ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Psalms 150

1. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మందిరమున ఆయనను స్తుతింపుడు. విశాలాకాశమున ఆయన బలమును స్తుతింపుడు. 2. ఆయన చేసిన మహాకార్యములకుగాను ఆయనను స్తుతింపుడు. ఆయన మాహాత్మ్యమునకు గాను ఆయనను స్తుతింపుడు. 3. బూరలనూది ఆయనను స్తుతింపుడు. స్వరమండలముతో, సితారతో ఆయనను స్తుతింపుడు. 4. తంబురతో, నాట్యముతో ఆయనను స్తుతింపుడు. తంత్రీవాద్యములతో, పిల్లనగ్రోవితో ఆయనను స్తుతింపుడు. 5. చిటితాళములతో ఆయనను సుతింపుడు గంభీర నాదముగల తాళములతో ఆయనను స్తుతింపుడు. 6. బ్రతికియున్న ప్రాణులెల్ల ప్రభువును స్తుతించునుగాక! మీరు ప్రభువును స్తుతింపుడు.

Psalms 149

1. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్తసమాజమున ఆయనను స్తుతింపుడు. 2. యిస్రాయేలీయులు తమ సృష్టికర్తనుచూచి ఆనందింతురుగాక! సియోను పౌరులు తమ రాజునుగాంచి సంతసింతురుగాక! 3. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక! మృదంగములతో, తంత్రీవాద్యములతో ఆయనను కీర్తింతురుగాక! 4. ప్రభువు తన ప్రజలనుగాంచి ప్రీతిచెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. 5. ప్రభువు ప్రజలు తమ విజయమునకుగాను సంతసింతురుగాక! రేయెల్ల సంతసముతో గానము చేయుదురుగాక! 6. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక! వారు రెండంచుల కత్తిని చేతబూని 7. అన్యజాతులకు ప్రతీకారము చేయుదురుగాక! ఇతర జాతులను దండింతురుగాక! 8. వారి రాజులను శృంఖలాలతో బంధింతురుగాక! వారి నాయకులకు ఇనుపసంకెలలు వేయుదురుగాక! 9. వారిని ప్రభువు నిర్ణయించిన శిక్షకు గురిచేయుదురుగాక! భక్తులందరి విజయమిదియే, మీరు ప్రభువును స్తుతింపుడు.

Psalms 148

1. మీరు ప్రభువును స్తుతింపుడు. మహోన్నతస్థానమున వసించువారలారా! ఆకసము నుండి మీరు ప్రభువును స్తుతింపుడు. 2. ప్రభువు దూతలారా! మీరందరు ఆయనను స్తుతింపుడు. ప్రభువు సైన్యములారా! మీరందరు ఆయనను స్తుతింపుడు. 3. సూర్య చంద్రులారా! ఆయనను స్తుతింపుడు. ప్రకాశించు తారలారా! మీరందరు ఆయనను స్తుతింపుడు. 4. మహోన్నతాకాశమా! ప్రభువును స్తుతింపుము. ఆకాశముపైనున్న జలములారా! ఆయనను స్తుతింపుము. 5. అవియెల్ల ప్రభు నామమును స్తుతించునుగాక! ఆయన ఆజ్ఞ ఈయగా అవి పుట్టెను. 6. ప్రభువు తిరుగులేని శాసనముతో ఆ వస్తువులనెల్ల వానివాని స్థలములలో శాశ్వతముగా పాదుకొల్పెను. 7. భూమిమీద వసించువారలారా! మీరు ప్రభువును స్తుతింపుడు. మకరములారా! అగాధజలములారా! ఆయనను స్తుతింపుడు. 8. మెరుపులారా, వడగండ్లలారా, హిమమా, పొగమంచులారా, ఆయన ఆజ్ఞకు లొంగు తుఫానూ 9. కొండలారా, తిప్పలారా, పండ్లతోటలారా, అడవులారా 10. సాధుజంతువులారా, వన్యమృగములారా నేలప్రాకుప్రాణులారా, ఎగురుపక్షులారా 11. రాజులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, సమస్త పాలకులారా 12. యువతీయువకులు, వృద్ధులు, బాలబాలికలు 13. అందరును ప్రభునామమును స్తుతింతురుగాక! ఆయన నామము అన్నిటికంటెను గొప్పది. ఆయన మహిమ భూమ్

Psalms 147

1. మీరు ప్రభువును స్తుతింపుడు. మన ప్రభువును కీర్తించుట మంచిది. ఆయనను కీర్తించుట యుక్తము, మనోరంజిత కార్యము. 2. ప్రభువు యెరూషలేమును పునరుద్దరించెను. యిస్రాయేలు బందీలను స్వీయదేశమునకు కొనివచ్చెను. 3. భగ్నహృదయుల బాధలు తీర్చి వారి గాయములకు కట్టుకట్టెను. 4. ఆయన నక్షత్రములను లెక్కపెట్టును, ప్రతి తారకకును పేరు పెట్టును. 5. మన ప్రభువు మహాఘనుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానముకలవాడు. 6. ప్రభువు దీనులను లేవనెత్తును. దుష్టులను నేలకు అణగదొక్కును. 7.  ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు పాడుడు. తంత్రీవాద్యముతో ఆయనను వినుతింపుడు. 8. ఆయన ఆకాశమును మేఘములతో కప్పును. నేలపై వానలు కురియించును. కొండలపై గడ్డిని ఎదుగజేయును. 9. పశువులకును, కావుకావుమని అరచు కాకి పిల్లలకును గ్రాసమొసగును. 10. ఆయన అశ్వబలమును మెచ్చడు. నరుల శౌర్యమును చూచి మురిసిపోడు. 11. తనపట్ల భయభక్తులు చూపువారనిన, తన కృపకొరకు కాచుకొనియుండు వారనిన ఆయనకు ఇష్టము. 12. యెరూషలేమూ! ప్రభువును స్తుతింపుము. సియోనూ! నీ దేవుని కొనియాడుము. 13. ఆయన నీ కవాటములను బలపరుచును. నీ పౌరులను దీవించును. 14. నీ పొలిమేరలను సురక్షితము చేయును. నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. 1

Psalms 146

1. మీరు ప్రభువును స్తుతింపుడు. ఓ నా ప్రాణమా! ప్రభువునుస్తుతింపుము 2. నా జీవితకాలమంతయు ప్రభువును కొనియాడుదును నేను బ్రతికియున్నన్నినాళ్ళు ఆయన కీర్తనలు పాడుదును. 3. రాజులను నమ్ముకొనకుము. నరమాత్రుడెవ్వడును నిన్ను రక్షింపజాలడు. 4. నరుడు ఊపిరివిడచి మట్టిలో కలిసిపోవును. ఆ దినమే అతని యత్నములెల్ల వమ్మగును. 5. యాకోబు దేవుని అండగా బడసినవాడు, తన ప్రభువైన దేవునిమీద ఆధారపడువాడు ధన్యుడు. 6. ప్రభువు భూమ్యాకాశసముద్రములను వానిలోని సమస్తవస్తువులను చేసినవాడు, ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. 7. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆకలిగొనినవారికి ఆహారము పెట్టును. బందీలను చెరనుండి విడిపించును. 8. గ్రుడ్డి వారికి చూపునొసగును.క్రుంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును. 9. మన దేశమునవసించు పరదేశులను కాపాడును. వితంతువులను, అనాథశిశువులను ఉద్దరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరచును. 10. ప్రభువు కలకాలము పరిపాలించును. సియోనూ! నీ దేవుడు నిత్యము రాజ్యపాలనము చేయును. మీరు ప్రభువును స్తుతింపుడు.

Psalms 145

1. నా రాజువైన ప్రభూ!  నేను నీ మాహాత్మ్యమును స్తుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. 2. ప్రతిదినము నిన్ను వినుతింతును. కలకాలము నీ నామమును ప్రణుతింతును. 3. ప్రభువు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగినవాడు. ఆయన మాహాత్యమును మనము గ్రహింపజాలము. 4. తరతరముల ప్రజలు నీ చేతలను పొగడుదురు. నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు. 5. వారు నీ కీర్తి వైభవములను ఉగ్గడింతురు. నేను నీ అద్భుతక్రియలను ధ్యానింతును. 6. జనులు నీ భయంకర కార్యములను ప్రశంసింతురు నేను నీ మాహాత్మ్యమును వెల్లడిచేయుదును. 7. నరులు ఎనలేని నీ మంచితనమును, పొగడుదురు. నీ కరుణను ప్రస్తుతింతురు. 8. ప్రభువు దయాపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. 9. ఆయన అందరికి మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని  అంతటిని నెనరుతో చూచును. 10. ప్రభూ! నీవు చేసిన ప్రాణులన్నియు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. 11. వారు నీ రాజ్యవైభవమును సన్నుతింతురు. నీ ప్రాభవమును ఉగ్గడింతురు. 12. దానివలన నరులెల్లరు నీ మహాకార్యములను తెలిసికొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. 13. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును

Psalms 144

1. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక! ఆయన నా చేతులు యుద్ధము చేయుటకు నాకు తర్ఫీదు నిచ్చును. నా వ్రేళ్ళు పోరుసల్పుటకు నన్ను సంసిద్ధుని చేయును. 2. ఆయన నన్ను కృపతో చూచువాడు, నాకు ఆశ్రయస్థానము, నాకు రక్షణదుర్గము, నన్ను కాపాడువాడు, నాకు డాలు, నేను నమ్ముకొనినవాడు, నా యేలుబడిలోనున్న జాతులను లొంగదీయువాడు. 3. ప్రభూ! నీవు నరుని గుర్తించుటకు అతడు ఏపాటివాడు? నరమాత్రుని గూర్చి తలంచుటకు అతడు ఎంతటివాడు? 4. నరుడు అల్పమైన శ్వాసమువంటివాడు. అతని రోజులు నీడవలె సాగిపోవును. 5. ప్రభూ! ఆకాశమును చీల్చుకొని క్రిందికి దిగిరమ్ము పర్వతములను తాకుము, వానినుండి పొగ వెలువడును. 6. మెరుపులను మెరపించి నా శత్రువులను పారద్రోలుము. బాణములను గుప్పించి వారిని చిందరవందర చేయుము. 7. ఆకాశమునుండి నీ చేతినిచాచి నన్ను రక్షింపుము. విస్తార జలములనుండి నన్ను బయటికి లాగుము. విదేశీయుల బారినుండి నన్ను కాపాడుము. 8. వారు కల్లలాడువారు, కుడిచేతితో అబద్ద ప్రమాణములు చేయువారు. 9. ప్రభూ! నేను నీపై నూతనగీతము పాడెదను. దశతంత్రీ వాద్యముమీటి నిన్ను కీర్తించెదను. 10. నీవు రాజులకు విజయము దయచేయుదువు. నీ సేవకుడైన దావీదునకు భద్రతను ప్రసాదింతువు.

