ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

telugu catholic bible లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సామెతలు

1వ అధ్యాయము + -  1. యిస్రాయేలు రాజును, దావీదు కుమారుడునగు సొలోమోను చెప్పిన సామెతలు. 2. విజ్ఞానమును, ఉపదేశమును ఆర్జించుటకును, నిశిత దృష్టికి సంబంధించిన విషయములను ఎరుగుటకును, 3. తెలివితేటలతో మెలగుటకును, నీతిన్యాయములతో ప్రవర్తించుటకును, 4. జ్ఞానములేని వారికి తెలివిగరపుటకును, యువకులకు విజ్ఞాన విచక్షణ నేర్పుటకును, 5. జ్ఞానులు మరింత అధికముగా విజ్ఞానము బడయుటకును, వివేకవంతులు హితోపదేశము పొందుటకును, 6. ఉపమానములు, నీతికథలు అర్థము చేసికొనుటకును, సుభాషితములను, పొడుపు కథలను గ్రహించుటకును ఈ సామెతలు ఉద్దేశింపబడినవి. 7. దేవునిపట్ల భయభక్తులు కలిగియుండుటయే విజ్ఞానమునకు మొదటిమెట్టు. కాని మూఢులు విజ్ఞానోపదేశములను లెక్కచేయరు 8. కుమారా! నీ తండ్రి ఉపదేశము నాలింపుము. నీ తల్లి బోధను అనాదరము చేయకుము. 9. వారి బోధలు నీ తలకు సొగసైన పాగాగను, నీ కంఠమునకు హారముగను శోభిల్లును. 10. కుమారా! దుర్మార్గులు నిన్ను మభ్య పెట్టినచో నీవు వారి ప్రలోభములకు లొంగవలదు 11. వారు నిన్ను చూచి "నీవును మాతో రమ్ము, మనమెవరినైన హత్య చేయుదము. అమాయకులకెవరికైన ఉచ్చులు పన్నుదము. 12. పాతాళలోకము ఉన్నవారిని ఉన్నట్లుగా కబళించినట్లే మనమును వార

సమూవేలు రెండవ గ్రంధము

1వ అధ్యాయము + -  1. సౌలు మరణించెను. దావీదు అమాలెకీయులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగివచ్చి అచట రెండుదినములు గడపెను. 2. మూడవనాడు సౌలు పోరాడిన యుద్ధభూమినుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను. తలపై దుమ్ముపోసికొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేలమీదికివంగి దండము పెట్టెను. 3. “నీ వెచటనుండి వచ్చితివి?" అని దావీదు ప్రశ్నించెను. అతడు “నేను యిస్రాయేలీయుల శిబిరమునుండి వచ్చితిని. బ్రతికి బయటపడితిని” అనెను. 4. దావీదు అచటనేమి జరిగినదో చెప్పుమనెను. అతడు “మనవారు యుద్ధము నుండి పారిపోయిరి. చాలమంది కూలిరి. సౌలు, అతని కుమారుడు యోనాతాను మడిసిరి” అని చెప్పెను. 5. “సౌలు, యోనాతాను మడిసిరని నీకెట్లు తెలియును?" అని దావీదు ఆ సైనికుని అడిగెను. 6. అతడు “నేను అపుడు గిల్బోవ కొండమీద నుంటిని. సౌలు తన యీటె మీద ఆనుకొనియుండెను. 7. అంతలోనే శత్రువుల రథములు, రౌతులు అతనిని చుట్టుముట్టెను. సౌలు చుట్టును పరికించి కొండపై నున్న నన్ను చూచి కేకవేసెను. నేను 'చిత్తము ప్రభూ!' అంటిని. 8. అతడు నీవెవ్వరవని నన్నడిగెను. నేను అమాలెకీయుడనని బదులుపలికితిని. 9. అతడు 'నీవు ఇచ్చటికి వచ్చి నన్ను చంపివేయుము. న