ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

రోమీయులకు వ్రాసిన లేఖ | Roman catholic bible in Telugu

1 వ అధ్యాయము + -  1. యేసుక్రీస్తు సేవకుడును, అపోస్తలుడుగా ఉండుటకును పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు వ్రాయునది: 2. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను దేవుడు ముందుగా తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనము లందు వాగ్దానము చేసెను. 3. మన ప్రభువైన యేసు క్రీస్తు మానవుడుగా, దావీదు సంతతియై జన్మించెను. 4. కాని, ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను. 5. అన్ని జాతుల ప్రజలును ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును ఒసగెను. 6. మీరును వారిలోని వారే. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను. 7. రోము నగరమందలి పరిశుద్దులుగా ఉండు టకు పిలువబడిన దేవుని ప్రియులందరికి శుభమును కోరుచు వ్రాయునది. మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపను, సమాధానమును కలుగునుగాక! 8. మొట్టమొదట మీ అందరికొరకై యేసుక్రీస్తు ద్వారా నా దేవునకు కృతజ్ఞతలు చెప్పుకొందును. ఏలయన మీ విశ్వాసమును ప్రపంచమంతయు పొగడుచున్నది. 9. తన కుమారుని గురించి సువార్తా ప్రచారముచేయుచు, హృ

అపోస్తలుల కార్యములు | Telugu Catholic Bible

1 వ అధ్యాయము + -  1. ఓ తెయోఫిలూ! నా మొదటి గ్రంథమున యేసు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి వ్రాసితిని. 2. ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన దినమువరకు తాను ఎన్నుకొనిన అపోస్తలులకు, పవిత్రాత్మద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. 3. యేసు మరణించినపిదప, నలువది దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలువిధముల ఋజువుపరచు కొనెను, దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. 4. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: “మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి, నాతండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండుడు. 5. ఏలయన, యోహాను నీటితో బప్తిస్మమును ఇచ్చెను గాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మచేత జ్ఞానస్నానమును పొందుదురు.” 6. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, “ప్రభూ! ఇప్పుడు మీరు యిస్రాయేలునకు రాజ్యమును పునరుద్దరించెదరా?” అని అడుగగా, 7. యేసు వారితో, “కాలములును, సమయములును నా తండ్రి తన అధికారమున ఉంచుకొనియున్నాడు. వాటిని గూర్చి తెలిసికొనుట మీ పని కాదు. 8. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయా, సమరియా సీమలయ