Psalms 143

1. ప్రభూ! నా ప్రార్థనను ఆలకింపుము. నీవు విశ్వసనీయుడవును, న్యాయవంతుడవును కనుక నాకు ప్రత్యుత్తరము ఒసగుము. 2. నీ దాసుని దోషినిగా నిర్ణయింపకుము. నీ ఎదుట నీతిమంతుడుగా గణింపబడు వాడెవడును లేడు. 3. నా శత్రువు నన్ను వెన్నాడెను, నన్నోడించి మన్నుగరపించెను, నన్ను గాఢాంధకారమున ఉంచెను. నేను చిరకాలము క్రితమే గతించిన వారివలెనైతిని. 4. నేను మిగుల క్రుంగిపోయితిని. నా హృదయము విషాదమున మునిగెను. 5. నేను పూర్వదినములను జ్ఞప్తికి తెచ్చుకొంటిని. నీ కార్యములెల్ల స్మరించుకొంటిని. నీ చెయిదములెల్ల ధ్యానించుకొంటిని. 6. చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. ఎండిన నేలవలె నీ కొరకు దప్పిగొనుచున్నాను. 7. ప్రభూ! శీఘ్రమే నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను మిగుల అలసియున్నాను. నీవు నాకు కనుమరుగయ్యెదవేని నేనును పాతాళము చేరుకొనువారిలో ఒకడనగుదును. 8. నేను నిన్ను నమ్మితిని గనుక నీవు నా పై కృప చూపితివని వేకువనే విందునుగాక! నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నడువవలసిన మార్గమేదియో తెలియజేయుము 9. ప్రభూ! నేను నిన్ను శరణు వేడుచున్నాను. శత్రువులనుండి నన్ను కాపాడుము. 10. నీవు నా దేవుడవు కనుక నీ చిత్తమును పాటించు విధానమును నాకు ఎరిగి

Psalms 142

1. నేను ప్రభువునకు మొరపెట్టెదను. ఆయనకు విన్నపము చేసెదను. 2. ఆయన ఎదుట నా గోడు వినిపింతును. నా వేదనలు ఆయనకు తెలుపుకొందును. 3. నా ప్రాణము శోషించుచున్నది. అయినను నా మార్గము ఆయనకు తెలియును. నా త్రోవలో శత్రువులు బోనులు పెట్టిరి. 4. నేను నా కుడిప్రక్కన పరిశీలించి చూడగా నన్ను ఆదుకొను వాడెవడును లేడయ్యెను. నన్ను కాపాడువాడుగాని, ఆదరించువాడుగాని ఎవడును కన్పింపడయ్యెను. 5. ప్రభూ! నేను నీకు మొర పెట్టుచున్నాను. నీవే నాకు ఆశ్రయనీయుడవని తలంచుచున్నాను. ఈ నేలమీద నీవే నా భాగ్యమని ఎంచుచున్నాను. 6. నా ఆర్తనాదమును ఆలకింపుము. నేను మిగుల క్రుంగిపోయితిని. నన్ను పీడించువారు నాకంటెను బలాఢ్యులు. కావున వారినుండి నీవు నన్ను కాపాడుము. 7. ఈ చెరనుండి నన్ను విడిపింపుము. అప్పుడు నీవు నాకు చేసిన ఉపకారమునకుగాను నీతిమంతుల సమాజమున నన్ను బట్టి వారు నిన్ను స్తుతించుదురు.

Psalms 141

1. ప్రభూ! నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను శీఘ్రమే నాయొద్దకు రమ్ము. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నా వేడికోలును ఆలింపుము. 2. నా ప్రార్ధన సాంబ్రాణి పొగవలెను, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలెను, నీ సన్నిధిని చేరునుగాక! 3. ప్రభూ! నా నోటికి కావలి పెట్టుము. నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము. 4. నేను చెడును తలపెట్టకుండునట్లును, దుష్టుల దుష్కార్యములలో పాల్గొనకుండునట్లును, వారి విందులు ఆరగింపకుండునట్లును చేయుము. 5. సజ్జనుడు నన్ను దయతో శిక్షించి మందలించినపుడు, అది నాకు తైలాభిషేకము అగునుగాక! అట్టి అభిషేకమును నేను నిరాకరింపక ఉందునుగాక! దుష్టుల దుష్కార్యములను చూచి నేను నిరంతరము ప్రార్ధన చేయుదును. 6. వారి పాలకులు పర్వత శిఖరము నుండి క్రిందికి త్రోయబడినపుడు నా పలుకుల యథార్థత వెల్లడియగును. 7. తిరుగటిరాయి భూమిమీద పడి బ్రద్దలైనట్లుగా వారి ఎముకలు పాతాళద్వారము చేరువన గుల్లయగును. 8. ప్రభూ! నేను నీ మీద దృష్టి నిల్పి నీ శరణుజొచ్చితిని, నన్ను మృత్యువువాత పడనీయకుము. 9. దుష్టులు నా కొరకు పెట్టిన బోనులనుండి నాకొరకు పన్నిన ఉచ్చులనుండి నన్ను కాపాడుము. 10. దుర్మార్గులు తాముపన్నిన ఉరులలో తామే చిక్కుకొందురుగాక

Psalms 140

1. ప్రభూ! దుష్టులనుండి నన్ను రక్షింపుము దౌర్జన్యపరులనుండి నన్ను కాపాడుము. 2. వారు నిరంతరము కుట్రలు పన్నుచున్నారు. కలహములు లేవదీయుచున్నారు. 3. వారి నాలుకలు పాముల నాలుకలవలె పదునుగానున్నవి. వారి నోట నాగుబాము విషమున్నది. 4. ప్రభూ! దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. నన్ను కూలద్రోయుటకు కుట్రలు పన్నెడు దౌర్జన్యపరులనుండి నన్ను రక్షింపుము. 5. గర్వాత్ములు నాకొరకు వలయొడ్డి ఉచ్చులుపన్నిరి. నా మార్గములలో ఉరులుపన్ని నన్ను పట్టుకోజూచిరి. 6. నీవే నా దేవుడవనియు నేను నీకు విన్నవించుకొంటిని. ప్రభూ! నీవు నా మొర వినుము. 7. నా దేవుడవైన ప్రభూ! నీవు బలముతో నన్నాదుకొందువు. నన్ను పోరున డాలువలె కాపాడుదువు. 8. ప్రభూ! దుష్టుల కోర్కెలు తీర్పకుము. వారి పన్నాగములను నెరవేరనీయకుము. 9. నా శత్రువులకు విజయమును దయచేయకుము. వారి బెదరింపులు వారినే నాశనము చేయునట్లు చేయుము. 10. వారిమీద నిప్పుకణికలు కురియునుగాక! వారు గోతిలోపడి మరల పైకి లేవకుందురుగాక! 11. కొండెములు చెప్పువారికి విజయము సిద్దింపకుండునుగాక! చెడు అనునది దౌర్జన్యపరులను వెన్నాడి నాశనము చేయునుగాక! 12. ప్రభూ! నీవు పేదలకోపు తీసికొందువనియు, దీనులకు న్యాయము చేకూర్తువనియు నే

Psalms 139

1. ప్రభూ! నీవు నన్ను పరిశీలించి తెలిసికొనియున్నావు. 2. నేను కూర్చుండుటయు, లేచుటయు నీకు తెలియును. నీవు దూరమునుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. 3. నేను నడచుచున్నను, పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్ల నీకు తెలియును. 4. నా నోట మాట రాకమునుపే నేనేమి చెప్పుదునో నీ వెరుగుదువు. 5. ముందువెనుకల నీవు నన్ను చుట్టుముట్టియుందువు. నీ చేతిని నామీద నిలిపియుంతువు. 6. నన్ను గూర్చిన నీ తెలివి అత్యద్భుతమైనది. అది చాల ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. 7. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షమునుండి ఎచ్చటికి పారిపోగలను? 8. నేను గగనమునకు ఎక్కిపోయినచో నీవు అచటనుందువు. పాతాళమున పరుండియున్నచో అచటను ఉందువు 9. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, 10. నీవచటను నీ చేతితో నన్ను నడిపింతువు. నీ కుడిచేతితో నన్ను ఆదుకొందువు. 11. నేను “చీకటి నన్ను కప్పివేయవలెననియు, నా చుట్టునున్న వెలుతురు చీకటిగా మారవలెననియు” అని కోరుకొన్నను 12. చీకటి నీకు చీకటి కాజాలదు.  నీ ముందట చీకటి పగటివలె ప్రకాశించును. రేయింబవళ్ళు నీకు సరిసమానము. 13. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్

Psalms 138

1. ఓ ప్రభూ! నేను నీకు హృదయ పూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. 2. నీ కృపను, విశ్వసనీయతను చూచి నీ పవిత్రమందిరమువైపు మరలి, శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును, నీ ఆజ్ఞలును అన్నిటికంటెను ముఖ్యమైనవి. 3. నేను మొరపెట్టగా  నీవు నా వేడికోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. 4. ప్రభూ! లోకములోని రాజులెల్ల నీకు వందనములు అర్పింతురు. వారు నీవు సెలవిచ్చినమాటలను వినియున్నారు. 5. వారు నీ కార్యములను, నీ మహామహిమను కొనియాడుదురు. 6. మహోన్నతస్థానము నుండియు నీవు దీనులను గమనింతువు. దూరమునుండియు గర్వాత్ములను పరికింతువు. 7. నేను కష్టములలో చిక్కుకొనినపుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. 8. నీవు ప్రమాణము చేసినదెల్ల చేసి తీరుదువు. నీ కృప శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము.

Psalms 137

1. మేము బబులోనియా, నదులచెంత కూర్చుండి, సియోనును తలంచుకొని విలపించితిమి 2. అచటనున్న నిరవంజి చెట్లకు మా తంత్రీవాద్యములను తగిలించితిమి. 3. మమ్ము బందీలుగా కొనిపోయినవారు “మీరు పాటలుపాడి మమ్ము ఉల్లాసపరచుడు” అని అడిగిరి. సియోనునుగూర్చిన గీతములు పాడుడని కోరిరి. 4. కాని అన్యదేశమున మేము ప్రభువు కీర్తనలు ఎట్లు పాడుదుము? 5. యెరూషలేమూ! నేను నిన్ను విస్మరించినచో, నా కుడిచేయి చచ్చుపడునుగాక! 6. నేను నిన్ను మరచిపోయినచో, నా మహానందము యెరూషలేమని ఎంచనిచో, నా నాలుక అంగిటికి కరచుకొనిపోవునుగాక! 7. ప్రభూ!యెరూషలేము పట్టువడిన రోజున ఎదోమీయులు ఏమి చేసిరో చూడుము. వారు “ఆ నగరమును పడగొట్టి , నేలమట్టము చేయుడు” అని పలికిరి. 8. బబులోనియా కుమారీ!  నీవు తప్పక నాశమగుదువు. నీవు మాకు చేసిన అపకారములకు నీకు ప్రత్యుపకారము చేయువాడు ధన్యుడు. 9. నీ పసిపిల్లలనెత్తి బండమీద కొట్టువాడు ధన్యుడు.

