ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 1

1. దుష్టుల సలహాలను పాటింపని వాడు, పాపుల మార్గమున నడువని వాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు.
2. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు, రేయింబవళ్లు దానిని ధ్యానించువాడు ధన్యుడు.
3. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు, ఆకులు వాడిపోని చెట్టువంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింటను విజయమును గాంచును.
4. కాని దుర్మార్గులిట్టివారు కారు. వారు కళ్లమున గాలికెగిరిపోవు పొట్టువంటివారు.
5. దుష్టులు దేవుని తీర్పుకు తట్టుకొని నిలువజాలరు ,నీతిగల సభలో పాపులు నిలువజాలరు .
6. నీతిమంతుల మార్గము ప్రభువునకు తెలియును. దుష్టుల మార్గము నాశమునకు గురియగును