ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2nd timothy Chapter 3 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము

 1. అంత్య దినములలో కష్టసమయములు వచ్చు నని తెలిసికొనుము.

2. ప్రజలు స్వార్థపరులును, ధనా పేక్ష కలవారును, గర్విష్ఠులును, అహంకారులును అగుదురు. వారు పరులను అవమానింతురు. తల్లిదండ్రులను ధిక్కరింతురు. కృతఘ్నులును, అపవిత్రులును అగుదురు.

3. వారు కృపారహితులును, దయాహీనులును, పరులను దూషించువారును, క్రూరులును, దౌర్జన్యమొనర్చు వారును కాగలరు. జనులను వారు ద్వేషింతురు.

4. వారు మోసగాండ్రును, నిర్లక్ష్య స్వభావులును, గర్వముచే ఉబ్బి పోయిన వారునై ఉందురు. వారు దేవునికంటె శరీర సౌఖ్యములనే ఎక్కువగ. ప్రేమింతురు.

5. మతము యొక్క కేవల బాహ్యరూపమును మాత్రమే అంగీకరించి, వారు దాని యథార్థ ప్రభావమును తిరస్కరింతురు. ఇట్టి వారికి దూరముగ ఉండుము.

6. వారిలో కొందరు గృహములందు ప్రవేశించి, పలు రకములైన వ్యామోహములచే ప్రేరేపింపబడుచు, తమ పాపభారముచే క్రుంగిపోవు బలహీనురాండ్రగు స్త్రీలను వశపరచుకొందురు.

7. అట్టి స్త్రీలు నేర్చుకొనవలెనని సర్వదా ప్రయత్నించుచున్నప్పటికిని సత్యమును ఎన్న టికి తెలిసికొనలేరు.

8. యన్నే, యంత్రేలు మోషేను ఎదిరించినట్లే, విశ్వాసభ్రష్టులును, బుద్ధిహీనులును అగు ఈ మనుజులు సత్యమును ఎదిరించుచున్నారు.

9. యన్నే, యంబ్రెల విషయములో జరిగినట్లే వారు ఎంత మూడూలో అందరును గ్రహింతురు. కనుక వారు ఎక్కువగ పురోగమింపజాలరు.

10. కాని నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవిత ధ్యేయమును గమనించితివి. నా విశ్వా సమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను,

11. నా బాధలను, నా శ్రమలను తెలిసికొంటివి. అంతియోకు, ఇకోనియ, లిస్త్రాలలో నాకేమి సంభవించెనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణములగు హింసలు నీకు తెలియును, కాని ప్రభువు వానిని అన్నింటినుండి నన్ను రక్షించెను.

12. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవితమును గడపదలచిన వారు అందరును హింసింపబడుదురు.

13. దుర్జనులును, వంచకులును ఇతరులను మోసగించుచు, ఆత్మ వంచన మొనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టులగుదురు.

14. నీవు మాత్రము నీకు బోధింపబడిన వియు, నీవు దృఢముగా విశ్వసించునవియు అగు సత్యములయందే సాగిపొమ్ము. నీవు ఎవరినుండి నేర్చుకున్నావో నీకు తెలియును.

15. బాల్యమునుండి నీవు పవిత్రలేఖనములను ఎరిగియుంటివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తుయేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును.

16-17. దైవ జనుడు ఎట్టి సత్కార్యమునకైనను సంపూర్తిగ సిద్ధపడియుండునట్లు దైవప్రేరణ వలననే కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించుటకును, దోషమును ఖండించు టకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును తోడ్పడును. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services