Psalms 136

1. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 2. దేవాధిదేవునికి వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 3. ప్రభువులకు ప్రభువైన వానికి వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 4. ఆయన మాత్రమే మహాద్భుతములు చేయును. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. 5. ఆయన విజ్ఞానముతో గగనమును సృజించెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 6. జలములపై భూమిని నిర్మించెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 7. మహాజ్యోతులను చేసెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. 8. పగటిని పరిపాలించుటకు సూర్యుని చేసెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 9. రేయిని ఏలుటకు తారకాచంద్రులను చేసెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 10. ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను వధించెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. 11. యిస్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి కొనివచ్చెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 12. బాహుబలముతోను, పరాక్రమముతోను వారిని వెలుపలికి కొనివచ్చెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. 13. ఎర్రసముద్రమును రెండుపాయలుగా చీల్చెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును. 14. దాని నడుమనుండి యిస్రా

Psalms 135

1-2. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువును సేవించువారలారా! ప్రభువు మందిరములో, మన దేవుని మందిరపు అవరణములలో పరిచర్యలు చేయువారలారా! ప్రభువు నామమును స్తుతింపుడు. 3. ప్రభువు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ఆయన దయాపరుడు కనుక ఆయన నామమును స్తుతింపుడు. అది సుందరమైనది. 4. ఆయన యాకోబును ఎన్నుకొనెను. యిస్రాయేలును తన జాతిని చేసికొనెను. 5. ప్రభువు మహామహుడనియు, ఎల్లవేల్పులకంటె అధికుడనియు నాకు తెలియును. 6. ఆకాశమునందును, భూమిమీదను, సముద్రమునను, పాతాళమునను, ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యములెల్ల చేయును. 7. ఆయన నేల అంచులనుండి మబ్బులు లేపును. మెరుపులతో గాలివానలు కలిగించును. తన కొట్లలోనుండి గాలిని కొనివచ్చును. 8. ఐగుప్తున నరులకును, పశువులకును పుట్టిన తొలిచూలు పిల్లలనెల్ల ఆయన హతము చేసెను. 9. ఆ దేశమున సూచకక్రియలను, అద్భుతములను చేసి ఫరోను అతని ఉద్యోగులను శిక్షించెను. 10. అన్యజాతులను పెక్కింటిని నాశనముచేసెను. బలాడ్యులైన రాజులను వధించెను. 11. అమోరీయుల రాజగు సీహోనును బాషాను రాజగు ఓగును, కనాను మండల రాజులను నాశనము చేసెను. 12. వారి భూములను తన ప్రజలైన యిస్రాయేలునకు భుక్తము చేసెను. 13. ప్రభూ! నీ పేరు శాశ్వతముగా నిలుచున

Psalms 134

1. ప్రభువు సేవకులెల్లరును, రాత్రి ప్రభువు మందిరమున పరిచర్యచేయువారు ఎల్లరును ప్రభువును స్తుతింపుడు. 2. మీరు పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి ప్రభువును స్తుతింపుడు. 3. భూమ్యాకాశములను సృజించిన ప్రభువు సియోనునుండి మిమ్ము దీవించునుగాక!

Psalms 133

1. సోదరులెల్లరును కూడి ఐకమత్యముతో జీవించుట చాల మంచిది. చాల రమ్యమైనది. 2. అట్టి జీవితము అహరోను తలమీదినుండియు, గడ్డమునుండియు కారి అతని అంగీ, మెడపట్టీమీద పడు విలువగల అభ్యంగనతైలము వంటిది. 3. అట్టి జీవితము సియోను కొండలమీద హెర్మోను మంచువంటిది. ఆ సియోనున ప్రభువు తన దీవెనను ఒసగును. శాశ్వత జీవమును దయచేయును.

Psalms 132

1. ప్రభూ! దావీదును, అతడు అనుభవించిన శ్రమలను జ్ఞప్తియందుంచుకొనుము. 2. అతడు నీకు చేసిన శపథమును, బలాఢ్యుడవగు యాకోబు దేవుడవైన నీకు చేసిన ప్రమాణమును జ్ఞప్తియందుంచుకొనుము.  3-5. “ప్రభువునకు ఒక స్థానము సిద్ధము చేయువరకు బలాఢ్యుడగు యాకోబు దేవునికి వాసస్థలము తయారుచేయువరకు, నేను ఇంటికి పోను, పడుకనెక్కను, నేను నిద్రింపను, రెప్పవాల్పను” అని దావీదు బాస చేసెను. 6. ఎఫ్రాతాలో మనము మందసమునుగూర్చి వింటిమి యెయారీము పొలములలో దానిని కనుగొంటిమి 7. "ప్రభువు మందిరమునకు పోయి, ఆయన పాదపీఠమునొద్ద ఆయనను పూజింతము” అనుకొంటిమి. 8. ప్రభూ లెమ్ము! నీ బలసూచకమైన మందసముతో నీ విశ్రాంతిస్థలమునకు కదలిరమ్ము. 9. నీ యాజకులు సదా నీతిని పాటింతురుగాక! నీ భక్తులు సంతసముతో పాడుదురుగాక! 10. నీ దాసుడైన దావీదును జూచి నీవు ఎన్నుకొనిన రాజును చేయివిడువకుము. 11. ఆడినమాట తప్పని నీవు దావీదునకు ఇట్లు బాసచేసితివి. “నీ కుమారుడు రాజై నీ తరువాత పరిపాలనము చేయును. 12. నీ తనయులు నా నిబంధనములు అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటింతురేని వారి పుత్రులును నీ సింహాసమును అధిరోహించి శాశ్వతముగా పరిపాలనము చేయుదురు”. 13. ప్రభువు సియోనును ఎన్నుకొనెను. దాన

Psalms 131

1. ప్రభూ! నా హృదయము గర్వముతో ఉప్పొంగుటలేదు. నా కన్నులకు పొరలు కమ్మలేదు. మహత్తర విషయములతోగాని, నాకు అంతుబట్టని సంగతులతోగాని, నేను సతమతమగుటలేదు. 2. నా హృదయము నిమ్మళముగను ప్రశాంతముగను ఉన్నది. పాలు మాన్పించిన శిశువు తల్లి రొమ్ము మీద ప్రశాంతముగా పరుండియున్నట్లే నా హృదయమును నాలో నిమ్మళముగానున్నది. 3. యిసాయేలీయులారా! మీరు ఇప్పుడును ఎప్పుడును ప్రభువును నమ్ముడు.

Psalms 130

1. ప్రభూ! అగాధస్థలములనుండి నేను నీకు మొర పెట్టుచున్నాను. 2. ప్రభూ! నా మొర వినుము. నీ చెవియొగ్గి నా వేడికోలును ఆలింపుము. 3. ప్రభూ! నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? 4. కాని నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీపట్ల భయభక్తులు చూపుదుము. 5. నేను ప్రభువు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. 6. కావలి వారు వేకువజాము కొరకు వేచియున్న దానికంటెను ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు వేచియున్నది. 7. యిస్రాయేలీయులు ప్రభువును నమ్ముదురు గాక! ఆయన దయకలవాడు. సమృద్ధిగా రక్షణమును ఒసగువాడు. 8. సమస్త పాపముల నుండియు యిస్రాయేలీయులను రక్షించువాడు.

Psalms 129

1. “నా బాల్యము నుండియు శత్రువులు నన్ను మిక్కిలి హింసించిరి.” యిస్రాయేలీయులు ఈ పలుకులను పునశ్చరణము చేయుదురుగాక!  2. “నా బాల్యమునుండి శత్రువులు నన్ను హింసించిరి కాని వారు నన్ను జయింపజాలరైరి. 3. వారు నా వీపును పొలమువలె దున్ని, దాని మీద పొడుగైన చాళ్ళుచేసిరి. 4. కాని ధర్మాత్ముడైన ప్రభువు దుష్టుల బానిసత్వమునుండి నన్ను తప్పించెను. 5. సియోనును ద్వేషించువారందరును సిగ్గుచెంది పరాజయమును పొందుదురుగాక! 6. వారు ఇంటికప్పు మీద మొలచిన గడ్డివలె పెరగకముందే ఎండిపోవుదురుగాక! 7. ఆ గడ్డిని ఎవరును కోయరు, కట్టలు కట్టరు. 8. ప్రభువు మిమ్ము దీవించుగాక! ప్రభువు పేరుమీదుగా మేము మిమ్ము దీవింతుము అని దారిన పోవువారెవ్వరును వారితో పలుకరు.”

Psalms 128

1. ప్రభువుపట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడచు నరులు ధన్యులు. 2. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును, అభ్యుదయమును బడయుదువు. 3. నీలోగిట నీ భార్యఫలించిన ద్రాక్ష తీగవలెనుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఓలివు పిలకలవలె ఒప్పుదురు. 4. దేవునిపట్ల భయభక్తులుగల నరుడు ఇట్టి దీవెనలు బడయును. 5. నీ జీవితకాలమందెల్ల ప్రభువు సియోనునుండి నిన్ను దీవించునుగాక! నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక 6. నీ బిడ్డల బిడ్డలను కన్నులారా చూతువుగాక! యిస్రాయేలీయులకు శాంతి కలుగునుగాక!

Psalms 127

1. ప్రభువు ఇల్లు కట్టనియెడల దానిని కట్టువారి శ్రమ వ్యర్ధమే. మనం ప్రభువు నగరమును కాపాడనియెడల కావలివారు మేల్కొనియుండియు వ్యర్ధమే. 2. వేకువనే నిద్రలేచి, రేయి ప్రొద్దుపోయినవరకు మేల్కొనియుండి, కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొనుట వ్యర్ధము. ప్రభువు తాను ప్రేమించు ప్రజలకు వారు నిద్రించునపుడును సంపదలొసగును. 3. పుత్రులు ప్రభువు ఇచ్చు వరము. తనయులు దేవుని బహుమానము. 4. యవ్వనమున పుట్టిన కుమారులు వీరుని చేతిలోని బాణములవంటివారు. 5. అట్టి బాణములతో తన అమ్ములపొదిని నింపుకొనువాడు ధన్యుడు. నగరద్వారమువద్ద శత్రువులు తారసిల్లినపుడు అతడు పరాజయమునొందడు.

