ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

Sirach Chapter 31 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 31వ అధ్యాయము

 1. సంపదలు కలవాడు జాగరణలు చేయుచు తన బరువును కోల్పోవును. సొత్తును గూర్చిన ఆందోళన అతని నిద్రను చెరచును. 2. సొమ్ము చేసికోవలెనను చింత, ఘోరవ్యాధివలె అతని నిద్రను పాడుచేయును. 3. ధనికుడు కష్టించి డబ్బు విస్తారముగా ప్రోగుజేసికొనును. తరువాత విశ్రాంతి తీసికొనుచు సుఖములు అనుభవించును. 4. దరిద్రుడు కష్టించి స్వల్పాదాయము గడించును. అతడు విశ్రాంతి తీసికొనునపుడు చేతిలో పైసా ఉండదు. 5. ధనాశ గలవాడు సత్పురుషుడు కాజాలడు. డబ్బు చేసికోగోరువాడు పాపమును కట్టుకొనును. 6. డబ్బువలన చాలమంది నాశనమైరి. ధనమువలన వారు వినాశనమునకు చిక్కిరి. 7. ధనమువలన సమ్మోహితుడగు వానికది ఉరియగును. మూర్ఖులు ఆ ఉరిలో తగుల్కొందురు. 8. పాపమార్గమున డబ్బు కూడబెట్టనివాడును, నిర్దోషియైన ధనికుడును ధన్యుడు. 9. అట్టివాడు దొరకెనేని అతనిని అభినందింపవలెను అతడు ధనికులెవ్వరును చేయలేని అద్భుతమును చేసెను. 10. ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కముగా గర్వింపవచ్చును. పాపము చేయగలిగినా చేయనివాడును, పరుని మోసగింపగలిగినా మోసగింపనివాడును, ఎవడైనగలడా? 11. అట్టి వాడెవడైన వున్నచోఅతని సంపదలు స్థిరముగా నిలుచునుగాక! ప్రజలెల్లరు అతని మంచితనమును సన్నుతింతురు. 12. విందును ఆరగించుట

Sirach Chapter 30 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 30వ అధ్యాయము

 1. ప్రేమగల తండ్రి తన కుమారుని తరచుగా శిక్షించును. సుశిక్షుతుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనపుడు తండ్రిని సంతోషపెట్టును. 2. కుమారుని క్రమశిక్షణమునకు గురిచేసిన తండ్రి ఫలితము బడయును. అతడు ఆ పుత్రునిగూర్చి తన మిత్రులతో గొప్పలు చెప్పుకోగలడు. 3. కుమారునికి విద్య గరపిన తండ్రి, తన శత్రువులకు అసూయ పుట్టించును.  అతడు ఆ పుత్రుని తలచుకొనుచు మిత్రుల మధ్య సగర్వముగా తిరుగును. 4. తండ్రి చనిపోయినను చనిపోయినట్లుకాదు. అతని ప్రతిబింబమైన కుమారుడు మిగిలియున్నాడు కదా! 5. తండ్రి బ్రతికియున్నప్పుడు పుత్రుని చూచి ఆనందించును. చనిపోవునపుడు నిశ్చింతగా చనిపోవును. 6. అతడు దాటిపోయిన తరువాత కుమారుడు తండ్రి విరోధులమీద పగతీర్చుకొనును. తండ్రి మిత్రులు తండ్రికి జేసిన ఉపకారమునకు గాను వారికి కృతజ్ఞుడై ఉండును. 7. కాని పుత్రుని చెడగొట్టు తండ్రి వాని గాయములకు కట్టుకట్టును. వాడు ఏడ్చినప్పుడెల్ల అతని హృదయముకరుగును 8. చక్కగా తర్పీదునీయని గుఱ్ఱము మొండిదగును. అదుపు మీరిన కుమారునికి పొగరెక్కును. 9. గోముగా పెరిగినబిడ్డడు కడన తండ్రికి నిరాశను కలిగించును. తండ్రి పుత్రునితో ఆడిపాడెనేని, తరువాత అతనికి దుఃఖము తప్పదు. 10. ఇప్పుడు నీ బిడ్డత

Sirach Chapter 29 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 29వ అధ్యాయము

 1. దయగలవాడు తన పొరుగువానికి అరువిచ్చును. అతనిని తన హస్తముతో బలపరచువాడు దేవుని ఆజ్ఞలను పాటించును. 2. తోడివాడు అక్కరలోనున్నపుడు సాయము చేయుము. నీవు బాకీపడియున్నప్పుడు వెంటనే ఋణము తీర్పుము. 3. నీవు ఋణదాతకు ఇచ్చిన మాటను నెరవేర్చుకొన్నచో అతడు నీ అక్కరలలో ఎల్లపుడు సాయము చేయును. 4. చాలమంది అప్పును ఉచితముగా దొరకిన సొమ్మనుకొందురు. ఆపదలో అప్పిచ్చి ఆదుకొన్నవారిని తిప్పలు పెట్టుదురు. 5. అప్పుకొరకు వచ్చినవాడు ఋణదాత చేతిని ముద్దు పెట్టుకొనును. అతని సంపదనుగూర్చి పొగడుచు మాటలాడును. కాని గడువు వచ్చినపుడు సొమ్ము చెల్లింపక జాప్యము చేయును. బాకీ తీర్చుటకు ఇది అదనుకాదని పలుకును. ' ఏవేవో కల్లబొల్లి సాకులు చెప్పును. 6. ఋణదాత ఋణగ్రస్తుని నిర్బంధ పెట్టి తానిచ్చిన అసలులో సగము రాబట్టుకోగలిగిన అదృష్టము పండినట్లుగానే భావింపవచ్చును. నిర్బంధముచేయనిచో ఋణదాత తన సొమ్మును కోల్పోవును. అనవసరముగా ఒక శత్రువునుగూడ సిద్ధము చేసికొనకుము. అప్పు తీసికొనినవాడు అతనిని శపించి తిట్టిపోయును. అతనిని గౌరవించుటకు మారుగా అవమానించి పంపును. 7. కనుకనే చాలమంది అరువిచ్చుట కంగీకరింపరు. వారు పిసినిగొట్టులు కాదుగాని, సొమ్మిచ్చి అనవసరముగా మోసపో

