ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

catholic bible study లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

1st timothy Chapter 3 || Telugu Catholic Bible || తిమోతికి వ్రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము

 1. ఎవడైనను సంఘాధిపత్యమును ఆశించిన యెడల అతడు ఉత్తమకార్యమును కోరుచున్నాడనుట యథార్థము. 2. దైవసంఘపు అధిపతి దోషరహితుడును, ఒకే భార్య కలవాడును, విజ్ఞత కలవాడును, ఇంద్రియ నిగ్రహము, క్రమశిక్షణను కలవాడునై ఉండవలెను, అతిథులను ఆదరింపవలెను, ఉత్తమబోధకుడై ఉండవలెను. 3. అతడు త్రాగుబోతు కాని, దుర్జనుడు కాని కాక, సాత్త్వికుడును, జగడమాడనివాడునై ఉండవలెను. అతడు ధనాపేక్ష కలిగి ఉండరాదు. 4. తన కుటుంబమును చక్కగా నిర్వహించుకొనుచు తన సంతానము తనకు విధేయులై, అన్నింట గౌరవ మర్యాదలు పాటించునట్లు చూచుకొనవలెను. 5. తన కుటుంబమునే సరిదిద్దలేని వ్యక్తి, దైవసంఘమును ఎట్లు సరిదిద్దగలడు? 6. అతడు క్రొత్తగా క్రైస్తవుడైన వ్యక్తి కారాదు. లేనిచో అతడు గర్వముచే ఉబ్బిపోయి సైతానువలె శిక్షింపబడును. 7. అతడు నిందలపాలై సైతాను వలయందు చిక్కుకొనకుండునట్లు క్రీస్తు సంఘమునకు చెందనివారి మధ్యలోకూడ మంచి పేరు కలవాడై ఉండవలెను. 8. అట్లే సంఘపరిచారకులును మంచి నడవడిక గలవారై, రెండు నాలుకలు గలవారు కాక కపటము లేనివారు కావలెను. త్రాగుబోతులు కాని అత్యాశ కలవారు. కాని కారాదు. 9. నిర్మలమైన అంతఃకరణముతో విశ్వాస పరమరహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెను. 10. మొదట వారు పరీ

Colossians chapter 4 || RCM Telugu Bible online || కొలొస్సియులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము

 1. యజమానులారా! మీరును మీ సేవకుల యెడల సక్రమముగా న్యాయముగా ప్రవర్తింపుడు. పరలోకములో మీకు కూడ ఒక యజమానుడు కలడను విషయము గుర్తుంచుకొనుడు 2. ప్రార్థనను పట్టుదలతో చేయుడు. ప్రార్థన చేయునపుడు జాగరూకతతో ఉండుడు. దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగియుండుడు. 3. ఇదే సమయములో మాకొరకు కూడ ప్రార్థింపుడు. దేవుని సందేశమును బోధించుటకును క్రీస్తు రహస్యమును వివరించుటకును దేవుడు మాకు మంచి అవకాశము ఇవ్వవలెనని ప్రార్థింపుడు. అందులకే నేను ఇప్పుడు కారాగారమునందు ఉన్నాను. 4. ఆ విషయమును నేను స్పష్టముగా వివరించు సామర్థ్యము నాకు కలుగునట్లు ప్రార్ధింపుడు. 5. అవిశ్వాసులగు వారితో వ్యవహరించునప్పుడు మీరు, మీకు గల ప్రతి అవకాశమును చక్కగా వినియోగించుకొనుచు వివేకముతో ప్రవర్తింపుడు. 6. మీ సంభాషణ ఎల్లప్పుడును, దయాపూరితముగాను, ఉప్పువేసినట్లుగా రుచికరముగాను ఉండవలెను. ప్రతి వ్యక్తికి సరియైన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను. 7. ప్రియ సోదరుడును, నమ్మకమైన పరిచారకుడును, ప్రభువు కార్యమందు తోడి సేవకుడునైన 'తుకికు' మీకు నన్ను గురించిన అన్ని వార్తలను తెలుపును. 8. ఇందుకొరకే మేము అందరమును ఎట్లు ఉన్నదియు మీకు వివరించి మీ హృదయమ