Psalms 126

1. ప్రభువు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినపుడు మొదట అది ఒక కలవలె కన్పించెను. 2. అప్పుడు మనము నోరార నవ్వి, సంతసముతో పాటలు పాడితిమి. అన్యజాతి వారును “ప్రభువు వీరికి ఘనకార్యములు చేసెను' అని పలికిరి. 3. ప్రభువు మనకు అద్భుతకార్యములు చేసెను. మనము మిగుల సంతసించితిమి. 4. ప్రభూ! ఎండిన యేరులు వాననీటితో నిండినట్లుగా మమ్ము మరల సంపన్నులను చేయుము. 5. కన్నీళ్ళు విడుచుచూ విత్తువారు, పాటలు పాడుచు పంట కోసికొందురు. 6. ఏడ్చుచు విత్తుటకు విత్తనములెత్తుకొనిపోయినవారు ఆనందముతో పాటలు పాడుచు, పనలతో తిరిగివత్తురు.

Psalms 125

1. ప్రభువును నమ్మువారు సియోను కొండవలె నిశ్చలముగను, శాశ్వతముగను నిలుతురు. 2. కొండలు యెరూషలేమును చుట్టియున్నట్లుగా ఇప్పుడును ఎప్పుడును ప్రభువు తన ప్రజలను చుట్టియుండును. 3. దుష్టులు ధర్మాత్ముల నేలను పరిపాలింపజాలరు. పరిపాలింతురేని, ధర్మాత్ములును దుష్టులగుదురు. 4. ప్రభూ! ఋజుమార్గవర్తనులును, సజ్జనులును అయినవారికి నీవు మేలు చేయుము. 5. కాని వక్రమార్గమునపోవు కుటిలవర్తనులను దుష్టులతో కలిపివేయుము. యిస్రాయేలీయులకు శాంతి కలుగునుగాక!

Psalms 124

1. ప్రభువు మన పక్షమున ఉండనియెడల యిస్రాయేలీయులు ఈ పలుకులు పునశ్చరణము చేయుదురుగాక! 2. ప్రభువు మన పక్షమున ఉండనియెడల శత్రువులు మన మీదికి ఎత్తివచ్చినపుడు 3. కోపావేశముతో మనలను సజీవులనుగా మ్రింగివేసెడివారే. 4. జలములు మనలను ముంచివేసెడివే, వెల్లువలు మన మీదుగా పొర్లిపారెడివే. 5. ఘోషించుచు పారు ప్రవాహములు మనలను ముంచివేసెడివే. 6. శత్రువులనెడు వన్యమృగముల కోరలనుండి మనలను కాపాడిన ప్రభువు స్తుతింపబడునుగాక! 7. మనము వేటకాండ్ర ఉచ్చులనుండి పక్షివలె తప్పించుకొంటిమి. ఉచ్చులు తెగిపోయినవి, మనము తప్పించుకొంటిమి 8. భూమ్యాకాశములను చేసిన దేవునినుండి మనకు సహాయము లభించును.

Psalms 123

1. ప్రభూ! స్వర్గమునందు ఆసీనుడైనవాడా! నేను నీ వైపు కన్నులెత్తియున్నాను. 2. సేవకుల కన్నులు యజమానుని చేతిమీదను, సేవకురాండ్రు కన్నులు యజమానురాలి చేతిమీదను నిల్చియుండునట్లే, మన దేవుడైన ప్రభువు మనలను కరుణించువరకును, మన కన్నులను ఆయనమీద నిలిపి ఉంచుదము 3. ప్రభూ! మాకు దయచూపండి. మమ్ము కరుణించండి. మేము చాల అవమానములకు గురియైతిమి. 4. ధనవంతులు మమ్ము చాల నిందించిరి. గర్వాత్ములు మమ్ము గేలిచేసిరి.

Psalms 122

1. “మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము” అని జనులు పల్కగా నేను ఆనందము చెందితిని. 2. యెరూషలేమూ! మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. 3. యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి. 4. యిస్రాయేలు తెగలు, ప్రభువు తెగలు, ఇచటికి ఎక్కివచ్చి ప్రభువు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. 5. ఇచట న్యాయ సింహాసనములు, దావీదు వంశజుల న్యాయసింహాససములు నెలకొనియున్నవి. 6. యెరూషలేమునకు శుభము కలుగునట్లు ప్రార్ధింపుడు “నిన్ను అభిమానముతో చూచువారు వర్ధిల్లుదురుగాక! . 7. నీ ప్రాకారములలో శాంతి నెలకొనునుగాక! నీ ప్రాసాదములు సురక్షితముగా నుండునుగాక!” 8.  నా మిత్రులు బంధువులకొరకు నేను యెరూషలేముతో “నీకు శాంతి కలుగునుగాక!” అని పలుకుదును. 9. మన ప్రభువైన దేవుని మందిరముకొరకు నేను నీకు అభ్యుదయము కలుగవలెనని ప్రార్థింతును.

Psalms 121

1. నేను నా కన్నులనెత్తి కొండలవైపు పారజూచుచున్నాను. నాకు ఎచటినుండి సహాయము లభించును? 2. భూమ్యాకాశములను సృజించిన ప్రభువునుండి నాకు సాయము లభించును. 3. ఆయన నిన్ను కాలుజారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. 4. యిస్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. 5. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిల్చి నిన్ను రక్షించును. 6. పగలు నీకు సూర్యునివలన హానికలుగదు. రేయి చంద్రునివలన కీడుకలుగదు. 7. ప్రభువు నిన్ను సకల ఆపదలనుండి కాపాడును. నిన్ను సురక్షితముగానుంచును. 8. ఆయన నీ రాకపోకలన్నింటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును.

Psalms 120

1. ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఆయన నా వేడికోలును ఆలించెను. 2. ప్రభూ! కల్లలాడు వారినుండియు మోసగాండ్రనుండియు నన్ను కాపాడుము. 3. బొంకులాడు వారలారా! ప్రభువు మీకేమి చేయునో తెలియునా? ఆయన మిమ్ము ఎట్లు శిక్షించునో తెలియునా? 4. వాడిబాణములతోను, గనగనమండు నిప్పుకణికలతోను, ఆయన మిమ్ము దండించును. 5. అయ్యో! మీతో కలిసి జీవించుట మెషెక్కున, కేదారున వసించుట వంటిది. 6. శాంతిని మెచ్చని జనుల నడుమ నేను దీర్ఘకాలము జీవించితిని. 7. నేను శాంతిని గూర్చి మాటలాడగా వారు కయ్యమునకు కాలుదువ్వెడివారు.

Psalms 119

1. నిర్దోషులుగా జీవించుచు, ధర్మశాస్త్రముననుసరించువారు ధన్యులు 2. ప్రభువు ఆజ్ఞలు పాటించుచు, పూర్ణహృదయముతో అతనిని వెదకువారు ధన్యులు 3. వారు చెడును తలపెట్టక, ప్రభువు మార్గములలో నడతురు. 4. ప్రభూ! మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమము చేసితివి. 5. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును! 6. నేను నీ ఆజ్ఞలనెల్ల చేకొనినచో ఇక అవమానమునకు గురికానక్కరలేదు. 7. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకొనినందుకుగాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్తుతింతును. 8. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడనగుదును. నీవు నన్ను ఏనాడును పరిత్యజింపవలదు. 9. యువకుడు విశుద్ధజీవితమును ఎట్లు గడుపును? నీ ఆజ్ఞలను పాటించుటవలననే. 10. నేను నిన్ను పూర్ణహృదయముతో వెదకుచున్నాను. నేను నీ ఆజ్ఞలను మీరకుండునట్లు చేయుము. 11. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకుగాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని 12. ప్రభూ! నీవు ధన్యుడవు. నీ కట్టడలను నాకు బోధింపుము.  13. నీవు దయచేసిన విధులనెల్ల నేను పునశ్చరణము చేయుచున్నాను. 14. పెద్ద సంపదలను కూడబెట్టుకొనుటవలనగాక నీ శాసనములను పాటించుటవలన నేను ఆనందము చెందుదును. 15. నేను నీ ఆజ్ఞలను ధ్యాన

Psalms 118

1. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలముండును 2. “ఆయన స్థిరమైన కృప కలకాలమునుండును" అని యిస్రాయేలీయులు పలుకుదురుగాక! 3. "ఆయన స్థిరమైన కృప కలకాలమునుండును" అని అహరోను వంశజులు పలుకుదురుగాక ! 4. “ఆయన స్థిరమైన కృప కలకాలము నుండును" అని ప్రభువుపట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక! 5. నేను ఇరుకునందుండి ప్రభువునకు మొరపెట్టితిని ఆయన విశాలస్థలమునందు నాకు బదులిచ్చెను. 6. ప్రభువు నా పక్షమున వుండగా నేను జడియను. నరమాత్రులు నన్నేమి చేయగలరు? 7. ప్రభువు నా కోపు తీసికొని నాకు సాయము చేయును. నేను నా శత్రువులను జయింతును. 8. నరులను నమ్ముటకంటె, ప్రభువును ఆశ్రయించుట మేలు. 9. రాజులను నమ్ముట కంటె, ప్రభువును ఆశ్రయించుట మేలు. 10. అన్యజాతి వారు అనేకులు నన్ను చుట్టుముట్టిరి. కాని ప్రభువు బలముతో నేను వారిని తుదముట్టించితిని. 11. వారు నా చుట్టును క్రమ్ముకొనిరి. కాని ప్రభువు బలముతో, నేను వారిని తుదముట్టించితిని. 12. వారు కందిరీగలవలె నా చుట్టును ముసురుకొనిరి ముండ్ల మంటలవలె నా చుట్టును మండిరి. కాని ప్రభువు బలముతో నేను వారిని తుదముట్టించితిని. 13. శత్రువులు నాతో భీకరమ

Psalms 117

1. ఎల్లజాతులారా! ప్రభువును స్తుతింపుడు. ఎల్లప్రజలారా! అతనిని కీర్తింపుడు. 2. మనపట్ల ఆయనకు మిక్కుటమైన కృప కలదు, ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు.

