ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 12

1. ప్రభూ! సత్పురుషులు కరువైనారు. లోకములో చిత్త శుద్ధికలవారు లోపించినారు. కనుక నీవు నన్ను ఆదుకొనుము.
2. నరులందరు కల్లలాడుచున్నారు.ఒకరితోనొకరు అబద్దములాడుచున్నారు.వారి మాటలు ముఖస్తుతులతో నిండియున్నవి.
3. ప్రభూ! నీవు ముఖస్తుతులు చేయువారి పెదవులను, గొప్పలు చెప్పవారి నాలుకలను క్రోసివేయుము.
4. "మా శక్తి మా నాలుకలోనే ఉన్నది,మా పెదవులతో మేము ఏమైన పలికెదము.మమ్ము వారించువారెవరు?" అని వారు భావించుచున్నారు.
5. 'దరిద్రులను దోచుకొనుచున్నారు, పేదలను అణగద్రోక్కుచున్నారు కనుక, నేను శీఘ్రమే సహాయము చేయుటకు వచ్చెదను. రక్షణను కోరు వారికి నేను రక్షణను ఇచ్చెదను." అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
6. ప్రభువు పలుకులు పవిత్రమైనవి. కుంపటిలో ఏడుసార్లు పుటమువేసిన వెండి వలె శ్రేష్టమైనవి.
7. ప్రభూ! మమ్ము నీ అండదండలలో ఉంచుకొనుము. ఈ పాపపు మూక నుండి మమ్ము సదా కాపాడుము.
8. ఏలన, నీచ ప్రవర్తన ప్రబలమైనపుడు దుష్టులు  గర్విష్టులై నలుదెసల సంచరింతురు కదా!

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services