్మముతో జనులకు తీర్పుచెప్పును .
9. ప్రభువు పీడితులకు దుర్గము, ఆపదలో ఉన్న వారికి ఆశ్రయస్థానము.
10. ప్రభూ! నిన్ను గూర్చి తెలిసినవారు, నిన్ను నమ్ముదురు. నీ మరుగు జొచ్చిన వారిని, నీవు చేయి విడువవు.
11.సియోను నుండి పరిపాలన చేయు ప్రభువును కీర్తింపుడు. అతడు చేసిన మ హాకార్యములను జాతులకు విన్పింపుడు.
12. అతడు బాధారులను జ్ఞప్తికి తెచ్చుకొనును. బాధపడువారి మొరను తప్పక వినును.
13. ప్రభూ! నా బాధలను చూచి నన్ను కరుణింపుము. మృత్యు ద్వారము నుండి నన్ను వెనుకకు కొనిరమ్ము 
14.అప్పుడు నేను సియోను నగరద్వారముల చెంత నిలుచుండి, ప్రజల యెదుట నీ స్తుతులను పాడెదను. నీవు నన్ను రక్షించినందుకుగానుడాపరమానందము చెందెదను
15. అన్యజాతులు తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి. తాము పన్నిన ఉరులలో తామే చిక్కుకొనిరి.
16. ధర్మయుక్తమైన తీర్పు ద్వారా ప్రభువు తన్ను తాను ఎరుకపరచుకొనెను. దుష్టులు తాము పన్నిన వలలలో తామే చిక్కుకొనిరి.
17. దుష్టులును, దేవుని విస్మరించు జాతులును, మృత్యువు వాత పడుదురు గాక!
18.అక్కరలో ఉన్నవారిని ప్రభువెన్నడు మరచిపోడు. అతడు పీడితుల ఆశలనేనాడు వమ్ముచేయడు.
19. ప్రభూ! లెమ్ము! నరులను నీ మీద సవాలు చేయనీయకుము. జాతులను ప్రోగుచేసి వారికి తీర్పుచెప్పుము.
20. వారు భయముతో కంపించిపోవునట్లు చేయుము. తాము నరమాత్రులమని గ్రహించునట్లు చేయుము.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services