Psalms 116

1. ప్రభువు నా మొర వినును కనుక నేను ఆయనను ప్రేమింతును. ఆయన నా విన్నపమును ఆలకించును. 2. నేను మొర పెట్టినపుడెల్ల నా జీవితకాలమంత ఆయన చెవియొగ్గి ఆలించును. 3. మృత్యుపాశములు నన్ను చుట్టుకొనెను. పాతాళ వేదనలు నన్ను చుట్టుముట్టెను. భయవిచారములు నన్ను క్రమ్ముకొనెను. 4. అప్పుడు నేను ప్రభువునకు మొర పెట్టితిని. “ఓ ప్రభూ! నీవు నన్ను రక్షింపుము” అని వేడుకొంటిని. 5. ప్రభువు దయాళుడు, న్యాయవంతుడు, మన దేవుడు జాలికలవాడు. 6. ప్రభువు నిష్కపటహృదయులను కాపాడును. నేను ఆపదలోనున్నపుడు ఆయన నన్ను ఆదుకొనెను. 7. నా ప్రాణమా! నీవు నమ్మకముతో ఉండుము. ప్రభువు నీకు మేలు చేసెను. 8. ఆయన నన్ను మ త్యువునుండి రక్షించెను. నా కన్నీటిని తుడిచెను. నన్ను జారిపడి పోనీయడయ్యెను. 9. కనుక నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును. 10. “నేను సర్వనాశనమైపోతిని” అని అనుకొన్నప్పుడు గూడ నా నమ్మకమును కోల్సోనైతిని 11. నేను భయమునకు లొంగి, “ఏ నరుని నమ్మగూడదు” అనుకొంటిని. 12. ప్రభువు నాకు చేసిన ఉపకారములకుగాను ఆయనకు ఏమి అర్పింపగలను? 13. రక్షణపాత్రమును చేత పుచ్చుకొని, కృతజ్ఞతావందనములు చెల్లింతును. 14. ప్రభు ప్రజలందరు ప్రోగైన సమాజమున నా మ్రొక్క

Psalms 115

1.  ప్రభూ! మాకు మహిమ తగదు. నీ కృపవలనను నీ విశ్వసనీయత వలనను నీ నామమునకే మహిమ తగియున్నది. 2. అన్యజాతి వారు “మీ దేవుడేడి” అని మనలను అడుగనేల? 3. మన దేవుడు ఆకాశముననున్నాడు. ఆయన తనకు ఇష్టము వచ్చిన కలలు కార్యమెల్ల చేయును. 4. వారి విగ్రహములు వెండిబంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. 5. వానికి నోళ్ళున్నవి కాని అవి మాట్లాడలేవు. కన్నులున్నవి కాని చూడలేవు. 6. చెవులున్నవి కాని వినలేవు. ముక్కులున్నవి కాని వాసన చూడలేవు. 7. చేతులున్నవికాని స్పృశింపలేవు. కాళ్ళున్నవి కాని నడువలేవు. వాని గొంతునుండి ఒక్కమాటయు వెలువడదు. 8. ఆ బొమ్మలను మలచినవారు, వానిని నమ్మువారు, వానివంటివారే అగుదురు. 9. యిస్రాయేలీయులారా! మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును, ఆదుకోలువై ఉన్నాడు. 10. అహరోను వంశజులారా! మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును, ఆదుకోలువై ఉన్నాడు. 11. ప్రభువుపట్ల భయభక్తులు చూపువారలారా! మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును, ఆదుకోలువై ఉన్నాడు. 12. ప్రభువు మనలను జ్ఞప్తికి తెచ్చుకొని దీవించును. ఆయన యిస్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశజులను ఆశీర్వదించును. 13. అల్పులు, ఘనులు అను తారతమ్యము లేక త

Psalms 114

1. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చినపుడు, యాకోబు వంశజులు అన్యభాషగల జనులనుండి బయల్వెడలినపుడు 2. యూదా ప్రభువునకు పవిత్రస్థలము అయ్యెను. యిస్రాయేలు అతడి సొంత రాజ్యము అయ్యెను. 3. సముద్రము ఆయనను చూచి పారిపోయెను. యోర్దాను వెనుకకు మరలెను. 4. కొండలు పొట్టేళ్ళవలె గంతులు వేసెను. తిప్పలు గొఱ్ఱెపిల్లలవలె దుమికెను. 5. సముద్రమా! నీవు పారిపోనేల? యోర్డానూ! నీవు వెనుకకు మరలనేల? 6. పర్వతములారా! మీరు పొట్టేళ్ళవలె గంతులు వేయనేల? తిప్పలారా! మీరు గొఱ్ఱెపిల్లలవలె దుముకనేల ? 7. ధాత్రీ! నీవు ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో కంపింపుము. 8. ఆయన రాతిని నీటిమడుగుగా మార్చెను. కఠినశిలను నీటిబుగ్గను చేసెను.

Psalms 113

1. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు సేవకులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు. 2. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక! 3. సూర్యోదయమునుండి సూర్యాస్తమయమువరకు ప్రభువు నామము వినుతింపబడునుగాక! 4. ప్రభువు జాతులన్నింటిని మించినవాడు ఆయన తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండును. 5. మన దేవుడైన ప్రభువువంటివాడు ఎవడు? ఆయన మహోన్నతస్థానమున వసించును. 6. అయినను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. 7. ఆయన పేదలను దుమ్ములోనుండి పైకిలేపును. దీనులను బూడిదనుండి లేవనెత్తును. 8. వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. 9. ఆయన గొడ్రాలు తన ఇంట మన్నన పొందునట్లు చేయును. ఆమెకు బిడ్డలను ఒసగి సంతుష్టి కలిగించును. మీరు ప్రభువును స్తుతింపుడు.

Psalms 112

1. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువుపట్ల భయభక్తులు చూపువాడు, ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. 2. అతని పిల్లలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు నీతిమంతుని సంతానము దీవెనలు బడయును. 3. అతని కుటుంబము సిరిసంపదలతో అలరారును. అతని నీతి కలకాలము వృద్ధిచెందును. 4. దయ, జాలి, నీతికల సజ్జనునికి చీకటిలోకూడ వెలుగు ప్రకాశించును. 5. అతడు వడ్డీ తీసికొనకయే అప్పిచ్చును. తన కార్యములనెల్ల న్యాయబుద్ధితో నిర్వహించును. 6. నీతిమంతుడు ఏనాడును కదలింపబడడు. అతని పేరు శాశ్వతముగా ఉండిపోవును. 7. స్థిరవిశ్వాసమును, ప్రభువునందు నమ్మకము కలవాడు కనుక అతడు తనను గూర్చిన దుర్వార్తలకు జడియడు. 8. అతని హృదయం స్థిరమైనది, తన శత్రువుల విషయమున తన కోరిక నెరవేరువరకు భయపడడు. 9. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును. సదా అతని నీతి నిలిచియుండును. వాని కొమ్ము ఘనతనాంది హెచ్చింపబడును. 10. దుష్టులు అతనిని గాంచి కోపింతురు. పండ్లు పటపట కొరుకుదురు. అటుపిమ్మట నాశనమై పోవుదురు. వారి ఆశలును వమ్మైపోవును.

Psalms 111

1. మీరు ప్రభువును స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణహృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. 2. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. వానిపట్ల ప్రీతికలవారు వానిని అర్థము చేసికొందురు 3. ప్రభువు చెయిదములెల్ల కీర్తి ప్రాభవములతో నిండియుండును. అతని నీతి శాశ్వతముగా నిల్చును. 4. ఆయన తన అద్భుతకార్యములను మనము జ్ఞాపకము చేసికొనునట్లు చేయును. ప్రభువు దయ, నెనరు కలవాడు. 5. తనపట్ల భయభక్తులు గలవారికి ఆయన కడుపునిండ కూడు పెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడును మరచిపోడు. 6. ఆయన అన్యజాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడిచేసెను. 7. ఆయన కార్యములందెల్ల నమ్మదగినతనమును, న్యాయమును గోచరించును. ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి. 8. అవి శాశ్వతముగా ఉండిపోవును. సత్యముతోను, యదార్థతతోను ప్రభువు వానిని దయచేసెను. 9. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను. వారితో శాశ్వతమైన నిబంధన చేసికొనెను. ఆయన నామము గంభీరమైనది. 10. దైవభీతి విజ్ఞానమునకు మొదటిమెట్టు. ఆ గుణమును అలవరచుకొనువారు వివేకవంతులు ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు.

Psalms 110

1. ప్రభువు వా ప్రభువుతో ఇట్లనెను: “నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయువరకు నీవు నా కుడిపార్శ్వమున ఆసీనుడవు కమ్ము" 2. ప్రభువు సియోనునుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును. నీవు నీ శత్రువులను పరిపాలింపుమని ఆయన వాకొనును. 3'. యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్దాలంకృతులై అరుణోదయ గర్భములోనుండి పుట్టు మంచుబిందువులవలె నీయొద్దకు వచ్చెదరు. 4. ప్రభువు బాసచేసెను, అతడు మాట తప్పడు. “నీవు మెల్కీసెదెకువలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడవుగానుందువు.” 5. ప్రభువు నీ కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయనకు కోపము వచ్చినపుడు . రాజులను నాశనము చేయును. 6. అతడు జాతులకు తీర్పుచెప్పును. యుద్ధభూమిని శవములతో నింపును. భూమిమీద రాజులనెల్ల ఓడించును. 7. దారిప్రక్కనున్న యేటినుండి నీళ్ళు త్రాగి విజయసిద్ధి వలన తలయెత్తుకొని నిలబడును.

Psalms 109

1. దేవా! నేను నిన్ను స్తుతింతును. నీవు ఇక మౌనముగా ఉండవలదు. 2. దుష్టులు, కల్లలాడువారు నన్ను నిందించుచున్నారు నామీద చాడీలు చెప్పుచున్నారు. 3. వారు నన్నుగూర్చి చెడ్డగా మాట్లాడుచున్నారు. నిష్కారణముగా నా మీదికి వచ్చుచున్నారు. 4. నేను వారిని ప్రేమించి వారికొరకు ప్రార్థన చేసినను వారు నన్ను ద్వేషించుచున్నారు. 5. నేను వారికి మేలు చేయగా, వారు నాకు కీడు చేయుచున్నారు. నేను వారిని ప్రేమింపగా వారు నన్ను ద్వేషించుచున్నారు. 6. వానిమీద దుష్టుని అధికారిగా నుంచుము. ఎవడైన ఒకడు అతనిమీద నేరము మోపునట్లు చేయుము. 7. అతనికి తీర్పుచెప్పు వారు అతనిని దోషినిగా నిర్ణయింతురుగాక! అతని ప్రార్థనకూడ నేరముగా గణింపబడునుగాక! 8. అతడు అకాల మృత్యువువాత పడునుగాక! అతని ఉద్యోగము మరియొకనికి దక్కునుగాక! 9. అతని బిడ్డలు అనాథలగుదురుగాక! అతని భార్య వితంతువగునుగాక! . 10. అతని బిడ్డలు దేశదిమ్మరులు బిచ్చగాండ్రు అగుదురుగాక! వారు వసించు పాడువడిన కొంపల నుండి వారిని తరిమివేయుదురుగాక! 11. అప్పులవారు అతని ఆస్తిని ఆక్రమించుకొందురుగాక! ను అతడు కష్టించి ఆర్జించిన సొత్తును అన్యులు దోచుకొందురుగాక! 12. ఎవడును అతనికి దయచూపకుండునుగాక! అతని అనాథ సంతాన

