ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 14

1. దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయములో తలంతురు. వారు దుష్టుల ఘోర కార్యములు చేయుదురు. మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను.
2. జ్ఞానము కలిగి తన్ను పూజించు వారు ఎవరైన ఉన్నారాయని తెలిసికొనుటకుగాను ప్రభువు ఆకాశము నుండి నరులవైపు పారజూచును.
3. కాని జనులెల్లరు తప్పుత్రోవ పట్టిరి. ఎల్లరు దుష్టులైరి. మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను.
4. నా ప్రజలను భోజనమువలె మ్రింగివేయుచు, భగవంతునికి ప్రార్ధన ఏమాత్రము చేయని దుష్టులకు, జ్ఞానము ఇసుమంతయును లేదా?
5. ప్రభువు సత్పురుషులను ఆదరించును కనుక, ఆ దుష్టులు ఘోరమైన భయమువాత పడుదురు.
6. వారు పేదల యత్నములను భంగము చేయుదురు. కాని, ఆ పేదలు ప్రభువునే ఆశ్రయింతురు.
7. సియోను నుండి యిశ్రాయేలునకు రక్షణ కలుగును గాక! ప్రభువు తన ప్రజలకు అభ్యుదయమును దయచేసినపుడు, యాకోబు సంతతియెల్ల సంతసింతురు గాక! యిస్రాయేలీయులెల్లరు ప్రమోదము చెందుదురు గాక!