ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

adikandam లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Genesis chapter 50 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 50వ అధ్యాయము

 1. యోసేపు తండ్రి ముఖముమీద వ్రాలి అతనిని ముద్దుపెట్టుకొని రోదించెను. 2. శవమును సుగంధ ద్రవ్యములతో చేర్పుడని అతడు తన కొలువున ఉన్న వైద్యులను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. 3. నలుబది దినములు పూర్తి అయ్యెను. ఆ నలువది దినములలో వైద్యులు సుగంధ ద్రవ్యములతో శవమును భద్రపరచిరి. ఐగుప్తు దేశీయులు డెబ్బది రోజుల పాటు యాకోబుకొరకు అంగలార్చిరి. 4. దుఃఖ దినములు ముగిసిన తరువాత యోసేపు ఫరోరాజు కుటుంబము వారి వద్దకు వెళ్ళి “మీకు నామీద దయ గలదేని నా మాటగా ఫరోరాజుతో ఇట్లు మనవి చేయుడు: 5. 'నేను చనిపోవుచున్నాను. కనాను దేశములో నాకై నేను సిద్ధముచేసికొన్న సమాధిలో నన్ను పాతిపెట్టుము' అని చెప్పి మా తండ్రి నాచేత ప్రమాణము చేయించుకొనెను. సెలవైనచో అక్కడకి వెళ్ళి తండ్రిని పాతి పెట్టి తిరిగివత్తునని ఏలినవారితో చెప్పుడు” అనెను. 6. "ప్రమాణము చేసిన విధముగా వెళ్ళి తండ్రిని పాతి పెట్టుము” అని వరోరాజు సెలవిచ్చెను. 7. యోసేపు తండ్రిని సమాధి చేయుటకు వెళ్ళెను. ఫరో సేవకులు, రాజుఇంటి పెద్దలు, ఐగుప్తుదేశపు పెద్దలు, యోసేపు ఇంటివారు, అతని సోదరుల కుటుంబమువారు, తండ్రి కుటుంబమువారు, వీరందరును యోసేపు వెంటవెళ్ళిరి. 8. అతని సోదరులు తమ

Genesis chapter 49 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 49వ అధ్యాయము

 1. యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను: “నాయనలారా! దగ్గరకు రండు మునుముందు మీకేమి జరుగునో చెప్పెదను. 2. యాకోబు కుమారులారా! నా చుట్టుచేరి సావధానముగా వినుడు. యిస్రాయేలైన ఈ తండ్రిమాటలు వినుడు. 3. రూబేనూ! నీవు నా పెద్ద కుమారుడవు. నా బలము నీవే. నా ఓజస్సుకు ప్రథమఫలమును నీవే. బలగర్వములచే అతిశయించువాడవు నీవే. జలప్రవాహమువలె నీవు చంచలుడవు. అయినను నీవు అతిశయిల్లలేవు. 4. నీవు తండ్రిమంచము మీదికి ఎక్కి సవతి తల్లిని కూడితివి. నా శయ్యను మైలపరచి నన్ను ధిక్కరించితివి. 5. షిమ్యోను, లేవి సోదరులు. వారు తమ ఆయుధములను హింసకు వాడిరి. 6. నేను వారి పన్నాగములను అంగీకరింపను. నేను వారి మంత్రాలోచనలలో పాల్గొనను. వారు కోపావేశముతో మనుష్యులను చంపిరి. వారు క్రోధముతో ఎద్దుల గుదికాలినరములు తెగగొట్టిరి. 7. దారుణమైన వారి ఆగ్రహము నిందాపూరితము. ఉగ్రమైన వారి కోపము శాపారము. వారిని యాకోబు దేశములో చిందరవందర చేసెదను, వారిని యిస్రాయేలు భూమిలో చెల్లాచెదరుచేసెదను. 8. యూదా! నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని, వారిమెడలు విరుతువు. తోడబుట్టినవారు నీముందు సాగిలబడుదురు. 9. యూదా! నీవు సింహపుపిల్లవు. వేటాడి విడిదికి తిరిగ

Genesis chapter 48 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 48వ అధ్యాయము