Psalms 108

1. దేవా! నాహృదయము నిశ్చలముగానున్నది నేను నీపై పాటలు పాడి నిన్ను సన్నుతింతును. 2. నా ప్రాభవము, ప్రభుని కీర్తించును. నా స్వరమండలమును, తంత్రీవాద్యమును మేల్కొనునుగాక! నేను ఉషస్సును మేల్కొల్పెదను. 3. ప్రభూ! నేను వివిధ జాతుల నడుమ నిన్ను స్తుతించెదను. ఆ బహుప్రజల నడుమ నిన్ను వినుతించెదను. 4. నీ కృప ఆకాశమంత ఉన్నతమైనది. నీ విశ్వసనీయత మేఘమండలమంత ఎతైనది. 5. దేవా! నీవు మింటికి పైగా ఎగయుము. ధాత్రినంతటిని నీ తేజస్సుతో నింపుము. 6. మా మొర వినుము, నీ కుడిచేతితో మమ్ము ఆదుకొనుము.  అప్పుడు నీవు కృపతో మనుజుజనులు రక్షణమును బడయుదురు. 7. ప్రభువు తన దేవాలయమునుండి మనకు ఇట్లు వాగ్దానము చేసెను: “నేను విజయము సాధించి, షెకెమును పంచిపెట్టెదను. సుక్కోతు లోయను విభజించి యిచ్చెదను. 8. గిలాదు, మనప్పే మండలములు నావే. ఎఫ్రాయీము నాకు శిరస్త్రాణము, .. యూదా నాకు రాజదండము. 9. మోవాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఎదోము మీదికి నా పాదరక్షను విసరుదును. ఫిలిస్తీయాను ఓడించి విజయనాదము చేయుదును!". 10. సురక్షితమైయున్న నగరములోనికి నన్ను ఎవ్వరు కొనిపోగలరు? తన ఎదోము లోనికి నన్ను ఎవ్వరు తీసికొనిపోగలరు? 11. దేవా! నీవు మమ్ము నిజముగనే పరిత

Psalms 107

1. “ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపకలకాలము నిలుచును”. 2. ప్రభువునుండి రక్షణము బడసినవారెల్ల పై పలుకులు ఉచ్చరింపుడు. ఆయన మిమ్ము శత్రువులనుండి కాపాడును. 3. అన్యదేశములనుండి, తూర్పు పడమరలనుండి, ఉత్తరదక్షిణములనుండి మిమ్ము తోడ్కొనివచ్చెను. 4. కొందరు దారులులేని ఎడారులలో తిరుగాడుచు జనావాసయోగ్యమైన నగరమునకు త్రోవకానరైరి. 5. వారు ఆకలిదప్పులకు గురియై సొమ్మసిల్లిపోయిరి. 6. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొర పెట్టగా ఆయన కేశములోనుండి వారిని కాపాడెను. 7. వారిని తిన్నని మార్గమున కొనిపోయి జనావాసయోగ్యమైన నగరమునకు చేర్చెను. 8. ప్రభువు కృపకుగాను, అతడు నరులకు చేసిన అద్భుతకార్యములకుగాను, వారు అతనికి వందనములు అర్పింపవలయును. 9. అతడు దాహముగొనినవారి దప్పిక తీర్చును. ఆకలిగొనినవారికి మేలి వస్తువులు ఒసగును. 10. మరికొందరు నిరాశాపూరితమైన అంధకారమున వసించుచు, బాధగొల్పు ఇనుప సంకెళ్ళచే బంధింపబడియుండిరి. 11. దేవుని ఆజ్ఞలను ధిక్కరించిరిగాన, మహోన్నతుని ఉపదేశములను నిరాకరించిరిగాన, వారు అట్టి శిక్ష తెచ్చుకొనిరి. 12. వారు ఘోర శ్రమలవలన క్రుంగిపోయి కూలి పడిపోయినను లేవనెత్తువారు లేరైరి. 13. అంతట ఆ జనులు త

Psalms 106

1. మీరెల్లపుడు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలము నిలుచును. 2. ప్రభువు మహాకార్యములను ఎవ్వడు ఉగ్గడింపగలడు? ఆయనను యుక్తరీతిని ఎవ్వడు సన్నుతింపగలడు? 3. న్యాయమును పాటించువారు, సదా నీతిని అనుసరించువారు ధన్యులు. 4. ప్రభూ! నీవు నీ ప్రజలను అనుగ్రహించునపుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నీ ప్రజలతోపాటు నన్నును రక్షింపుము. 5. నేను నీవు ఎన్నుకొనిన ప్రజలవృద్ధిని , కన్నులార చూతునుగాక! నీ జనుల సంతోషమున పాలు పొందుదునుగాక! నీకు చెందియున్నందులకుగాను గర్వింతునుగాక! 6. మా పితరులవలె మేమును పాపము చేసితిమి. మేము దుష్టులమును, దుర్మార్గులమునైతిమి. 7. ఐగుప్తున మా పితరులు నీ అద్భుతకార్యములను ఎన్నడును గ్రహింపరైరి. వారు నీ మహాప్రేమను విస్మరించిరి. రెల్లు సముద్రమువద్ద మహోన్నతునిమీద తిరుగబడిరి. 8. కాని తాను వాగ్దానము చేసినట్లే ప్రభువు వారిని రక్షించెను. దానిద్వారా ఆయన తన శక్తిని వెల్లడిచేసెను. 9. ప్రభువు ఆజ్ఞాపింపగనే రెల్లు సముద్రము ఎండిపోయెను. ఆయన తన ప్రజలను కడలిలో పొడినేలమీద నడిపించెను. 10. తమ్ము ద్వేషించు వారినుండి వారిని కాపాడెను. విరోధులనుండి వారిని రక్షించ

Psalms 105

1. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును, మాహాత్మ్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విశదము చేయుడు. 2. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుతకార్యములనెల్ల వెల్లడిచేయుడు. 3. పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించువారెల్ల సంతసింపుడు. 4. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు నిరతము ఆయనను పూజింపుడు. 5-6. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశజులునైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయనచేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. 7. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమికంతటికిని వర్తించును. 8. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిల్పుకొనును. 9. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఈసాకునకు తాను చేసిన బాసను కలకాలము నిల్పుకొనును. 10. ఆయన యాకోబుతో ఒప్పందము చేసికొనెను. అది ఎల్లకాలమును ఉండునది. 11. “నేను కనాను మండలమును నీకు ఇత్తును. అది నీకే భుక్తమగును” అని ఆయన సెలవిచ్చెను. 12. ఆ కనాను మండలమున ప్రభువు ప్రజలు కొద్దిమందియైయుండిరి. పరదేశులుగా కూడ గణింపబడిరి. 13. వారు దేశమునుండి దేశమునకు, రాజ్యమునుండి

Psalms 104

1. నాప్రాణమా! ప్రభుని స్తుతింపుము. ప్రభూ! నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రాభవవైభములను వస్త్రమువలె ధరించితివి. 2. వెలుగును వస్త్రమువలె తాల్చితివి. ఆకాశమును గుడారమువలె వ్యాపింపజేసితివి. 3. మీది జలములమీద ఆయన తన ప్రాసాదమును నిర్మించుచున్నాడు. మేఘములు ఆయన రథములు. వాయురెక్కలమీద ఆయన స్వారిచేయుచున్నాడు. 4. గాలులు ఆయనకు దూతలు, తళతళలాడు మెరుపులు ఆయన బంటులు. 5. ఆయన నేలను దాని పునాదులమీద నెలకొల్పెను . అది ఏనాటికిని కదలదు. 6. ఆ నేలను సముద్రము అను వస్త్రముతో నీవు కప్పితివి. సాగరజలము కొండలను ముంచివేసెను. 7. నీవు గద్దింపగా ఆ జలములు భయపడి పారిపోయెను మేఘగర్జనమువంటి నీ ఆజ్ఞకు వెరచి అవి పరుగిడెను. 8. ఆ నీళ్ళు కొండలనుండి జారి క్రింది లోయలోనికి పారెను. అచటనుండి అవి నీవు నిర్ణయించిన స్థలమును చేరుకొనెను. 9. నీవు ఆ నీళ్ళకు దాటరాని హద్దును నెలకొల్పితివి. అవి ఆ మేరను దాటి వచ్చి, నేలను మరల ముంచివేయవు. 10. ఆయన లోయలలో ఊటలను పుట్టించెను. వాని నీళ్ళు కొండలనడుమ పారును. 11. వన్యమృగములెల్ల ఆ బుగ్గల నీళ్ళు త్రాగును. అడవిగాడిదలు ఆ నీటితో దప్పిక తీర్చుకొనును. 12. ఆ చేరువలో పక్షులు గూళ్ళు కట్టుకొని చెట్లకొమ్మలలో నుండి కూయును.

Psalms 103

1. నా ప్రాణమా! ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్తశక్తులారా! ఆయన పవిత్రనామమును సన్నుతింపుడు. 2. నా ప్రాణమా! ప్రభువును స్తుతింపుము. ఆయన ఉపకారములను వేనిని మరువకుము. 3. ఆయన నీ పాపములనెల్ల మన్నించును. నీ వ్యాధులనెల్ల కుదుర్చును. 4. సమాధినుండి నిన్ను కాపాడును. కరుణా కటాక్షములు అనెడు కిరీటమును నీకు ఒసగును. 5. నీ జీవితకాలమంతయు శుభములతో నింపును. నీవు గరుడపక్షివలె యువకుడవుగాను, శక్తిసంపన్నుడవుగాను మనునట్లు చేయును. 6. ప్రభువు నీతిని పాటించును. పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. 7. ఆయన మోషేకు తన ప్రణాళికను ఎరిగించెను. యిస్రాయేలీయులకు తన మహాకార్యములు విశదము చేసెను. 8. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి.  9. ఆయన మనలను నిత్యము చీవాట్లు పెట్టడు.మనమీద కలకాలము కోపపడడు. 10. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. 11. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభువుపట్ల భయభక్తులు చూపువారియెడల ఆయన ప్రేమ అంత మిక్కుటముగానుండును. 12. పడమరకు తూర్పు ఎంతదూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. 13. తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భ

Psalms 102

1. ప్రభూ! నాప్రార్ధనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక! 2. నేను ఆపదలో చిక్కుకోగా నీ మొగమును నానుండి మరుగు చేయకుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. నా మొరను సత్వరమే వినుము. 3. నా ఆయుస్సు పొగవలె గతించుచున్నది. నా ఒడలు పొయ్యివలె వేడిగానున్నది. 4. నా హృదయము ఎండినగడ్డివలె వాడిపోయినది. నేను తినుటయే మరచితిని. 5. నేను పెద్దగా నిట్టూర్పులు విడుచు శబ్దమువలన నా ఎముకలు బయటికి కన్పించుచున్నవి. 6. నేను ఎడారిలోని ఉష్ణపక్షివలెను, ఆ పాడుబడిన ఇంటిలోని గుడ్లగూబవలెనున్నాను. 7. నాకు నిద్దుర పట్టుటలేదు. . నేను ఇంటి కప్పుమీద వాలియున్న ఒంటి పక్షివలెనున్నాను.  8. దినమెల్ల శత్రువులు నన్ను నిందించుచున్నారు. నన్ను గేలిచేయుచు శపించుచున్నారు. 9. నేను ఆహారముగ బూడిద తినుచున్నాను. పానీయములో నా కన్నీళ్ళు కలుపుకొని త్రాగుచున్నాను. 10. నీ ఉగ్రకోపమువలన నాకు ఈ గతి పట్టినది. నీవు నన్ను పైకెత్తి క్రిందపడవేసితివి. 11. నా జీవితము సాయంకాలపు నీడవలెనున్నది. నేను ఎండబారిన గడ్డివంటి వాడనైతిని. 12. కాని ప్రభూ! నీవు శాశ్వతముగా జీవించువాడవు. ఎల్లతరములవారును నిన్ను స్మరించుకొందురు. 13. లెమ్ము, సియోనును కనికరింపుము. ఆ నగరమ

