ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Psalms 86

1. ప్రభూ! నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్డిని, దీనుడను. 2-3. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువునుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను. 4. నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోషచిత్తుని చేయుము. 5. ప్రభూ! నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. 6. ప్రభూ! నా మొర వినుము. నా వేడుకోలును ఆలింపుము. 7. నీవు ప్రత్యుత్తరమిత్తువు కనుకనే ఆపత్కాలమున నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. 8. ప్రభూ! నీకు సాటిదైవము లేడు. నీవు చేసిన కార్యములను ఎవరును చేయలేరు. 9. నీవు కలిగించిన జాతులెల్ల నీ ఎదుటికి వచ్చి నీకు దండము పెట్టును. నీ నామమును కీర్తించును. 10. నీవు మహనీయుడవు. నీవు మాత్రమే మహత్తరకార్యములు చేయుదువు. నీవు మాత్రమే దేవుడవు. 11. ప్రభూ! నీ మార్గములను నాకు తెలియజేయుము. నేను నమ్మదగినతనముతో నీ త్రోవలలో నడతును. నేను పూర్ణహృదయముతో, నీ నామమును గౌరవింతును. 12. నా దేవుడవైన ప్రభూ! నేను నిండుమనసుతో నీకు స్తుతులు అర్పింతును. నీ నామమును సదా కీర్తింతును. 13. నీవు నాప

Psalms 85

1. ప్రభూ! నీవు నీ దేశమునకు మేలు చేసితివి. యాకోబునకు మరల పెంపును దయచేసితివి. 2. నీ ప్రజల పాపములను క్షమించితివి. వారి తప్పిదములను మన్నించితివి. 3. నీ కోపమును ఉపసంహరించుకొంటివి నీ క్రోధమును విడనాడితివి. 4. మా రక్షకుడవైన దేవా! మేము తిరిగి నీ చెంతకు వచ్చునట్లు చేయుము. మాపై నీకుగల కోపమును అణచుకొనుము. 5. నీవు మాపై కలకాలము కోపింతువా? తరతరములవరకు మామీద కినుక పూనుదువా? 6. మాకు నూతనబలమును దయచేసి, నీ ప్రజలమైన మేము నీయందు ఆనందించునట్లు చేయవా? 7. ప్రభూ! నీ కృపను మాపట్ల ప్రదర్శింపుము, నీ రక్షణమును మాకు దయచేయుము. 8. నేను ప్రభువైన దేవుని పలుకులు ఆలింతును. ఆయన తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు, .. మనము మాత్రము మరల పిచ్చిపనులకు పాల్పడరాదనియు చెప్పుచున్నాడు. 9. ఆయన తనపట్ల భయభక్తులు చూపువారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. 10. కృపయు, విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలిసికొనును. న్యాయమును, శాంతియు ఒకదానిని ఒకటి ముద్దుపెట్టుకొనును. 11. పుడమి మీదినుండి విశ్వసనీయత మొలకెత్తును. నింగినుండి న్యాయము క్రిందికి పారజూచును. 12. ప్రభువు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండున