1. ప్రభూ! నీవు నన్నెంతకాలము విస్మరింతువు? కలకాలమునా? నీ దివ్యముఖమును ఎంతకాలము నా నుండి దాచుకొందువు?
2. నా హృదయము ఎంతకాలము రేయింబవళ్లు దిగులుతో నిండి యుండవలెను? ఎంత కాలము నా శత్రువులు నా మీద రెచ్చిపోవుదురు?
3. నా దేవుడైన ప్రభూ! నీవు నావైపు చూచి నాకు జవాబు చెప్పుము. నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడుము.
4. అప్పుడు నా శత్రువులు "మేమే గెలిచితిమి" అని భావింపకుందురు. నేను భంగపడనందుకు వారు ఆనందింపకుందురు కదా!
5. నామటుకు నేను నీ కృపను నమ్ముకొనియున్నాను. నీ రక్షణములో నా హృదయము సంతోషించుచున్నది.
6. ప్రభువు నాకు అపార మేలులు చేసెను. కనుక, నేనతనిని స్తుతించి కీర్తింతును.