 1. పిమ్మట తండ్రికి జబ్బు చేసినదని యోసేపునకు వార్తవచ్చెను. అతడు తన కుమారులైన మనష్షేను, ఎఫ్రాయీమును వెంటబెట్టుకొని తండ్రి కడకు వెళ్ళెను. 2. కుమారుడు యోసేపు వచ్చుచున్నాడని యాకోబునకు తెలిసెను. తన బలమంతయు కూడగట్టుకొని అతడు మంచముమీద లేచి కూర్చుండెను. 3. యాకోబు కుమారుని చూచి "కనాను దేశమందలి లూజులో సర్వశక్తిమంతుడగు దేవుడు నాకు ప్రత్యక్షమై నన్నాశీర్వదించెను. 4. దేవుడు నాతో 'యాకోబూ! నీవు పెంపొందునట్లు చేయుదును. ఒక మహాజాతిగా అవతరింప నీ సంతతిని విస్తరిల్లచేయుదును. ఈ దేశమును నీ తరువాత నీ సంతతికి శాశ్వత భుక్తి యగునట్లు ప్రసాదింతును' అనెను. 5. యోసేపూ! నేను రాకముందు ఐగుప్తుదేశములో నీకు పుట్టిన కుమారులిద్దరు నా కుమారులే అగుదురు. రూబేను షిమ్యోనుల మాదిరిగా మన్మ, ఎఫ్రాయీములుగూడ నా సొంతపుత్రులే. 6. వారి తరువాత పుట్టినవారు మాత్రము నీ సంతానమే. కాని వారు నివసించు ప్రదేశములనుబట్టి పిలువవలసి వచ్చినపుడే వారు తమ అన్నల పేరులతో పిలువబడుదురు. 7. పద్దనారాము నుండి వచ్చుచున్నప్పుడు కనాను దేశములో ఎఫ్రాతాకు ఇంకా కొంతదూరమున నుండగా త్రోవలో రాహేలు చనిపోయినది. బేత్లెహేము అను ఎఫ్రాతా నగరమార్గ మున ఆమెను పాతి పెట్

Genesis chapter 47 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 47వ అధ్యాయము

 1. యోసేపు వచ్చి ఫరోరాజుతో “మా తండ్రి, సోదరులు కనానుదేశమునుండి వచ్చిరి. ఆలమందలతో గొఱ్ఱెలగుంపులతో సమస్తవస్తువులతో వచ్చి వారిపుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పెను. 2. పిదప అతడు తన సోదరులలో ఐదుగురిని ఫరోరాజు సముఖమునకు కొనివచ్చెను. 3. ఫరోరాజు “మీ వృత్తి యేమి?” అని వారినడిగెను. అంతటవారు “దొరా! మేము గొఱ్ఱెలకాపరులము. మా తాతముత్తాతలు కూడ మావంటివారే. 4. మేము ఈ దేశములో కొన్నాళ్ళపాటు బ్రతుకవచ్చితిమి. క్షామమునకు బలియైన కనానుదేశములో మందలకు మేతలేదు. గోషేను మండలములో మేముండుటకు దేవరవారు సెలవు దయచేయవలయునని, ఈ దాసులు వేడుకొనుచున్నారు” అనిరి. 5. ఫరోరాజు యోసేపుతో “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చిరన్నమాట! 6. ఈ ఐగుప్తుదేశమంతయు నీ ముందున్నది! సారవంతమైనచోటికి వారిని చేర్పుము. వారు గోపెనులో ఉండవచ్చును. వారిలో సమర్థులను మా మందలకు నాయకులుగా చేయుము” అనెను. 7. తరువాత యోసేపు తన తండ్రిని ఫరోరాజు సముఖమునకు గొనివచ్చెను. యాకోబు ఫరోరాజును దీవించెను. 8. “నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని?” అని ఫరోరాజు యాకోబును అడిగెను. 9. యాకోబు రాజుతో “నా ఇహలోకయాత్ర నూట ముప్పదియేండ్ల నుండి సాగుతున్నది. నాకు ఎన్నో ఏండ్లు లేవు. అవియును

Genesis chapter 46 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 46వ అధ్యాయము

 1. యిస్రాయేలు తనకున్నదంత బేర్షెబాకు వచ్చెను. అచట తనతండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. 2. రాత్రివేళ దర్శనములో దేవుడు “యాకోబూ! యాకోబూ!” అని పిలిచెను. యాకోబు “చిత్తముప్రభూ!” అనెను. 3. అప్పుడు దేవుడు “నేను ప్రభుడను. నీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తుదేశము వెళ్ళుటకు భయపడకుము. అచ్చట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును. 4. నీతోపాటు నేనును ఐగుప్తుదేశమునకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసికొనివత్తును. నీవు మరణించునపుడు యోసేపు నీ కన్నులు మూయును” అని చెప్పెను. 5. అంతట యాకోబు బేర్పెబా నుండి బయలుదేరెను. యిస్రాయేలు కుమారులు తమ తండ్రి యాకోబును భార్యాపిల్లలను ఫరోరాజు పంపిన బండ్లమీది కెక్కించిరి. 6. కనానులో గడించిన మందలను, వస్తుసామగ్రిని ప్రోగుచేసికొని యాకోబు, అతని సంతతి ఐగుప్తుచేరెను. 7. యాకోబు తన కుమారులను, కుమార్తెలను, మనుమలను, మనుమరాండ్రను యావత్సంతతిని తనతోపాటు ఐగుప్తుదేశమునకు కొనివచ్చెను. 8. ఐగుప్తుదేశమున ప్రవేశించిన యిస్రాయేలు పిల్లల పేర్లు ఈ క్రింది విధముగా ఉన్నవి. యాకోబు, అతని కుమారులు: యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను. 9. హనోకు, పల్లు, హెస్రోను, కర్మి అనువారు రూబేను కుమారులు. 10. యమూవేలు,

Genesis chapter 45 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 45వ అధ్యాయము