Sirach Chapter 28 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 28వ అధ్యాయము

 1. ప్రభువు నరుని పాపములనెల్ల గమనించును.  పగతీర్చుకొను నరునిమీద ఆయన పగ తీర్చుకొనును. 2. నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో నీవు మొర పెట్టినపుడు దేవుడు నీ అపరాధములను మన్నించును. 3. నీవు తోడినరుని మీద కోపముగానున్నచో, నిన్ను క్షమింపుమని భగవంతుని ఎట్లడుగగలవు? 4. తోడినరుని మన్నింపనివాడు, తన తప్పిదములను మన్నింపుమని దేవుని ఎట్లు వేడుకొనగలడు? 5. నరమాత్రుడైనవాడు కోపమును అణచుకోజాలనిచో ఇక అతని తప్పిదములను ఎవడు మన్నించును? 6. నీవు చనిపోవుదువని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను అణచుకొనుము. నీవు చనిపోగా నీ దేహము క్రుళ్ళిపోవునని గ్రహించి దైవాజ్ఞలు పాటింపుము. 7. దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగు వాని మీద కోపము మానుకొనుము. దేవుని నిబంధనమును తలచి అన్యుని తప్పిదములను మన్నింపుము. 8. కలహములను పరిహరింతువేని నీ పాపములు తగ్గును. కోపము వలన కలహములు పెరుగును. 9. దుష్టుడు స్నేహితుల మధ్య తగవులు పెట్టి కలిసియున్న వారిని విడదీయును. 10. కట్టెకొలది మంటలు, మొండితనము కొలది కలహములు. నరుడు బలవంతుడును, ధనవంతుడైన కొలది. అతని కోపము రెచ్చిపోవును. 11. దిడీలున పుట్టుకొనివచ్చు కలహము ఉద్రేకమును పెంచును. ఆ త్వరపడి కలహించువారు, రక్

Sirach Chapter 27 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 27వ అధ్యాయము

 1. లాభము గణింపవలెనన్న పేరాశతో చాలమంది పాపము చేసిరి. ధనికుడు కాగోరువాడు, కన్నులు మూసికోవలెను. 2. బిగించిన రెండు రాళ్ళమధ్య మేకు ఇరుకుకొనియున్నట్లే క్రయవిక్రయముల నడుమ అన్యాయము దాగుకొనియుండును. 3. నరుడు దైవభీతికి లొంగడిని, వానిఇల్లు వానిమీదనే కూలిపడును. 4. ఊపిన జల్లెడలో మట్టిపెళ్ళలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కన్పించును. 5. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము. అట్లే నరునికి పరీక్ష అతడి సంవాదము. 6. చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. 7. నరుని సంభాషణమే అతనికి పరీక్ష. కనుక ఏ నరునిగాని అతడు మాట్లాడకముందు స్తుతింపవలదు. 8. నీవు ధర్మమును సాధింపగోరెదవేని సాధింపవచ్చును. దానిని సుందరమైన వస్త్రమునువలె ధరింపవచ్చునుగూడ. 9. పక్షులు తమ జాతి పక్షులతో కలియును. అట్లే ధర్మమును ధర్మాత్మునితో కలియును. 10. సింహము ఎరకొరకు పొంచియున్నట్లే పాపము దుష్కార్యములు చేయువారి కొరకు పొంచియుండును. 11. సత్పురుషుని సంభాషణము పొందికగానుండును కాని మూర్ఖుని మాటలు చంద్రబింబమువలె మాటిమాటికి మారుచుండును. 12. మూర్ఖులు తటస్థపడినపుడు ఏదో ఒక నెపముత

Sirach Chapter 26 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 26వ అధ్యాయము

 1. గుణవతియైన భార్యను బడసినవాడు ధన్యుడు. ఆమె మూలమున అతని ఆయుష్షు రెండు రెట్లు పెరుగును. 2. సద్బుద్ధికల భార్య భర్తకు పరమానందము కలిగించును. అతడు శాంతిసమాధానములతో జీవితమును గడపును. 3. మంచి ఇల్లాలు శ్రేష్ఠమైన వరము వంటిది. దైవభీతి కలవారికేగాని ఆ వరము లభింపదు. 4. అట్టివారు ధనికులైనను, దరిద్రులైనను సంతసముతో జీవింతురు. వారి ముఖములు ఎల్లవేళల యందు ఆనందముతో నిండియుండును. 5. మూడు సంగతులనిన నాకు భయము. నాలుగవదనిన నా గుండె దడదడలాడును. పుకారులు నగరమంతట ప్రాకుట, జనులు గుమిగూడుట, నీలాపనిందలను మూడును మృత్యువుతో సరిసమానము. 6. కాని స్త్రీని చూచి స్త్రీ అసూయపడినపుడు మితిమీరిన బాధయు, దుఃఖమును కలుగును. ఆమె సూటిపోటుమాటలు ఎల్లరిని నొప్పించును.  7. దుష్టురాలైన భార్య కుదరని కాడివలె ఉండును. ఆమెను అదుపులో పెట్టుకొనుట, తేలును చేతబట్టుకొనుట వంటిది. 8. త్రాగియున్న భార్య మహాకోపమును రప్పించును. ఆమె సిగ్గుమాలినతనమును ఎల్లరును గమనింతురు. 9. కులటయైన స్త్రీ ధైర్యముగా కన్నెత్తి చూచును. ఆమె వాలు చూపులను బట్టియే ఆమె గుణమును గ్రహింపవచ్చును. 10. తలబిరుసు కుమార్తెను . ఒక కంట కనిపెట్టియుండవలెను, లేదని ఆమె అవకాశము చూచుకొని కానిపనిక

Sirach Chapter 25 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 25వ అధ్యాయము

 1. మూడు కార్యములు నాకు ఇష్టము. దేవునికిని నరులకుగూడ ఇవి ప్రీతి కలిగించును. సోదరులు ఐకమత్యముగా జీవించుటయు, ఇరుగుపొరుగువారు స్నేహముగా జీవించుటయు, భార్యాభర్తలు పొందికగా జీవించుటయు. 2. క్రింది మూడు రకముల మనుష్యులనిన నాకు గిట్టరు. వారి పోకడలను నేనెంతమాత్రమును సహింపజాలను గర్వాత్ముడైన దరిద్రుడును, అబద్దములాడు ధనికుడును, వ్యభిచారము చేయు మూర్ఖవృద్దుడును. 3. నీవు బాలుడవుగా ఉన్నప్పుడు విజ్ఞానమును గణింపవేని వృద్ధుడవైనపుడు జ్ఞానివి కాజాలవు. 4. చక్కగా ఆలోచించుట వృద్దులకు చెల్లును. మంచిసలహా ఇచ్చుట వృద్ధులకు తగును. 5. వృద్ధులకు జ్ఞానము తగును. పెద్ద వారికి మంచి ఆలోచన చెప్పుట తగును. 6. పండిన అనుభవమే వృద్ధులకు కిరీటము. దైవభీతియే వారికి అనంతకీర్తి. 7. తొమ్మిదిరకముల నరులనెరిగి యుండుట నా అదృష్టము. పదియవ రకము మనుజునెరిగి యుండుటయు నా భాగ్య విశేషము. తన బిడ్డలను చూచి ఆనందించువాడును, తాను గతింపకముందే తన శత్రువుల పతనమును చూచినవాడును, 8. తెలివి తేటలుగల భార్యను బడయుట అను భాగ్యమునకు నోచుకొనిన భర్తయును, పరస్పరము తగిన దంపతులును, నోటి దురుసుతనము వలన పాపము చేయనివాడును, తనకంటె నికృష్టుడైనవానికి సేవలు చేయనివాడును 9. మంచి

Sirach Chapter 24 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 24వ అధ్యాయము

 1. విజ్ఞానము తన కీర్తిని తాను ఉగ్గడించుకొనుచున్నది. తన ప్రజలైన యిస్రాయేలీయుల మధ్య తనను తాను స్తుతించుకొనుచున్నది. 2. మహోన్నతుడైన ప్రభువు సమాజము ఎదుట దేవదూతల సమక్షమున ఆమె తన కీర్తినిట్లు వెల్లడించుకొనుచున్నది: 3. నేను మహోన్నతుడైన ప్రభువు పలికిన వాక్కును. పొగమంచువలె నేను భూమిని కప్పితిని. " 4. అత్యున్నతమైన ఆకాశము నా నివాసస్థలము, నా సింహాసనము మేఘస్తంభముమీద ఉండెడిది 5. ఏ తోడును లేక నేనొక్కరైనే ఆకాశపు అంచుల చుట్టు తిరిగితిని. సాగరగర్భమున సంచరించితిని. 6. సాగర తరంగములమీదను, సర్వభూమిమీదను, సమస్తజాతులమీదను నా ఆధిపత్యమును నెరపితిని. 7. నా నివాసమునకు అనువైన స్థలము కొరకు ఎల్లయెడల గాలించితిని. నేను ఏ ప్రదేశమున వసింతునా అని పరిశీలించి చూచితిని.  8. అపుడు సర్వమును కలిగించిన దేవుడు నాకు ఆ యిచ్చెను. 'సృష్టికర్త నేనెచట వసింపవలెనో నిర్ణయించెను. అతడు నీవు యాకోబు వంశజులనడుమ వసింపుము యిస్రాయేలీయులు నీ ప్రజలగుదురు' అని సెలవిచ్చెను. 9. కాలము కలుగకమునుపే ఆదిలోనే అతడు నన్ను చేసెను. నేను కలకాలము మనుదును. 10. పవిత్రమైన గుడారమున నేను ప్రభువును సేవించితిని. అటు తరువాత సియోను కొండమీద వసించితిని 11. ప్

Sirach Chapter 23 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 23వ అధ్యాయము

  1. నాకు తండ్రివియు, నా జీవమునకు కర్తవైన ప్రభూ! నేను నా జిహ్వకు లోబడకుండునట్లును అనుగ్రహింపుము. 2. ఎవరైన నా తలపులకుగాను నన్ను దండించినచో విజ్ఞానము నా హృదయమునకు శిక్షణనిచ్చినచో, ఎంత బాగుండును! నేను తప్పుచేసినపుడు. శిక్షననుభవింపవలెను. నా అపరాధములన్నిటికి దండనమును పొందవలెను 3. అప్పుడు నా తప్పులు పెరిగి పోకుండును. నేను మితిమీరిపాపములు కట్టుకొనకుందును. అప్పుడు నేను నా విరోధులకు దొరికిపోకుందును. వారు నన్ను గేలిచేయకుందురు. 4. నాకు తండ్రివియు, నా జీవమునకు దేవుడవునైన ప్రభూ! అహంకారము నుండి నన్ను కాపాడుము. 5. నా హృదయమునుండి కామమును తొలగింపుము. 6. . నేను మోహమునకు లొంగిపోకుండునట్లును, సిగ్గుమాలి కామవికారమునకు లోబడకుండునట్లును కరుణింపుము. 7. బిడ్డలారా! మీ నోటిని అదుపులో పెట్టుకోవలసిన తీరును వినుడు. నా ఉపదేశమును పాటింతురేని మీరు మోసపోరు 8. పాపాత్ముని, అతని పలుకులే పట్టియిచ్చును. నిందాగర్వములతో కూడిన అతని మాటలే అతనిని కూలద్రోయును. 9. నీవు ఒట్టు పెట్టుకోవలదు. పరిశుద్ధుడైన ప్రభువు నామమును తేలికగా ఉచ్చరింపవలదు. 10. మాటిమాటికి దండనమును అనుభవించు బానిసకు గాయములు తప్పనట్లే తేపతేపకు ప్రభువు పవిత్రనామముతోప్ర

Sirach Chapter 22 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 22వ అధ్యాయము

 1. సోమరిపోతు అశుద్దము సోకిన రాతివంటి వాడు. అతని సిగ్గుమాలినతనమును జూచి ఎల్లరు అసహ్యించుకొందురు. 2. అతడు మల పిండము వంటివాడు. దానిని చేతిలోనికి దీసికొనినవాడు, అసహ్యముతో విసరికొట్టును. 3. పోకిరి బిడ్డకి తండ్రి అనిపించుకొనుట అవమానకరము. ఆడుబిడ్డ పుట్టుటవలన నష్టమే కలుగును. 4. తెలివితేటలు కల బాలికకు పెండ్లిఅగును. కాని సిగ్గు సెరములేని పిల్ల తండ్రియెదపై కుంపటి అగును. 5. పొగరుబోతు పడుచు తండ్రికి, మగనికికూడ తలవంపులు తెచ్చును. ఆ ఇరువురు ఆమెను చులకన చేయుదురు. 6. తగని సమయమున పిల్లలకు బుద్ధిచెప్పుట, శోకించువారికి సంగీతమును విన్పించుటవలెను నిరర్థకమైనది. కాని, వారిని మందలించి క్రమశిక్షణను నేర్చుట ఎల్లవేళల మంచిది. 7. మూర్ఖునికి విద్య గరపబూనుట పగిలిపోయిన కుండ పెంకులను అతికించుటవలె గాఢనిద్రలోనున్న వారిని లేపజూచుటవలె వ్యర్ధమైన కార్యము. 8. మూర్ఖునికి బోధించుట నిద్రతో తూలువానికి బోధించుట వంటిది. అంతయు విన్న పిదప అతడు నీవేమి చెప్పితివని అడుగును. 9. వినయ విధేయతలతో పెరిగిన పిల్లలను జూచినపుడు వారి తల్లిదండ్రులు తక్కువ స్థాయికి చెందిన వారు కారని గ్రహింతుము. 10. పొగరుబోతులుగ, మర్యాదలేనివారుగ . పెరిగిన పిల్లలు గౌ

Sirach Chapter 21 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 21వ అధ్యాయము

 1. కుమారా! నీవు యిదివరకే పాపము చేసియుంటివేని మరలచేయవద్దు. పూర్వము చేసిన తప్పులను మన్నింపుమని దేవుని వేడుకొనుము. 2. సర్పమునుండివలె పాపమునుండి దూరముగా పారిపొమ్ము. దానిచెంతకుబోయెదవేని అది నిన్ను కాటువేయును పాపము కోరలు, సింహపుపళ్ళు వంటివి. అవి నరుల ప్రాణములు తీయును. 3. రెండంచులకత్తి నయముకాని గాయము గావించును. దైవాజ్ఞ మీరి చేసిన పాపము కూడ అట్లే చేయును. 4. దౌర్జన్యపరుడును, గర్వాత్ముడును అయినవాడు సర్వము కోల్పోవును. 5. పేదవాడు పెట్టిన మొర తిన్నగా దేవుని చెవిలో పడును. ప్రభువు అతనికి తక్షణమే తీర్పుచెప్పును. 6. మందలింపు నంగీకరింపనివాడు పాపపుత్రోవలో నడచును. దైవభీతికలవాడు పరివర్తన చెందును. 7. మంచివక్త ఎల్లెడల పేరు తెచ్చుకొని ఉండవచ్చును. కాని అతడు నోరు జారినచో విజ్ఞుడు వెంటనే గుర్తించును. 8. ఇల్లు కట్టుకొనుటకు సొమ్ము అప్పు తెచ్చుకొనుట,  తన సమాధికి తానే రాళ్ళు ప్రోగుజేసుకొనుట వంటిది. 9. దుర్మార్గులు గుమిగూడినపుడు మండెడు కట్టెలవలె నుందురు. వారెల్లరు కాలి నాశనమగుదురు. 10. దుష్టుడు నడచెడి త్రోవ నునుపుగా నుండును. కాని అది మృతలోకమును చేర్చును. 11. దైవాజ్ఞలను పాటించువాడు తన వాంఛలను అదుపులో పెట్టుకొనును. దై

Sirach Chapter 20 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 20వ అధ్యాయము

 1. తగని సమయమున మందలించుట అనునది కలదు. ఉచితము గాని సమయమున మౌనముగా నుండుటయేమేలు. 2. కోపముతో మండిపడుటకంటే మందలించుటయే మెరుగు. 3. తన తప్పునొప్పుకొనువాడు శిక్షను తప్పించుకొనును. 4. బలవంతముగా తన వాదమును నెగ్గించుకోజూచుట నపుంసకుడు యువతిని చెరుపగోరినట్లేయగును 5. కొందరు మితముగా మాటలాడుటచే జ్ఞానులని అనబడుదురు. కొందరు అమితముగా మాట్లాడుటచే చెడ్డ పేరు తెచ్చుకొందురు. 6. ఏమి మాట్లాడవలెనో తెలియక కొందరు మౌనముగా నుందురు. ఎప్పుడు మాట్లాడవలెనో తెలిసి కొందరు మౌనము వహింతురు. 7. జ్ఞాని తగిన సమయము లభించువరకు మౌనముగా నుండును. కాని గొప్పలు చెప్పుకొను మూర్ఖునకు, ఉచిత సమయము తెలియదు.  8. అమితముగా ప్రేలెడు వానిని జనులు అసహ్యించుకొందురు. మాట్లాడుటకు తమకు అవకాశమీయని వానిని నరులు అసహ్యించెదరు. 9. ఒక్కొక్కసారి దురదృష్టము వలన లాభమును, అదృష్టము వలన నష్టమును కలుగును. 10. కొన్నిసార్లు ఉదారముగా ఇచ్చుటవలన లాభము కలుగదు. కొన్నిసార్లు మాత్రము రెండింతలుగా ఫలితము కల్గును. 11. కొందరు గౌరవము పొందుటవలననే హీనులగుదురు. కొందరు హీనదశ నుండియు గౌరవపదమును చేరుకొందురు. 12. ఒక్కొక్కసారి కొద్దిసొమ్మునకే చాలవస్తువులు వచ్చినట్లు కన్పించును, కా

Sirach Chapter 19 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 19వ అధ్యాయము

 1. త్రాగుబోతు సంపన్నుడు కాజాలడు. చిన్న విషయములలో జాగ్రత్త చూపనివాడు క్రమముగా నశించును. 2. మధువు, ముదితలు విజ్ఞుల జ్ఞానమును చెరతురు వేశ్యలను కూడువాడు శీలము కోల్పోవును. 3. శీలము కోల్పోయిన వాడు ప్రాణహాని తెచ్చుకొనును. కుళ్ళు పట్టి పురుగులు పడిచచ్చును. 4. ప్రజలను సులభముగా నమ్మువాడు తెలివిలేనివాడు. పాపము చేయువాడు తనకు తానే హానిచేసికొనును. 5. దుష్కార్యములందు అనురక్తి చూపువాడు నిందితుడగును. 6. వాచాలత్వమును కట్టిపెట్టువాడు పాపమును జయించును. 7. ఒకరినుండి విన్నదానిని ఇతరులకు చెప్పకుము. అప్పుడు నీవు పశ్చాత్తాపపడవలసిన అవసరముండదు. 8. నీవు విన్న సంగతిని ఇతరులకు చెప్పకుము. ఇతరులకు చెప్పకుండుట పాపహేతువైననే తప్ప, మిత్రులకుగాని, శత్రువులకుగాని దానిని చెప్పవద్దు. 9. నీ నుండి ఆ వర్తమానమును వినినవాడు నిన్ను శంకించును. అటుపిమ్మట నిన్నుగూడ ద్వేషించును. 10. నీవేదైన సంగతిని విన్నచో దానిని నీతోనే సమసిపోనిమ్ము, భయపడకుము. దాని వలన నీ కడుపు పిగిలిపోదు! 11. మూర్ఖుడు తాను విన్న రహస్యమును దాచలేక ప్రసవవేదనను అనుభవించు స్త్రీవలె బాధపడును. 12. తొడలో దిగబడిన బాణమెట్లో మూర్ఖుని యెదలోనున్న రహస్యవార్తలు అట్లుండును. 13. నీ

Sirach Chapter 18 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 18వ అధ్యాయము

 1. చిరంజీవియైన ప్రభువు ఈ విశ్వమును సృజించెను. 2. ఆయనొక్కడే నీతిమంతుడు. ఆయనతప్ప మరియెవడును లేడు. 3. ఆయన తనచేతితో ఈ ప్రపంచమును నడిపించును ఎల్లప్రాణులును ఆయనకు విధేయములగును. అన్నింటికి ఆయనే రాజు. ఆయన దక్షతతో పవిత్రులను అపవిత్రులనుండి వేరుచేయును. 4. ఏ నరుడును ఆయన సృష్టిని సరిగా వర్ణింపజాలడు ఎవడును ఆయన అద్భుతకార్యములను పూర్తిగా గ్రహింపజాలడు. 5. ఆయన మహాశక్తిని ఎవడు అర్థము చేసికోగలడు? ఆయన కరుణకార్యములనెవ్వడు సంపూర్ణముగా ఉగ్గడింపగలడు? 6. మనము ఆ కార్యములకు ఏమి చేర్పజాలము. వానినుండి యేమియు తీసివేయజాలము. ప్రభుని అద్భుతకార్యములను ఎరుగుట అసాధ్యము 7. ఆయన మహాకార్యములను పూర్ణముగా తెలిసికొనినపుడు వాని విషయమున ఇంకా ప్రారంభముననే ఉన్నామనుకోవలెను. ఆ కార్యములను గాంచి నోటమాటరాక దిగ్ర్భాంతి చెందుదుము. 8. నరుడేపాటివాడు? అతనివలన ఏమి ప్రయోజనము? అతడుచేయు మంచికిగాని, చెడుకుగాని విలువెంత? 9. నరుడు వందయేండ్లు జీవించినచో దీర్ఘకాలము బ్రతికినట్లే. 10. కాని అనంతకాలముతో పోల్చిచూచినచో ఆ నూరేండ్లు సాగరములో ఒక్క నీటిచుక్క వంటివి. ఒక్క యిసుక రేణువు వంటివి. 11. కనుకనే ప్రభువు నరులపట్ల మిక్కిలి ఓర్పుచూపును. వారిమీద దయను క్రుమ

Sirach Chapter 17 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 17వ అధ్యాయము

 1. ప్రభువు మట్టి నుండి నరుని చేసెను. అతడు మరల ఆ మట్టిలోనే కలిసి పోవునట్లు చేసెను. 2. ఆయన నరులకు ఆయుఃప్రమాణమును నిర్ణయించెను. కాని వారికి సృష్టి వస్తువులన్నిటి మీదను అధికారమిచ్చెను. 3. ఆ నరులను తనను పోలినవారినిగా చేసి వారికి తన శక్తి నొసగెను. 4. ప్రతి ప్రాణి నరుని చూచి భయపడునట్లు చేసెను. మృగపక్షి గణములకు అతనిని యజమానుని చేసెను 5. అతనికి పంచేంద్రియముల నొసగెను. ఆరవ ఇంద్రియముగా బుద్దిశక్తినొసగెను. ఏడవదానిగా తెలివినిచ్చెను.  దానితోనే నరుడు తాను పంచేంద్రియములద్వారా గ్రహించిన జ్ఞానమును అర్థము చేసికొనును. 6. ఆయన నరులకు నాలుకలు, కన్నులు, చెవులు దయచేసెను. ఆలోచించుటకు మనస్సునిచ్చెను. 7. తెలివితేటలు, బుద్ధివివరములు ప్రసాదించెను. మంచిచెడ్డలనెరుగు శక్తి నొసగెను. 8. తాను చేసిన సృష్టి మాహాత్మ్యమును గుర్తించుటకు వారి హృదయములలో ఒక వెలుగునిల్పెను. 9. తాను చేసిన మహాకార్యములను గాంచి నరులెల్లవేళల పొంగి పోవునట్లు చేసెను. 10. నరులు ప్రభువుచేసిన మహాకార్యముల నుగ్గడింతురు. ఆయన పవిత్ర నామమును కీర్తింతురు. 11. ఆయన వారికి జ్ఞానమునొసగెను. జీవనదాయకమైన ధర్మశాస్త్రమును దయచేసెను. 12. నరులతో శాశ్వతమైన ఒడంబడిక చేసికొని,

Sirach Chapter 16 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 16వ అధ్యాయము

 1. దుర్మార్గులైన తనయులు చాలమంది ఎందులకు? భక్తిహీనులైన పుత్రులవలన ప్రమోదము కలుగదుకదా! 2. దైవభక్తిలేని బిడ్డలెంతమంది ఉన్నను, వారిని చూచి సంతృప్తి చెందకుము.  3. ఆ బిడ్డల భవిష్యత్తు శుభప్రదమగుననియు, వారు దీర్ఘకాలము జీవింతురనియు ఆశింపకుము. వేయిమంది పుత్రులకంటె ఒక్కడు మెరుగు. భక్తిహీనులైన బిడ్డలను కనుటకంటె , అసలు బిడ్డలు లేకుండ చనిపోవుటే మేలు. 4. ఒక్కని విజ్ఞతవలన నగరపు జనసంఖ్య పెరుగును. దుర్మార్గుల తెగ మాత్రము నాశనమగును. 5. ఇట్టి ఉదంతములను నేను పలుమార్లు చూచితిని. వీనికంటె గొప్ప సంఘటనలను నా చెవులతో వింటిని. 6. పాపాత్ముల సమాజమున ప్రభువు కోపాగ్ని రగుల్కొనును. అవిధేయుల బృందమున ఆయన క్రోధము గనగనమండును. 7. ప్రాచీనకాలపు రాక్షసజాతివారు తమ బలమును చూచుకొని , దేవునిమీద తిరుగబడగా ఆయన వారిని క్షమింపడయ్యెను. 8. లోతుతో కలిసి జీవించిన ప్రజల గర్వమునకుగాను ప్రభువు వారిని చీదరించుకొని శిక్షకు గురిచేసెను. 9. ఆయన పాపము చేసిన జాతిని నాశనము చేయ సంకల్పించుకొనెను. దానిమీద కరుణ చూపడయ్యెను. 10. ఎడారి ప్రయాణమున ఆరు లక్షలమంది ఏకమై మూర్ఖముగా తనమీద తిరుగబడగా వారిని కనికరింపడయ్యెను. 11. పెడసరి బుద్ధికల వాడొక్కడే ఉండినను 

Sirach Chapter 15 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 15వ అధ్యాయము