Psalms 101

1. నేను కృపను గూర్చియు, న్యాయమును గూర్చియు పాడెదను. ప్రభూ! నా గీతమును నీకు విన్పించెదను 2. నేను ధర్మమార్గమున ప్రవర్తించెదను. నీవు నా చెంతకు ఎపుడు వచ్చెదవు? నేను నా ఇంట విశుద్ధవర్తనుడనుగా జీవించెదను 3. చెడు మీద నేను దృష్టి నిలుపను.  దేవునినుండి వైదొలగువారి క్రియలను నేను అసహ్యించుకొందును. వారితో నాకు పొత్తులేదు. 4. కపటాత్ములను నా చెంతకు రానీయను. దుష్టులను అంగీకరింపను. 5. తోడివారిమీద చాటుమాటున చాడీలు చెప్పువాని నోరుమూయింతును. పొగరుబోతును గర్వితుడునైన నరుని నేను సహింపను. 6. విశుద్ధహృదయులను నేను అంగీకరింతును. వారు నా కొలువున ఉండవచ్చును. ఋజువర్తనులైన వారు నాకు సేవకులు అగుదురు. 7. కపటాత్ములకు నా ఇంట తావులేదు. కల్లలాడువాడు నాయెదుట నిలువజాలడు. 8. నేను ప్రతి ఉదయము దేశములోని దుర్మార్గులనెల్ల నిర్మూలింతును. ప్రభువు నగరమునుండి దుర్జనులనెల్ల బహిష్కరింతును.

Psalms 100

1. విశ్వధాత్రీ! ప్రభువునకు జేకొట్టుము. 2. సంతోషముతో ప్రభువును పూజింపుము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. 3. ప్రభువే దేవుడని తెలిసికొనుడు. ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. 4. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు. స్తుతిగీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన నామమును కీర్తింపుడు. 5. ప్రభువు మంచివాడు. ఆయన స్థిరమైన కృపశాశ్వతమైనది. ఆయన విశ్వసనీయత కలకాలము నిలుచును.

Psalms 99

1. ప్రభువు రాజు! జాతులు గడగడ వణకును. ఆయన కెరూబులమీద ఆసీనుడగును. నేల కంపించును. 2. సియోనున ప్రభువు ఘనుడైయున్నాడు. . ఆయన ఎజాతులను మించినవాడు. 3. భీకరమైన ఆయన మహానామమును ఎల్లరు స్తుతింతురుగాక! ఆయన పవిత్రుడు. 4. మహారాజువైన నీవు న్యాయమును ప్రేమింతువు. నీవు ఋజువర్తనమును, నీతిన్యాయమును, ధర్మమును స్థాపించితివి. యాకోబు ప్రజలలో ఈ గుణములను నెలకొలిపితివి. 5. మన ప్రభువైన దేవుని కొనియాడుడు. ఆయన పాదపీఠముచెంత ఆయనను స్తుతింపుడు. ఆయన పవిత్రుడు. 6. మోషే అహరోనులు ఆయన యాజకులు, సమూవేలు ఆయనకు ప్రార్థన చేసినవాడు. వారు ఆయనకు మనవి చేయగా ఆయన వారి వేడికోలును ఆలించెను. 7. మేఘస్తంభమునుండి ఆయన వారితో మాట్లాడెను ఆయన దయచేసిన శాసనములను, కట్టడలను వారు పాటించిరి. 8. మా ప్రభుడవైన దేవా! నీవు ప్రజలమొరలు ఆలించితివి. నీవు ఆ జనుల పాపములకు వారిని దండించినను వారిని మన్నించు దేవుడవని రుజువు చేసికొంటివి. 9. మన ప్రభువైన దేవుని కొనియాడుడు. ఆయన పవిత్రపర్వతముచెంత ఆయనను వందింపుడు. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు.

Psalms 98

1. ప్రభువునకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుతకార్యములు చేసెను. ఆయన తన దక్షిణహస్తమువలనను, పవిత్రమైన తన బాహువువలనను, విజయమును సాధించెను. 2. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. 3. యిస్రాయేలీయులపట్ల కృపను, విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. నేల అంచులవరకుగల జనులెల్లరును మన ప్రభువు విజయమును గాంచిరి. 4. విశ్వధాత్రీ! ప్రభువునకు జేకొట్టుము. ఆనందనాదము చేయుచు, అతనికి కీర్తనలు పాడుము. 5. కీర్తనలతో ప్రభువును వినుతింపుడు. సితార వాద్యములతో సంగీతము విన్పింపుడు. 6. బూరలను, కొమ్ములను ఊది మన రాజైన ప్రభువునకు జేకొట్టుడు. 7. సముద్రము, దానిలోని జీవులు, హోరుమని గర్జించునుగాక ! లోకము, దానిలోని జీవులు కేరింతలిడునుగాక! 8. నదులు చప్పట్లు కొట్టునుగాక ! పర్వతములు ఏకమై సంతోషనాదము చేయునుగాక! 9. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును అతడు న్యాయముగ, నిష్పక్షపాతముగ లోకములోని జాతులకు తీర్పు తీర్చును.

Psalms 97

1. ప్రభువు రాజు! భూమి ఆనందించునుగాక ! నానా ద్వీపములు సంతసించునుగాక ! 2. మేఘమును, తమస్సును ప్రభువును చుట్టుముట్టియుండును. నీతిన్యాయములు, ఆయన సింహాసనమునకు పునాదులు. 3. అగ్ని ఆయనకు ముందుగా పోవుచు ఆయన చుట్టుపట్లనున్న శత్రువులనెల్ల భస్మము చేయును. 4. ఆయన మెరుపులు లోకమును వెలిగించును. ఆ దృశ్యమునుచూచి భూమి కంపించును. 5. విశ్వధాత్రికి అధిపతియైన ప్రభువును గాంచి, కొండలు మైనమువలె కరగిపోవును. 6. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకలజాతులు ఆయన మహిమను దర్శించును. 7. ప్రతిమలను కొలుచువారు విగ్రహారాధనవలన పొంగిపోవువారు, సిగ్గుతో మ్రగ్గిపోదురు. ఎల్ల వేలుపులారా! మీరు ప్రభువునకు దండము పెట్టుడు. 8. ప్రభూ! నీ న్యాయనిర్ణయములను గాంచి సియోను ఆనందించును. యూదా నగరములు సంతసించును. 9. నీవు ప్రభుడవు. భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. ఎల్ల వేలుపులను మించిన దేవుడవు. 10. చెడును ఏవగించుకొనువారిని ప్రభువు ప్రేమించును అతడు తన భక్తుల ప్రాణములను కాపాడును. వారిని దుష్టుల పీడనమునుండి విడిపించును. 11. సజ్జనుల మీద వెలుగు ప్రకాశించును. ఋజువర్తనులు ఆనందమును బడయుదురు. 12. నీతిమంతులారా! ప్రభువునందు ఆనందింపుడు. ఆయన పవిత్ర నామమునకు వ

Psalms 96

1. ప్రభువు మీద క్రొత్తపాట పాడుడు. విశ్వధాత్రీ! నీవు ప్రభువుమీద పాట పాడుము. 2. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. 3. ఆయన కీర్తిని ఎల్లజాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. 4. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు. దైవములందరికంటెను ఎక్కువగా గౌరవింపదగినవాడు. 5. అన్యజాతుల దైవములు అందరును వట్టి విగ్రహములు. కాని ప్రభువు ఆకసమును చేసెను. 6. తేజస్సును, ప్రాభవమును ఆయనయెదుట బంటులవలె నిల్చును. శక్తియు, సౌందర్యమును ఆయన మందిరమును నింపును. 7. సకలజాతులకు చెందిన నిఖిల వంశజులారా! మీరు ప్రభువును వినుతింపుడు. కీర్తియు బలమునుగల ప్రభువును కొనియాడుడు. 8. ప్రభువు మహిమాన్వితనామమును స్తుతింపుడు. సమర్పణలతో ఆయన దేవాలయములోనికి రండు 9. పవిత్రవస్త్రములు తాల్చి ప్రభువును వందింపుడు. విశ్వధాత్రీ! అతనిని చూచి గడగడ వణకుము. 10. “ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్దితో జాతులకు తీర్పుచెప్పును” అని మీరు అన్యజాతులతో నుడువుడు. 11. ప్రభువు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక! భూమి హర్షించునుగాక! సాగరమును, దానిలోన

Psalms 95

1. రండు, ప్రభువును సంతసముతో స్తుతింతము మన రక్షణదుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతము. 2. కృతజ్ఞతాస్తుతులతో ఆయనసన్నిధిలోనికి వచ్చెదము సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించుదము. 3. ప్రభువు మహాదేవుడు, దైవములందరికిని మహారాజు. 4. భూగర్భము మొదలుకొని పర్వతశిఖరములవరకు అన్నిటిని ఆయనే పరిపాలించును. 5. సముద్రము ఆయనది, ఆయనే దానిని చేసెను. ధరణి ఆయనది, ఆయనే దానిని కలిగించెను. 6. రండు, శిరమువంచి ఆయనను ఆరాధించుదము మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. 7. ఆయన మన దేవుడు, . మనము ఆయన కాచి కాపాడు ప్రజలము. ఆయన మేపు మందలము. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును! 8. “మెరిబాచెంత మీ పితరులవలె, . ఆనాడు ఎడారిలో మస్సాచెంత మీ పితరులవలె మీరును హృదయములను కఠినము చేసికోవలదు. 9. నేను చేసిన కార్యములను చూచిన పిదపకూడ మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురిచేసిరి 10. నలుబదియేండ్లపాటు ఆ తరమువారు నన్ను విసిగించిరి. 'ఈ జనులకు నాపట్ల నమ్మకము లేదు. వీరు నా మార్గములను గుర్తింపరు' అని నేను పలికితిని. 11. కనుక నేను వారి మీద ఆగ్రహము చెంది మీరు నా విశ్రమస్థానమును చేరజాలరని ప్రతిజ్ఞ చేసితిని.”