 1. యోసేపు సేవకుల ఎదుట తన భావోద్వేగమును అణచుకొనజాలకపోయెను. “మీరందరు నా యెదుటనుండి వెళ్ళిపొండు” అని వారికి ఆనతిచ్చెను. కావున యోసేపు సోదరులకు తన్నుతాను ఎరుక పరుచుకొన్నప్పుడు అక్కడ ఎవరును లేరు. 2. అతడు బిగ్గరగా ఏడ్చెను. ఐగుప్తుదేశీయులు, ఫరోరాజు పరివారము ఆ ఏడుపు వినిరి. 3. “నేనే యోసేపును, నా తండ్రి ఇంకను బ్రతికి ఉన్నాడా?” అని అతడు సోదరులను అడిగినపుడు తమ్ముని గుర్తుపట్టిన యోసేపు సోదరులకు నోటమాటరాలేదు. వారతని ప్రశ్నలకు భయపడి వెంటనే బదులు చెప్పలేకపోయిరి. 4. అంతట యోసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారతని చెంతకువచ్చిరి. అతడు వారితో “మీరు ఐగుప్తుదేశీయులకు అమ్మిన యోసేపును నేనే. మీ సోదరుడను. 5. నన్ను బానిసగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలతచెందవలదు. మీ ప్రాణములను రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. 6. దేశములో రెండేండ్లనుండి కరువుఉన్నది. ఇక ఐదేండ్లదాక సేద్యముకాని, కోతలుగాని ఉండవు. 7. మిమ్ము అందరిని ప్రాణములతో కాపాడుటకు మీ బిడ్డలను శేషప్రజలుగా భూమిపై నిలుపుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. 8. నన్ను ఇక్కడకు పంపినది దేవుడేకాని మీరుకారు. నన్ను ఫరో రాజునకు తండ్రిగాను, అతని ఇంటికి సర్వాధి

Genesis chapter 44 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 44వ అధ్యాయము

 1. యోసేపు తన గృహనిర్వాహకుని ఇట్లు ఆజ్ఞాపించెను: “ఆ మనుష్యులు తీసికొని పోగలిగినన్ని ఆహారపదార్థములతో వారి గోనెసంచులను నింపుము. ఎవరిరూకలు వారి సంచిమూతిదగ్గర పెట్టుము. 2. ధాన్యము కొనుటకు తెచ్చిన సొమ్ముతో పాటు నా గిన్నెను, వెండిగిన్నెను కడగొట్టు తమ్ముని గోనె సంచి మూతికడ ఉంచుము.” వాడు యోసేపు చెప్పినట్లే చేసెను. 3. తెల్లవారిన తరువాత వారు ప్రయాణమై గాడిదలను తోలుకొనిపోయిరి. 4. వారు నగరము నుండి ఎంతో దూరము వెళ్ళకమునుపే యోసేపు గృహనిర్వాహకునితో “వెంటనే వెళ్ళి వారిని కలిసికొనుము. 'చేసిన మేలునకు బదులుగా కీడు చేయుదురా? నా వెండిగిన్నెను అపహరించితిరేల? 5. ఇది మా దొర పానీయము సేవించుటకు, శకునములు చూచుటకు ఉపయోగించు గిన్నెగదా? మీరెంత పాడు పని చేసితిరి' అని అనుము” అని చెప్పెను. 6. అతడు వారిని కలిసికొని యోసేపు చెప్పుమనిన మాటలన్నియు వారివద్ద వల్లించెను. 7. అంతట వారు “ఎంతమాట సెలవిచ్చితిరి! కలలోనైన మేము ఇటువంటి పనిని తలపెట్టకుందుముగాక! 8. మా గోనెసంచుల మూతులదగ్గర డబ్బు కనబడినదికదా! వానిని మీకిచ్చివేయుటకు కనాను నుండి తెచ్చితిమి. మీ యజమానుని ఇంటినుండి వెండిగాని, బంగారముగాని దొంగిలింపవలసిన అక్కరమాకేమున్నది?

Genesis chapter 43 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 43వ అధ్యాయము

 1. దేశములో కరువు ఇంకను తీవ్రముగా ఉండెను. 2. ఐగుప్తుదేశమునుండి తెచ్చిన ధాన్యమంతయు అయిపోయినది. యాకోబు బిడ్డలను పిలిచి “ఐగుప్తుదేశమునకు మరలవెళ్ళి కొంచెము ధాన్యముతెండు” అని చెప్పెను. 3. అంతట యూదా “మీ తమ్ముడు లేకుండ మీరు నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మోమాటము లేకుండా మమ్ము హెచ్చరించెను. 4. నీవు మావెంట తమ్ముని పంపినచో మేము వెళ్ళి ధాన్యము కొనితెత్తుము. 5. పంపనందువా! మేము వెళ్ళము. మీ తమ్ముడు వెంటలేకుండ మీరు నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మాతో ఖచ్చితముగా చెప్పెను” అనెను. 6. ఈ మాటలువిని యిస్రాయేలు “మీరునన్నింత రాచిరంపాన పెట్టనేల? మాకింకొక తమ్ముడున్నాడని అతనితో మీరేల చెప్పితిరి?” అని అడిగెను. 7. దానికి వారు "మేము ఏమిచేయగలము? మీ తండ్రి ఇంకను బ్రతికియున్నాడా? మీకింకొక సోదరుడు కలడా? అని అతడు మనలను గూర్చి మన చుట్టపక్కాలను గూర్చి గ్రుచ్చిగుచ్చి ప్రశ్నించెను. మేము ఆ ప్రశ్నలకు బదులిచ్చితిమి. ఐగుప్తు దేశమునకు తమ్ముని తీసికొని రండని అతడు అడుగునని మేము ఏమైనా కల గంటిమా?" అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. 8. యూదా, తండ్రితో “నాతో పాటు తమ్ముని పంపుము. మేము వెంటనే బయలుదేరి వెళ్ళెదము. ఈ విధముగా చేసి