 1. దైవభీతి గలవాడు ఇట్టి పనిచేయును. ధర్మశాస్త్ర పారంగతుడైనవాడు విజ్ఞానమును పొందును. 2. విజ్ఞానము తల్లివలెను, , ఎలప్రాయపు వధువువలెను వచ్చి అతడిని ఆహ్వానించును. 3. అది అతనికి తెలివి అను అన్నము పెట్టును. వివేకమను పానీయము నొసగును. 4. అతడు ఊతకఱ్ఱ మీదవలె దానిమీద వాలి క్రింద పడిపోవుట అను అవమానమునుండి తప్పించుకొనును. 5. అది అతనికి అనన్యసాధ్య మైన ఖ్యాతిని అర్జించి పెట్టును. సభలో మాట్లాడుటకు వాగ్దాటిని అనుగ్రహించును 6. అతనికి సుఖసంతోషములు సిద్ధించును. అతని పేరు కలకాలము నిలుచును. 7. కాని మూర్ఖులు విజ్ఞానమును బడయజాలరు. పాపాత్ముల కంటికది కన్పింపనుగూడ కన్పింపదు. 8. గర్వాత్ములకది దూరముగా ఉండును. అసత్యవాదుల మనసులోనికది ప్రవేశింపదు. 9. పాపాత్ముడు దేవుని కీర్తింపజాలడు. ప్రభువు అతడికి ఆ బుద్ది దయచేయడు. 10. దైవ సంకీర్తనమును విజ్ఞానము వలననే పలుకవలెను. ప్రభువే ఆ సంకీర్తనమును ప్రేరేపించును. 11. నేను పాపము చేయుటకు దేవుడే కారణమని చెప్పకుము. తాను అసహ్యించుకొను దానిని దేవుడెట్లు చేయించును? 12. దేవుడు నన్ను పెడత్రోవ పట్టించెనని అనకుము. ఆయన పాపాత్ములను తన పనికి వాడుకొనడు. 13. ప్రభువు దౌష్ట్యమును పూర్తిగా అసహ్యించు

Sirach Chapter 14 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 14వ అధ్యాయము

 1. ఏనాడును తప్పుగా మాట్లాడని నరుడు ధన్యుడు. అతడు తాను పొరపాటు చేసితినేమో అని భయపడనక్కరలేదు. 2. తన అంతరాత్మ తనను నిందింపనివాడును, నమ్మకముతో జీవించువాడునగు నరుడు ధన్యుడు. 3. పిసినిగొట్టునకు సిరిసంపదలు తగవు. లోభికి సంపదతో ఏమి ప్రయోజనము? 4. తాను అనుభవింపక సొమ్ము కూడబెట్టువాడు ఇతరుల కొరకే కూడబెట్టుచున్నాడు. అతని సొత్తుతో ఇతరులు హాయిగా బ్రతుకుదురు. 5. తన కొరకు తాను ఖర్చు పెట్టుకొననివాడు ఇతరుల కొరకు ఖర్చు పెట్టడు. అతడు తన సొత్తును తానే అనుభవింపడు. 6. తన కొరకు తాను ఖర్చు చేసికొననివానికంటె నికృష్ణుడు లేడు. నీచ బుద్ధికి తగిన శిక్షయే కలదు. 7. లోభి మంచిని చేసినను యాదృచ్చికముగనే చేయును కాలక్రమమున అతని పిసినిగొట్టుతనము బయటపడును. 8. పిసినారి అయిన నరుడు దుష్టుడు, అక్కరలో ఉన్నవారిని ఆదుకొనడు. 9. పేరాశకలవాడు తనకు ఉన్నదానితో తృప్తి చెందడు. దురాశవలన అతని హృదయము కుదించుకొని పోవును. 10. లోభి కడుపునిండ తినుటకు ఇష్టపడడు, కనుక చాలినంత భోజనము సిద్ధము చేసికొనడు. 11. కుమారా! నీవు నీ స్థితికి , తగినట్లుగా చూచుకొనుము. ప్రభువునకు మేలికానుకలు అర్పింపుము. 12. మృత్యువు నీ కొరకు వేచియుండదు. నీవేనాడు పాతాళము చేరుదువో నీ

Sirach Chapter 13 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 13వ అధ్యాయము

 1. కీలు ముట్టుకొన్నచో చేతులకు మురికియగును. గర్విష్ఠులతో చెలిమి చేయువాడు వారివంటివాడే అగును. 2. నీకు మించిన బరువు మోయవలదు. నీ కంటె ధనవంతులు, బలవంతులైన వారితో చెలిమి చేయవలదు. మట్టికుండను లోహపు పాత్ర చెంత ఉంచరాదు. అవి ఒకదానితోనొకటి తగిలినచో కుండపగులును 3. ధనికుడు తోటివానికి , అపకారము చేసికూడ దర్పము జూపును. పేదవాడు అపకారము పొందినను తానే మన్నింపు వేడుకోవలెను. 4. నీవు ఉపయోగపడినంత కాలము ధనికుడు నిన్ను వాడుకొనును. కాని నీకు అవసరము కలిగినపుడు అతడు నిన్ను చేయి విడచును. 5. నీ యొద్ద ధనమున్నంతకాలము అతడు నీతో చెలిమి చేయును. ఏమాత్రము సంకోచింపక నీ సొత్తును కాజేయును. 6. అతనికి నీతో అవసరము కలిగినపుడు నిన్ను నమ్మించును. నవ్వు మోముతో నిన్ను ప్రోత్సహించుచున్నట్లే చూపట్టును. నీతో తీయగా మాటలాడుచు “నా నుండి నీకేమైన కావలెనా?” అని అడుగును. 7. తన విందులతో నిన్ను మోమాటపెట్టి రెండు మూడు సార్లు నీ సొమ్ము కాజేయును. అటు తరువాత నిన్ను పరిహానము చేయును. ఆ మీదట నీవు అతనికి ఎచ్చటైనను కన్పింతువేని నిన్నెరుగనట్లు నటించి, తన దారిన తాను సాగిపోవును. 8. కనుక నీవు మోసమునకు గురికాకుండ జాగ్రత్తపడుము. లేదేని ఆనందమును అనుభవించుచుండ

Sirach Chapter 12 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 12వ అధ్యాయము

