1. నా రక్షకుడవైన ప్రభూ! నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్నాదుకొనుము. నేను ఆపదలో ఉన్నపుడు నీవు నన్ను కాపాడితివి. కనుక ఇపుడు కరుణతో నా వేడుకోలు ఆలింపుము.
2. నరులారా! మీరెంత కాలము నన్ను అవమానింతురు? ఎంతకాలము వ్యర్ధమైన వస్తువులకు మీ హృదయ మర్పించి, అబద్దములకు పూనుకొందురు?
3. ప్రభువు తాను ప్రేమించు వారికి ఉపకారములు చేయును. అతడు నా మొర విని నన్ను ఆదుకొనును.
4. దేవునికి భయపడి పాపము చేయకుడు. ఏకాంతముగా ధ్యానము చేసికొనుచు, మౌనముగా ఉండుడు.
5. దేవునికి నీతి యుక్తమైన బలులర్పించి, అతనిని విశ్వసింపుడు.
6. చాల మంది మాకు మేలు చేయు వారెవరని అడుగుచున్నారు, ప్రభూ! నీ ముఖ కాంతిని మామీద ప్రసరింపనిమ్ము!
7. అన్యులకు ధాన్యము, ద్రాక్షాసారాయము సమృద్దిగా లభించుట వలన పొందాడు సంతోషముకంటె నీవు అధికమైన సంతోషము నాలో కలిగించితివి.
8. నేను పరుండిన వెంటనే ప్రశాంతముగా నిద్రింతును. నేను సురక్షితముగా మనునట్లు చేయువాడవు నీవే.