Genesis chapter 42 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 42వ అధ్యాయము

 1. యాకోబు ఐగుప్తుదేశములో ధాన్యమున్నదని వినెను. తన కుమారులను పిలిచి “మీరెందుకు ఒకరి మొగమొకరు చూచుకొనుచు నిలబడితిరి? 2. ఐగుప్తుదేశమున కావలసినంత ధాన్యమున్నదని వింటిని. వెళ్ళి ధాన్యముకొని తీసికొని రండు. అట్లయినగాని మన ప్రాణములు నిలువవు. లేనిచో మనము చత్తుము” అనెను. 3. అంతట యోసేపు సోదరులు పదుగురు ధాన్యము కొనుటకు ఐగుప్తు దేశము వెళ్ళిరి. 4. కానియాకోబు యోసేపునకు సొంత తమ్ముడైన బెన్యామీనును మాత్రము అన్నలవెంట పంపలేదు. అతనికి ఏ అపాయమైన సంభవించునేమో నని తండ్రి భయపడెను. 5. కనానులోకూడ కరువు వచ్చుటచే ఇతరులతో పాటు యిస్రాయేలు కుమారులుకూడ ధాన్యము కొనుటకై ఐగుప్తుదేశము వచ్చిరి. 6. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారికదా! దేశ ప్రజలకందరకును ధాన్యము అమ్మెడివాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి. 7. అతడు సోదరులనుచూచి గుర్తుపట్టెను. కాని గుర్తు పట్టనట్లు నటించి వారితో పరుషముగా మాట్లాడెను. “మీరు ఎక్కడినుండి వచ్చితిరి?” అని యోసేపు వారి నడిగెను. వారు అందులకు “ధాన్యము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమి” అని చెప్పిరి. 8. యోసేపు సోదరులను గుర్తుపట్టెను కాని, వారతనిని గుర్తుపట్టలేకపోయిరి. 9. యో

Genesis chapter 41 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 41వ అధ్యాయము

 1. రెండేండ్ల తరువాత ఫరోప్రభువు ఒక కల కనెను. అతడు నైలునది ఒడ్డున నిలుచుండెను. 2. ఇంతలో ఏడు ఆవులు నదినుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను. అవి కండపట్టి చూడచక్కగానుండెను. 3. కొంతసేపటికి మరి ఏడు ఆవులు నది నుండి పైకివచ్చెను. అవి బక్కచిక్కి వికారముగా నుండెను. అవి యేటి ఒడ్డుననే మొదట వచ్చిన ఆవుల సరసన నిలబడెను. 4. బక్కచిక్కి వికారముగానున్న ఆవులు, కండపట్టి చక్కగా ఉన్న ఆవులను తినివేసెను. అంతట ఫరోరాజు. మేల్కొనెను. 5. అతడు మరల నిద్రపోయెను. మరల ఒక కలకనెను. కలలో ఒక దంటుకు ఏడు మంచి పుష్టిగల కంకులు పుట్టుటచూచెను. 6. వాని తరువాత ఏడు సన్నని పీలకంకులు పుట్టెను. అవి తూర్పుగాలి వీచుట చేత యెండిపోవుచుండెను. 7. ఈ పీలకంకులు గట్టి కంకులను మ్రింగివేసెను. ఫరోప్రభువు మేల్కొని అది కలయని గ్రహించెను. 8. తెల్లవారిన తరువాత అతని మనస్సు కలవర పడెను. ఫరోరాజు ఐగుప్తుదేశములో ఉన్న సర్వ మంత్రగాండ్రను, సమస్తజ్ఞానులను పిలిపించి, వారికి తన కలలను గూర్చి చెప్పెను. కాని వారిలో స్వప్న ఫలములను వివరించు వాడొక్కడును లేడాయెను. 9. అంతట ముఖ్య పానీయవాహకుడు తన యేలికతో “ఈ నాటికి నేను చేసిన తప్పులు నాకు తెలిసి వచ్చినవి. 10. ఒకసారి ఏలినవారు దాసు

Genesis chapter 40 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 40వ అధ్యాయము

