ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

telugu catholic bible pdf లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

విలాప గీతములు

1వ అధ్యాయము + -  1. ఒకప్పుడు జనసంపూర్ణమైయున్న నగరము నేడు ఎట్లు ఏకాకియైనది? జాతులలో పేరెన్నికగనినది నేడు వితంతువైనది. దేశములకు మకుటమైనది నేడు బానిసఅయ్యెను. 2. ఆ పురము రేయెల్ల ఏడ్చుచున్నది. దాని చెంపలపై కన్నీళ్ళు జారిపడుచున్నవి. పూర్వప్రియులలో ఒక్కడును దానినోదార్చుటలేదు స్నేహితులందరును దానిని వంచించి, దానికి విరోధులైరి. 3. యూదీయులు శ్రమలనుభవించి, బానిసత్వమున జిక్కి బందీలైరి. వారు జాతులనడుమ వసించుచు విశ్రాంతిని బడయజాలకున్నారు. శత్రువులు చుట్టుముట్టిరి కాన వారికి తప్పించుకొను మార్గమే లేదు. 4. సియోనునకు పోవు మార్గములు విలపించుచున్నవి. నగరమున జరుగు పండుగలకు నియామకబృందములు ఎవరును వచ్చుటలేదు ఆ నగరద్వారములు నిర్మానుష్యమైనవి. యాజకులు దుఃఖించుచున్నారు.అచట పాటలు పాడు యువతులు బాధలకు గురియైరి. నగరము ఘోరవ్యధను అనుభవించుచున్నది. 5. శత్రువులు విజయమును చేపట్టి నగరముమీద అధికారము నెరపుచున్నారు. ఆ నగరము చేసిన బహు పాపములకుగాను ప్రభువు దానిని శ్రమలపాలు చేసెను. విరోధులు దాని బిడ్డలను బంధించి చెరగొనిపోయిరి. 6. సియోను కుమారి వైభవము అంతరించెను. దాని నాయకులు మేత దొరకక చిక్కిపోయిన దుప్పులవంటి వారైరి. వేటకాండ్రను

మక్కబీయులు రెండవ గ్రంధము

1వ అధ్యాయము + -  1. “యెరూషలేములోను, యూదయాలోను నివసించు యూదులు ఐగుప్తునందలి సోదర యూదులకు శుభము పలికి వ్రాయునది. మీకు శాంతియు, అభ్యుదయము సిద్ధించునుగాక! 2. ప్రభువు తన విశ్వాస దాసులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసికొనిన నిబంధనమును స్మరించుకొని మీకు మేలు చేయునుగాక! 3. ప్రభువు మీకు తనను ఆరాధించు బుద్ది పుట్టించునుగాక! ఆయన మీరు హృదయపూర్వకముగను, ఉత్సాహముగను తన చిత్తమును పాటించునట్లు చేయునుగాక! 4. తన ధర్మశాస్త్రమును, తన ఆజ్ఞలను అర్థము చేసికొను శక్తిని మీకు ప్రసాదించి మీకు శాంతిని దయచేయునుగాక! 5. మీ ప్రార్ధనలు ఆలించి మీ తప్పిదములను మన్నించును గాక! ఆపత్కాలమున మిమ్ము చేయి విడువకుండును గాక! 6. ఇచట మేము మీ కొరకు ప్రార్థనలు అర్పించుచున్నాము. 7. గ్రీకుశకము నూట అరువది తొమ్మిదవ యేట (క్రీపూ 143) దెమేత్రియసు పరిపాలనాకాలమున మేము మీకొక లేఖను వ్రాసి ఇట్లు తెలియజేసితిమి: 'యాసోను అతని అనుచరులు మన పరిశుద్ధ దేవాలయము మీద తిరుగబడిన తరువాత మేము మతహింసలకును, ఉపద్రవములకును గురియైతిమి. 8. వారు దేవాలయ ద్వారములను తగులబెట్టి, నిర్దోషులైన ప్రజలను వధించిరి. అంతట మేము ప్రభువునకు మొరపెట్టగా ఆయన మా వేడికోలును ఆలించెను