Psalms 94

1. ప్రతీకారము చేయువాడవైన ప్రభూ! ప్రతీకారము చేయువాడవైన ప్రభూ! నీ తేజస్సును కన్పింపనిమ్ము. 2. లోకమునకు న్యాయాధిపతివైన దేవా! నీవు పైకి లేచి గర్వాత్ములకు శాస్తిచేయుము. 3. ప్రభూ!దుర్మార్గులు ఎంతకాలము ఆనందింతురు? ఎంతకాలము ఆనందింతురు? 4. ఎంతకాలము గర్వముతో బింకములాడుచు, తమ దుష్కార్యములను గూర్చి ప్రగల్భములు పలుకుదురు? 5. ప్రభూ! వారు నీ జనులను అణగదొక్కుచున్నారు. నీవు ఎన్నుకొనిన ప్రజలను పీడించుచున్నారు. 6. వితంతువులను మాతో వసించు పరదేశులను చంపుచున్నారు. అనాథబాలలను వధించుచున్నారు. 7. "ప్రభువేమియు చూడడులే, యిస్రాయేలు దేవుడేమియు గమనింపడులే” అనుచున్నారు. 8. జనులారా! మీరు పరమమూర్ఖులు, మందమతులు. మీకు వివేకము ఎప్పుడు అలవడును? 9. చెవిని చేసినవాడు వినలేదా? కంటిని కలిగించినవాడు కనలేదా? 10. అన్యజాతులను మందలించువాడు వారిని శిక్షింపలేడా? నరులకు బోధించువానికి జ్ఞానము లేదా? 11. ప్రజల ఆలోచనలు ప్రభువునకు తెలియును. వారి తలపులు నిరర్ధకమైనవని ఆయనెరుగును. 12. ప్రభూ! నీవు ఉపదేశముచేయు నరుడు ధన్యుడు. నీవు ధర్మశాస్త్రము బోధించుజనుడు భాగ్యవంతుడు 13. కష్టకాలమున నీవు అతనికి చిత్తశాంతిని అనుగ్రహింతువు. దుష్టులు కూలుటకు

Psalms 93

1. ప్రభువు రాజు. అతడు ప్రాభవమును వస్త్రమువలె ధరించెను. బలమును వస్త్రమువలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చలింపదు. 2. ప్రభూ! నీ సింహాసనము అనాదికాలము నుండియు స్థిరముగా నిల్చియున్నది. నీవు అనాదికాలమునుండియు ఉన్నవాడవు. 3. ప్రభూ! సాగరగర్భములు ఉప్పొంగినవి. అవి గళమెత్తి హోరుమని శబ్దించినవి. 4. కాని ప్రభువు కడలిహోరుకంటెను, సాగర తరంగములకంటెను అధికుడై ఆకాశమున మహోన్నతుడుగా పరిపాలన చేయును. 5. ప్రభూ! నీ శాసనములు ఎన్నటికిని మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది.

Psalms 92

1. దేవా! నీకు వందనములు అర్పించుట మంచిది మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో స్తుతించుట మేలు. 2-3. తంత్రీవాద్యములతోను, సితారా గానముతోను, వేకువన నీ ప్రేమను, రేయి నీ విశ్వసనీయతను ప్రకటనము చేయుట లెస్స 4. ప్రభూ! నీ చెయిదములకుగాను నేను ఆనందింతును. నీ కార్యములకుగాను నేను సంతసముతో పాటలు పాడుదును. 5. ప్రభూ! నీ కార్యములు ఎంత ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంత లోతైనవి! 6. మూర్ఖులు ఈ సంగతిని గుర్తింపజాలరు. అజ్ఞానులు ఈ అంశమును గ్రహింపజాలరు. 7. దుష్టులు కలుపువలె ఎదిగినను, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చినను వారెల్లరును వేరంట నాశనమగుదురు. 8. ప్రభూ! నీవు కలకాలము , మహోన్నతుడవుగానుందువు. 9. ప్రభూ! నీ శత్రువులు నశింతురు. దుష్కార్యములు చేయువారెల్ల చెల్లాచెదరగుదురు. 10. అడవిఎద్దు కొమ్మువలె నీవు నాకొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నా చర్మముపై అంటితివి. 11. నేను నా శత్రువుల పతనమును ఆశతీరచూచితిని. దుష్టవర్తనుల ఆక్రందనమును వింటిని. " 12. పుణ్యపురుషులు ఖర్జూరములవలె వృద్ధిజెందుదురు. లెబానోను దేవదారులవలె ఎదుగుదురు. 13. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా ఎదుగు చెట్లవలె ఉందురు. 14. ముసలితనములోగూడ కాయలు కాయుచు నిత్యము పచ్చగా క

Psalms 91

1. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతునిరెక్కలనీడలో నివసించువాడు 2. ప్రభువుతో "నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణదుర్గమవు, నేను నమ్మిన దేవుడవు” అని చెప్పుకొనును. 3. వేటకాని ఉరులనుండియు, ఘోరవ్యాధులనుండియు ఆయన నిన్ను కాపాడును. 4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణాయుధముగను ఉండును. 5. నీవు రేయి కలుగు అపాయములకును, పగటిపూట తగులు బాణములకును వెరవనక్కరలేదు. 6. చీకటిలో సోకు అంటురోగములకును, మిట్టమధ్యాహ్నము హానిచేయు వారికిని భయపడనక్కరలేదు. 7. నీ దాపున వేయిమంది కూలినను, నీ కుడిప్రక్కన పదివేలమంది పడినను నీకు ఏ అపాయమును కలుగదు. 8. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. 9. నీవు ప్రభువును నీకు ఆశ్రయనీయునిగను మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసికొంటివి. 10. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటిచెంతకు ఎట్టి అంటురోగమును రాదు. 11. ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. 12. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొందురు. 13. నీవు సింహము

Psalms 90

1. ప్రభూ! అనాదికాలమునుండియు నీవు మాకు వాసస్థలముగానుంటివి. 2. పర్వతములు పుట్టకమునుపే, భూమియు, లోకమును ఏర్పడకపూర్వమే అనాదికాలమునుండి నీవు దేవుడవుగానుంటివి ఎల్లకాలమును నీవు వేల్పువుగా నుందువు. 3. నీవు నరులను మట్టిగా మార్చెదవు. “నరులారా! మీరు మరల మన్నయిపొండు” అని పలికెదవు. 4. నీకు వెయ్యేండ్లు ఒక్కరోజుతో సమానము, అవి గతించిపోయిన నిన్నటిదినముతోను రేయి అందలి ఒక్క జాముతోను సరిసమానము. 5. నీవు నరులను వరదవలె ఈడ్చుకొని పోయెదవు. వారు కలవంటివారు, ఉదయమున మొలకెత్తు గడ్డివంటివారు. 6. అది వేకువన ఎదిగి పూలు పూయును. సాయంకాలమున కోయబడి వాడి, ఎండిపోవును 7. మేము నీ కోపాగ్నివలన మాడిపోవుచున్నాము. నీ క్రోధమువలన గడగడ వణకుచున్నాము. 8. నీవుమా పాపములను నీ ముందట ఉంచుకొందువు మా రహస్య పాపములను నీ ముఖకాంతితో పరిశీలించి చూతువు. 9. నీ కోపము భరించుచూనే మా దినములన్నియు గతించిపోవును. మా ఆయువు శ్వాసమువలె గతించును. 10. మేమొక డెబ్బదియేండ్లు జీవింతుము. దృఢకాయులమైనచో ఎనుబదియేండ్లు బ్రతుకుదుము  కాని ఆ యేండ్లన్నియు బాధావిచారములతో నిండియుండును. మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదుము. 11. కాని నీ కోపప్రభావమును అర్థము చేసికొన్నవ

Psalms 89

1. ప్రభూ! నేను నీ కృపను ఎల్లపుడును గానము చేసెదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికిని నోరారా ఉగ్గడించెదను. 2. నీ కృప కలకాలము నిల్చుననియు, నీ విశ్వసనీయత ఆకాశమువలె శాశ్వతముగా ఉండిపోవుననియు ప్రకటింతును. 3. "నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసికొంటిని. నా సేవకుడైన దావీదునకు నేను మాట ఇచ్చితిని. 4. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదునని నేను అతనితో పలికితిని” అని నీవు నుడివితివి. 5. ప్రభూ! ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. 6. ఆకాశమున ప్రభువునకు సాటియైనవాడు ఎవడు? దేవదూతలలో ప్రభువును పోలినవాడు ఎవడు? 7. దేవదూతల బృందము ప్రభువును గాంచి భయపడును. "ఆయన తనచుట్టునున్న వారికెల్లరికి భయంకరుడుగా కన్పించును. 8. సైన్యములకధిపతియైన .యావే! నీవలె బలాఢ్యుడైనవాడు ఎవడు? నీవు విశ్వసనీయతనే వస్త్రముగా ధరింతువు. 9. నీవు కడలిపొంగును పాలింతువు. ఉవ్వెత్తుగా లేచిన సాగర తరంగములను అణచివేయుదువు. 10. నీవు జలభూతమైన రాహబును శవమును చీల్చినట్లుగా చీల్చివేసితివి. మహాపరాక్రమముతో నీ శత్రువులను చెల్లాచెదరుచేసితివి 11.

Psalms 88

1. ప్రభూ! నాకు రక్షకుడవైన దేవా! నేను నీకు పగలు మొరపెట్టుకొనుచున్నాను, రేయి నీ సన్నిధిలోనికి వచ్చుచున్నాను. 2. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక! నీవు నా మొరను ఆలింపుము. 3. నాకు పలుకీడులు దాపురించినవి. నేను మృత్యువువాత పడనున్నాను. 4. నా పేరు మృతలోకమునకు పోవువారి జాబితాలోకి ఎక్కినది. నేను సహాయము లభించని వానివలెనైతిని. 5. జనులు నన్ను విడనాడిరి. నేను మృతులలో కలిసిపోతిని. చచ్చి సమాధిచేరినవారిని నీవిక స్మరింపవు, ఆదరింపవు. నేను అట్టివాడనే అయితిని. 6. నీవు నన్ను నడిగుంటలో పడవేసితివి. లోతైన చీకటి కోనేటిలో పడద్రోసితివి. 7. నీ కోపము నన్ను అణగదొక్కినది. నీ క్రోధతరంగములు నన్ను ముంచివేసినవి. 8. నీవు నా మిత్రులు నన్ను విడనాడునట్లు చేసితివి. వారు నన్ను అసహ్యించుకొనునట్లు చేసితివి. నేను ఈ చెరనుండి బయటపడలేను.  9. శ్రమలవలన నా కంటిచూపు మందగించినది. ప్రభూ! ప్రతి రోజు నేను నీకు మొరపెట్టుచునే యుంటిని. చేతులెత్తి నీకు ప్రార్థన చేయుచునే యుంటిని. 10. నీవు మృతులకొరకు అద్భుతములు చేయుదువా? ప్రేతములు పైకి లేచి నిన్ను స్తుతించునా? 11. సమాధిలో నీ కరుణనుగూర్చి ఎవడు మాట్లాడును? వినాశస్థలములో నీ విశ్వసనీయతను ఎవడు ఉగ్గడ