 1. తరువాత కొన్నాళ్ళకు ఐగుప్తుదేశపు రాజ పానీయవాహకుడును, వంటవాడును తమ యేలికపట్ల తప్పుచేసిరి. 2. పానీయవాహకులలోను, వంటవారి లోను వారిరువురు ముఖ్యులు. ఫరో రాజు ఆ ఇద్దరి మీద కోపపడెను. 3. వారిని రాజసంరక్షక నాయకునకు అప్పగించి, యోసేపు ఉన్న చెరసాలలో త్రోయించెను, 4. ఆ నాయకుడు వారి మంచిచెడ్డలు చూచుటకు యోసేపును నియమించెను. యోసేపు వారి అక్కరలు తీర్చుచుండెను. వారిరువురు చెరసాలలో కొన్నాళ్ళుండిరి. 5. ఆ తరువాత పానీయవాహకుడు, వంటవాడు ఇరువురును ఒకేరాత్రి కలలుగనిరి. ఆ కలలు రెండును రెండు రకములు. 6. మరుసటి ప్రొద్దున యోసేపు వారికడకు వచ్చెను. వారు చింతాక్రాంతులై ఉండుట చూచెను. 7. “మీ మొగములు చిన్నబోయినవేల?” అని వారినడిగెను. 8. “మేము కలలుగంటిమి. వాని అర్థము వివరించి చెప్పెడువాడు ఒకడును లేడు” అని వారనిరి. యోసేపు “స్వప్న వ్యాఖ్యానము దేవుని వశముగదా? మీ కలలేమో చెప్పుడు” అనెను. 9. అంతట పానీయవాహకుడిట్లు చెప్పదొడగెను. “నా కలయిది: నా ముందు ద్రాక్షాలత ఉండుట చూచితిని. 10. దానికి మూడు రెమ్మలుగలవు. ఆ లత మొగ్గ తొడిగినదో లేదో వెంటనే పూలుపూచెను. దాని గుత్తులును పండెను. 11. నా చేతిలో ఫరో ప్రభువు పాన పాత్ర ఉన్నది. నేను పండ్లు కోస

Genesis chapter 39 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 39వ అధ్యాయము

 1. యిష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు తీసికొని వెళ్ళిరి కదా! పోతీఫరు అను ఐగుప్తుదేశీయుడు యిష్మాయేలీయులనుండి అతనిని కొనెను. ఫోతీఫరు ఫరోరాజు కడనున్న ఉద్యోగి. రాజ సంరక్షకులకు నాయకుడు. 2. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. కావుననే అతడు వర్ధిల్లెను. యోసేపు ఐగుప్తు దేశీయుడగు యజమానుని ఇంటిలో ఉండెను. 3. దేవుడు అతనికి తోడుగానుండుటయు, అతడు చేయుచున్న పనులన్నియు విజయవంతములు అగుటయు పోతీపరు కనిపెట్టెను. 4. కావున యోసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడై, ఇష్టసేవకుడు అయ్యెను. పోతీఫరు యోసేపునకు ఇంటి పెత్తనమంత ఇచ్చుటయేకాక తన సర్వస్వమును అతనికి అప్పగించెను. 5. ఆనాటినుండియు యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని చల్లనిచూపు చూచెను. పోతీపరు ఇల్లువాకిలి, పొలముపుట్ర సమస్తమును, దేవుని కృపకు పాత్రములయ్యెను. 6. అతడు తిండి మాటతప్ప ఇంకేమియు పట్టించుకొనెడివాడుకాడు. సర్వస్వమును యోసేపునకు అప్పగించి చీకుచింత లేక ఉండెడివాడు. 7. యోసేపు చక్కని రూపవంతుడు, అందగాడు. యజమానుని భార్య అతనిమీద కన్నువేసెను. తనతో శయనింపరమ్మని కోరెను. 8. కాని యోసేపు అందులకు అంగీకరింపలేదు. “అమ్మా! ఈ ఇంటిలో ఏమి జరుగుచున్నదో నాకు తప్ప నా యజమానునకు ఏమియు పట్ట

Genesis chapter 38 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 38వ అధ్యాయము

 1. అప్పుడు యూదా సోదరులను వీడి వెళ్ళి పోయెను. అతడు హీరా అనునొక అదుల్లామీయుని దగ్గర నివసింపమొదలిడెను. 2. అక్కడ యూదా కనానీయుడైన షూవ కుమార్తెను చూచెను. ఆమెను పెండ్లియాడి ఆమెతో సంసారము చేసెను. 3.. ఆమె గర్భము ధరించి కొడుకును కనెను. అతనికి 'ఏరు' అను పేరు పెట్టెను. 4. రెండవసారి ఆమె గర్భవతియై కుమారుని కని అతనికి 'ఓనాను' అను పేరు పెట్టెను. 5. మూడవసారి కూడ ఆమె గర్భవతియై ఒక కుమారుని కని, అతనికి 'షేలా' అను పేరు పెట్టెను. ఆమె మూడవ కుమారుని కన్నప్పుడు కేసిబులో ఉండెను. 6. యూదా పెద్దకుమారుడు ఏరుకు తామారు అను ఆమెను ఇచ్చి పెండ్లి చేసెను. 7. దేవుని కంటికి ఏరు చెడ్డవాడాయెను. అందుచే దేవుడతనిని చంపివేసెను. 8. అప్పుడు యూదా రెండవ కుమారుడగు ఓనానుతో “మీ వదినెను స్వీకరించి మరిది ధర్మము నెరవేర్చి మీ అన్నకు సంతానమును కలిగింపుము” అని చెప్పెను. 9. అట్టి సంతానము తనది కానేరదని ఓనానునకు తెలియును. వదినెను కూడినపుడెల్ల ఆమెకు సంతానము కలుగకుండునట్లుగా అతడు రేతస్సును భూమిపై విడిచెడివాడు. 10. దేవుని కంటికి ఓనాను చేసిన పని చెడ్డదయ్యెను. అందుచే దేవుడు వానిని కూడ చంపివేసెను. 11. అంతట యూదా కోడలు తామారుతో

