ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Genesis chapter 47 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 47వ అధ్యాయము

 1. యోసేపు వచ్చి ఫరోరాజుతో “మా తండ్రి, సోదరులు కనానుదేశమునుండి వచ్చిరి. ఆలమందలతో గొఱ్ఱెలగుంపులతో సమస్తవస్తువులతో వచ్చి వారిపుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పెను. 2. పిదప అతడు తన సోదరులలో ఐదుగురిని ఫరోరాజు సముఖమునకు కొనివచ్చెను. 3. ఫరోరాజు “మీ వృత్తి యేమి?” అని వారినడిగెను. అంతటవారు “దొరా! మేము గొఱ్ఱెలకాపరులము. మా తాతముత్తాతలు కూడ మావంటివారే. 4. మేము ఈ దేశములో కొన్నాళ్ళపాటు బ్రతుకవచ్చితిమి. క్షామమునకు బలియైన కనానుదేశములో మందలకు మేతలేదు. గోషేను మండలములో మేముండుటకు దేవరవారు సెలవు దయచేయవలయునని, ఈ దాసులు వేడుకొనుచున్నారు” అనిరి. 5. ఫరోరాజు యోసేపుతో “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చిరన్నమాట! 6. ఈ ఐగుప్తుదేశమంతయు నీ ముందున్నది! సారవంతమైనచోటికి వారిని చేర్పుము. వారు గోపెనులో ఉండవచ్చును. వారిలో సమర్థులను మా మందలకు నాయకులుగా చేయుము” అనెను. 7. తరువాత యోసేపు తన తండ్రిని ఫరోరాజు సముఖమునకు గొనివచ్చెను. యాకోబు ఫరోరాజును దీవించెను. 8. “నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని?” అని ఫరోరాజు యాకోబును అడిగెను. 9. యాకోబు రాజుతో “నా ఇహలోకయాత్ర నూట ముప్పదియేండ్ల నుండి సాగుతున్నది. నాకు ఎన్నో ఏండ్లు లేవు. అవియును

Genesis chapter 46 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 46వ అధ్యాయము

 1. యిస్రాయేలు తనకున్నదంత బేర్షెబాకు వచ్చెను. అచట తనతండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. 2. రాత్రివేళ దర్శనములో దేవుడు “యాకోబూ! యాకోబూ!” అని పిలిచెను. యాకోబు “చిత్తముప్రభూ!” అనెను. 3. అప్పుడు దేవుడు “నేను ప్రభుడను. నీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తుదేశము వెళ్ళుటకు భయపడకుము. అచ్చట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును. 4. నీతోపాటు నేనును ఐగుప్తుదేశమునకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసికొనివత్తును. నీవు మరణించునపుడు యోసేపు నీ కన్నులు మూయును” అని చెప్పెను. 5. అంతట యాకోబు బేర్పెబా నుండి బయలుదేరెను. యిస్రాయేలు కుమారులు తమ తండ్రి యాకోబును భార్యాపిల్లలను ఫరోరాజు పంపిన బండ్లమీది కెక్కించిరి. 6. కనానులో గడించిన మందలను, వస్తుసామగ్రిని ప్రోగుచేసికొని యాకోబు, అతని సంతతి ఐగుప్తుచేరెను. 7. యాకోబు తన కుమారులను, కుమార్తెలను, మనుమలను, మనుమరాండ్రను యావత్సంతతిని తనతోపాటు ఐగుప్తుదేశమునకు కొనివచ్చెను. 8. ఐగుప్తుదేశమున ప్రవేశించిన యిస్రాయేలు పిల్లల పేర్లు ఈ క్రింది విధముగా ఉన్నవి. యాకోబు, అతని కుమారులు: యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను. 9. హనోకు, పల్లు, హెస్రోను, కర్మి అనువారు రూబేను కుమారులు. 10. యమూవేలు,