1. ప్రభూ! చాలా మంది నాకు శత్రువులైరి. అనేకులు నామీద తిరగబడుచున్నారు.
2.పెక్కుమంది నన్ను గూర్చి మాటలాడుచు,ప్రభువు అతనిని ఆదుకొనడులే అని పల్కుచున్నారు
3. కాని ప్రభూ! నీవు నాకు డాలువంటి వాడవు. నాకు గౌరవమును చేకూర్చి పెట్టువాడవు. నేను తలయెత్తుకొని తిరుగునట్లు చేయువాడవు.
4. నేను ఎలుగెత్తి ప్రభువునకు మొరపెట్టెదను. అతడు తన పవిత్ర పర్వతము మీదినుండి నా మొర వినును.
5. ప్రభువే నన్ను కాపాడును. కావున నేను పరుండి నిద్రింతును. మరల సురక్షితముగా మేల్కొందును.
6. పదివేల మంది శత్రువులు నన్ను చుట్టుముట్టినను నేను భీతిచెందను.
7. ప్రభూ! లెమ్ము! దేవా నన్ను కాపాడుము! నా శత్రువుల దౌడలు విరుగగొట్టము. దు పుల మూతిపండ్లు రాలగొట్టుము.
8. ప్రభువు నుండియే రక్షణము లభించును. ప్రభూ! నీవు నీ ప్రజలను దీవింపుము.