Genesis chapter 37 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 37వ అధ్యాయము

 1. తన తండ్రి పరదేశిగ స్థిరపడిన కనాను దేశమునందే యాకోబు నివసించెను. 2. అతని వంశీయుల వృత్తాంతమిది. యోసేపు పదునేడేండ్ల ప్రాయమువాడయ్యెను. అతడింకను చిన్నవాడు. సోదరులతో కలిసి తండ్రిమందలను మేపెడివాడు. ఆ సోదరులెవరోకారు, యోసేపు సవతి తల్లులు బిల్హా, జిల్పాల పుత్రులే. అతడు సోదరులుచేసిన చెడుపనులు తండ్రికి చెప్పెను. 3. ముదిమిని పుట్టినవాడు కావున యిస్రాయేలు యోసేపును ఇతర కుమారులకంటె ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగుచేతుల నిలువుటంగీని కుట్టించెను,. 4. తమకంటె ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. 5. యోసేపు ఒక కల కనెను. దానిని గూర్చి సోదరులకు చెప్పగా వారతనిని మునుపటికంటె ఎక్కువగా ద్వేషింపసాగిరి. 6. యోసేపు సోదరులతో “నేను కన్నకలను గూర్చి చెప్పెదను. వినుడు. 7. మనము పొలములో పనలు కట్టుచుంటిమి. నేను కట్టిన పన చివాలున లేచి నిలువుగా నిలబడెను. మీ పనలేమో దానిచుట్టు చేరి సాగిలబడినవి” అని చెప్పెను. 8. అది విని వారు “ఏమేమి! మాకు రాజువై మా మీద పెత్తనము చేయవలెనను కొనుచున్నావా?” అనిరి. యోసేపు స్వప్నపు సుద్దులను వినిన సోదరులు మునుపటికంటె ఎక్కువగా అ

Genesis chapter 36 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 36వ అధ్యాయము

 1. ఎదోము అను ఏసావు సంతతి వారి పట్టికయిది. 2. ఏసావు కనానీయుల పిల్లలలో హిత్తీయుడగు ఏలోను కుమార్తె ఆదాను, హివ్వీయుడగు సిబ్యోనునకు కుమారుడగు ఆనా కూతురు ఓహోలిబామాను, 3. యిష్మాయేలు కుమార్తెయు నెబాయోతు చెల్లెలైన బాసేమతును పెండ్లియాడెను. 4. ఆదా ఏసావునకు ఎలీఫాసును కనెను. బాసెమతు రవూవేలును కనెను. 5. ఓహోలిబామా ఎయూషును, యాలమును, కోరాలను కనెను. వీరందరు కనాను దేశములో పుట్టిన ఏసావు కుమారులు. 6. ఏసావు భార్యలను, కుమారులను, కుమార్తెలను, ఇంటిలోనివారందరిని, కనాను దేశములో గడించిన చరాస్తులను వెంటతీసికొని, సోదరుడు యాకోబు త్రోవకు అడ్డమురాకుండ వేరొక మండలమునకు వెళ్ళెను. 7. ఇరువురికి విస్తారమయిన సంపద ఉండుటచే వారు కలిసికట్టుగా బ్రతుకలేకపోయిరి. మందలెన్నో ఉండుటచే వారికి ఉన్నచోటు చాలలేదు. 8. కావున ఏసావు సేయీరు పర్వత ప్రాంతములో నివసించెను. అతడే ఎదోము. 9. సేయీరు కొండలలో నివసించిన ఎదోమీయుల తండ్రి ఏసావు సంతతివారి పట్టిక యిది. 10. ఏసావు కుమారుల పేరులు ఇవి: ఎలీఫాసు ఏసావు భార్యయైన ఆదా కుమారుడు. రవూవేలు ఏసావు భార్యయగు బాసెమతు పుత్రుడు. 11. తేమాను, ఓమరు, సేఫో, గాతాము, కేనసులు అను వారు ఎలీఫాసు కుమారులు. 12. ఏసావు కుమారుడైన ఎ

Genesis chapter 35 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 35వ అధ్యాయము

 1. దేవుడు యాకోబుతో “నీవు లేచి, బేతేలునకు వెళ్ళి అచట స్థిరపడుము. నీవు నీ సోదరుడు ఏసావు బారినపడక తప్పించుకొని పారిపోవు చున్నపుడు, నీకు ప్రత్యక్షమయిన దేవునకు అక్కడ ఒక బలిపీఠమును నిర్మింపుము” అనెను. 2. కావున యాకోబు ఇంటివారితో, తనతో ఉన్నవారితో “మీ దగ్గర ఉన్న అన్యదేవతా విగ్రహములను పారవేయుడు, మిమ్మల్ని మీరు శుద్ధిచేసికొని, మైలబట్టలు మార్చు కొనుడు. 3. మనము బేతేలునకు వెళ్ళుదము. ఇక్కట్లు చుట్టిముట్టిననాడు నా మొరాలకించిన దేవునకు, నేను వెళ్ళిన త్రోవపొడుగున నన్ను వేయికన్నులతో కాపాడిన దేవునకు ఒక బలిపీఠము నిర్మింతును” అనెను. 4. వారందరు తమ దగ్గరనున్న దేవతా విగ్రహ ములను చెవిపోగులను యాకోబునకు అప్పగించిరి. అతడు వానినన్నిటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టెను. 5. తరువాత వారు బయలుదేరిరి. దేవునిభయము చుట్టుపట్టులనున్న నగరములపై కొచ్చెను. అక్కడి వారు యాకోబు కుమారులను వెంటాడుటకు సాహసింపలేదు. 6. యాకోబు, అతనివెంట ఉన్నవారందరు కనాను దేశమందలి లూజునకు వచ్చిరి. అదే బేతేలు. 7. అక్కడతడు ఒక బలిపీఠమును నిర్మించెను. సోదరుని బారిబడక, తప్పించుకొని పారిపోవుచున్న తనకు, ఆ చోట దేవుడు ప్రత్యక్షమయ్యెను. కావున,

Genesis chapter 34 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 34వ అధ్యాయము

 1. లేయా యాకోబుల కూతురు దీనా. ఆమె ఒకనాడు ఆ దేశస్త్రీలను చూచుటకు వెళ్ళెను. 2. హివ్వీయుడును ఆ దేశ యువరాజు అయిన హామోరు కుమారుడగు షెకెము దీనాను చూచెను. అతడు ఆమెను చెరపట్టి మానభంగము చేసెను. 3. కాని అతడు యాకోబు కూతురు దీనాను మనసార ప్రేమించెను. ఆమెకు ఓదార్పుమాటలు చెప్పెను. 4. కావున షెకెము ఆ పిల్లను నాకు పెండ్లి చేయుము అని తండ్రి హామోరును అడిగెను. . 5. యాకోబు తనకూతురు దీనాను షెకెము చెరిచెనని వినెను. అపుడతని కొడుకులందరు పొలములో మందలదగ్గర ఉండిరి. వారు ఇంటికి వచ్చువరకు అతడు నోరెత్తలేదు. 6. ఇంతలో షెకెము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడవచ్చెను. 7. అంతలో యాకోబు కుమారులు పొలము నుండి వచ్చిరి. వారికి జరిగినదంతయు తెలిసెను. షెకెము దీనాతో శయనించి యిస్రాయేలు ప్రజలను అవమానపరిచెనని యాకోబు కుమారులు ఎంతో నొచ్చుకొనిరి. అగ్గిమీద గుగ్గిలము వేసినట్లు భగ్గున మండిపడిరి. షెకెము చేసిన పని చేయగూడనిదిగదా! 8. హామోరు యాకోబుతో అతని కుమారులతో "నా కుమారుడు షెకెము మీ కుమార్తెను ప్రేమించెను. ఆమెనతనికిచ్చి పెండ్లి చేయుడని మిమ్ము వేడుకొను చున్నాను. 9. మనము వియ్యమొంది పొత్తు కలియుదము. మీరు మీ కుమార్తెలను మా వారికిచ్చి పెండ్లి

Genesis chapter 33 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 33వ అధ్యాయము

 1. యాకోబు కన్నులెత్తి చూడగా ఏసావు నాలుగువందల మందిని వెంటబెట్టుకొని వచ్చు చుండెను. అప్పుడతడు తన పిల్లలను వేరుచేసి లేయాకును, రాహేలునకును అప్పగించెను. 2. దాసీ స్త్రీలను వారి పిల్లలను అతడు ముందుంచెను. వారి వెనుక లేయాను, ఆమె పిల్లలనుంచెను. అందరికి వెనుక రాహేలు, యోసేపులుండిరి. 3. యాకోబు అందరికంటే ముందుగా వెళ్ళెను. సోదరుని సమీపించుచు అతడు ఏడుమారులు నేలమీద సాగిల బడెను. 4. ఏసావు పరుగెత్తుకొని వచ్చి యాకోబును కౌగలించుకొనెను. అతడు యాకోబు మెడపై వ్రాలి ముద్దు పెట్టుకొనెను. వారిరువురు కన్నీరు కార్చిరి. 5. ఏసావు ఆ స్త్రీలను పిల్లలను పారజూచి “నీతో పాటున్న వీరందరెవరు?” అని యాకోబును ప్రశ్నించెను. అతడు “వీరందరు దేవుడు మీ ఈ దాసునకనుగ్రహించి ఇచ్చిన పిల్లలు” అని చెప్పెను. 6. అప్పుడు దాసీ స్త్రీలు, వారి పిల్లలు దగ్గరకు వచ్చి ఏసావు ముందు సాగిల పడిరి. 7. తరువాత లేయా తనపిల్లలతో వచ్చి సాగిల పడెను. పిదప యోసేపు, రాహేలులు కూడ వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. 8. అంతట ఏసావు 'ఆ గుంపంత నాకు ఎదురుగా వచ్చినదేల?' అని యాకోబును ప్రశ్నించెను. దానికి యాకోబు “ప్రభూ! అదంతయు మీ అనుగ్రహము సంపాదించుకొనుటకే” అని చెప్పెను. 9

Genesis chapter 32 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 32వ అధ్యాయము

 1. అంతట యాకోబు ప్రయాణము సాగించు చుండగా, త్రోవలో దేవదూతలు అతనికి ఎదురొచ్చిరి. 2. 'యాకోబు వారిని చూచి "ఇది దేవుని సైన్యము” అని పలికెను. కావున ఆ చోటికి మహనయీము' అను పేరు పెట్టెను. 3. యాకోబు తనకంటే ముందుగా ఎదోము దేశమునందు సేయీరు మండలములో ఉన్న తన అన్న ఏసావునొద్దకు దూతలను పంపెను. 4. నా మాటలుగా ఏసావునకు చెప్పుడని వారితో ఇట్లనెను: “ప్రభూ! నీ దాసుడు యాకోబు ఇట్లు చెప్పుచున్నాడు. నేను పరదేశిగ లాబాను దగ్గరుంటిని. ఇప్పటివరకు అక్కడనే నివసించితిని. 5. నాకు ఎడ్లు, గాడిదలు, గొఱ్ఱెలు, మేకలు కలవు. దాసదాసీజనమున్నది. ప్రభూ! నీ అనుగ్రహము సంపాదించుకొనుటకే నీ వద్దకు వర్తమానము పంపుచున్నాను.” 6. వార్తావాహకులు తిరిగొచ్చి యాకోబుతో “మేము మీ అన్నను చూచివచ్చితిమి. నాలుగువందల మందిని వెంటబెట్టుగొని త్రోవలోనే నిన్ను కలసి కొనుటకు ఏసావు బయలుదేరి వచ్చుచున్నాడు” అనిరి. 7. యాకోబునకు మిక్కిలి భయము, తత్తరపాటు కలిగెను. అతడు తనవెంట నున్నవారిని, మేకలను, గొఱ్ఱెలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విడదీసెను. 8. ఏసావు ఒక గుంపు మీదబడి దానిని కూల్చివేసినను, రెండవగుంపైనను అతనిబారిన పడక తప్పించుకొనిపోవునని అతడు తలంచెను.

Genesis chapter 31 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 31వ అధ్యాయము

 1. “యాకోబు పూచికపుల్ల కూడ వదలకుండ మన తండ్రి ఆస్తి అంతయు కాజేసెను. మన తండ్రి సొత్తును దోచుకొనుటవలననే అతనికింత వైభవము కలిగినది” అని లాబాను కుమారులు అనుకొనుట యాకోబు వినెను. 2. లాబాను కూడ మునుపటి మాదిరిగా అతనిపట్ల ప్రసన్నుడుగా లేడు. 3. అప్పుడు దేవుడు యాకోబుతో “నీ పితరుల దేశములో ఉన్న బంధువుల యొద్దకు వెళ్ళిపొమ్ము. నేను నీ వెన్నంటి ఉందును” అని చెప్పెను. 4. కావున యాకోబు రాహేలును, లేయాను పొలములోనున్న తన మందల వద్దకు పిలిపించి వారితో, 5. "మీ తండ్రి మునుపటి వలె నాపట్ల ప్రసన్నుడగుటలేదు. అయినప్పటికి మా తండ్రి కొలిచిన దేవుడు నాకు తోడ్పడెను. 6. నేను మీ తండ్రికెట్లు వెట్టిచాకిరి చేసితినో మీకు తెలియును. 7. కాని అతడు నన్ను మోసగించెను. ఇప్పటికి పదిమార్లు అతడు నా జీతమును మార్చియుండెను. దేవుడు మీ తండ్రివలన నాకు ఏ అపాయము కలుగకుండ కాపాడెను. 8. లాబాను పొడలుగల మేకపిల్లలను నీ జీతము క్రింద కట్టుకొనుమన్నప్పుడు . దీనికి భిన్నమయిన అనువాదమును సాధ్యమే. మందలో అన్నియు పొడలుగల మేకపిల్లలే పుట్టెను. చారలుగల మేకపిల్లలను నీ జీతము క్రింద తీసుకొనుమని అన్నప్పుడు మందలో అన్నియు చారల మేక పిల్లలే పుట్టెను. 9. దేవుడు మీ తండ్రి