 1. ఉపకారము చేయగోరెదవేని యోగ్యులెవరో పరిశీలింపుము. అప్పుడు నీ సత్కార్యము వ్యర్థముకాదు. 2. భక్తిపరునికి చేసిన ఉపకారమునకు అతనినుండి కాకున్నను, దేవుని నుండియైనను బహుమతి లభించును. 3. ఎల్లవేళల దుష్కార్యములు చేయువానికి, ఏనాడు దానధర్మములు చేయనివానికి మేలు కలుగదు. 4. దైవభక్తి కలవారికేగాని పాపాత్ములకు ఉపకారము చేయవద్దు. 5. వినయవంతునికి సహాయము చేయవలెను గాని భక్తిహీనునికి చేయరాదు. భక్తిలేని వానికి అన్నము పెట్టినచో అతడు నీ కరుణను విస్మరించి నీ మీద తిరుగబడును. నీవతడికి చేసిన మంచికిగాను రెండంతలు అదనముగా చెడ్డను అనుభవింప వలసివచ్చును. 6. మహోన్నతుడైన ప్రభువుకూడ పాపాత్ములను అసహ్యించుకొనును. వానిని శిక్షించితీరును. 7. సత్పురుషులకు దానము చేయవలెను. పాపాత్ములకు సహాయము చేయరాదు. 8. సంపదలలో మంచిమిత్రుని గుర్తింపజాలము. కాని ఆపదలలో చెడ్డమిత్రుని తప్పక గుర్తింపవచ్చును. 9. ఆపదలలో మిత్రులుకూడా మనలను విడిచిపోయెదరు. కాని, సంపదలలో చెడ్డవారును మిత్రులవలె నటింతురు. 10. చెడ్డ స్నేహితుని ఎప్పుడును నమ్మరాదు. త్రుప్పు లోహమునువలె  అతని దుష్టత్వము మనలను నాశనము చేయును 11. దుష్టుడు నక్కవినయములతో దండము పెట్టినను అతనినిగూర్చి జాగ్

Sirach Chapter 11 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 11వ అధ్యాయము

 1. పేదవారి జ్ఞానము వారిని తల ఎత్తుకొనునట్లు చేయును. వారిని అధికులమధ్య కూర్చుండునట్లు చేయును. వెలుపలి డంబమును లెక్కచేయవద్దు 2. అందముగానున్నందువలన ఎవరిని మెచ్చుకోవలదు. అందముగా లేనందువలన ఎవరిని నిరాకరింపవలదు. 3. రెక్కలతో ఎగురు ప్రాణులలో తేనెటీగ చాలచిన్నది కాని దాని తేనె మహామధురముగా ఉండును.  4. నీ నాణ్యమైన దుస్తులను చూచుకొని మురిసిపోవలదు. గౌరవము అబ్బినపుడు పొగరుబోతువు కావలదు. ప్రభువు అద్భుతకార్యములు చేయును. వానిని నరులు తెలిసికొనజాలరు.  5. చాలమంది రాజులు గద్దె దిగి నేలమీద కూర్చుండిరి ఎవరు ఊహింపని వారువచ్చి, ఆ రాజుల కిరీటములు ధరించిరి. 6. పాలకులు చాలమంది అవమానమున మునిగిరి. సుప్రసిద్ధులు చాలమంది అన్యుల శక్తికి లొంగిపోయిరి. 7. విషయమును జాగ్రత్తగా పరిశీలించి చూచినగాని తప్పుపట్టవద్దు. ఆలోచించి చూచిన పిదపగాని విమర్శకు పూనుకోవద్దు. 8. ఇతరులు చెప్పినది వినిన పిదపగాని జవాబు చెప్పవద్దు. మాటలాడు వానికి మధ్యలో అడ్డురావద్దు. 9. నీకు సంబంధింపని విషయములలో తలదూర్చి తగవు తెచ్చుకొనకుము. పాపాత్ముల కలహములలో జోక్యము కలిగించుకొనకుము. 10. కుమారా! నీవు చాల కార్యములను నెత్తిన పెట్టుకోవద్దు. చాలపనులను చేపట్టెదవేని

Sirach Chapter 10 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 10వ అధ్యాయము

 1.విజ్ఞతగల పాలకుడు తన ప్రజలకు శిక్షణ నిచ్చును. అతని పరిపాలన క్రమబద్ధముగా ఉండును. 2.పాలకుడెట్టివాడో ఉద్యోగులును అట్టి వారగుదురు. ప్రజలుకూడ అతని వంటి వారే అగుదురు. 3.విద్యా రహితుడైన రాజు ప్రజలను చెరచును, పాలకులు విజ్ఞలైనచో ప్రభుత్వము బాగు పడును. 4. ప్రభువే లోకమును పరిపాలించును, అతడు తగిన కాలమున తగిన వానిని పాలకుని చేయును. 5.ఆ పాలకుని విజయము ప్రభువు చేతిలో నుండును, ఏ అధికారి కీర్తియైన ప్రభువు మీదనే ఆధారపడి యుండును. 6. తోడి నరుడు చేసెడి ప్రతి తప్పిదమునకు కోపపడకుము. దురహంకారముతో అమర్యాదగా ప్రవర్తింపకుము. 7. దేవుడు, నరుడు కూడ గర్వమును ఏవగించుకొందురు. ఆ యిరువురు కూడ అన్యాయమును అసహ్యించుకొందురు. 8. అన్యాయము, అహంకారము, సంపదలు అను వాని వలన రాజ్యములు కూలి, జాతినుండి జాతికి మారుచుండును. 9. దుమ్మును, బూడిదయునైన నరులు ఏమి చూచుకొని గర్వపడవలెను? మనము బ్రతికి యుండగనే మన శరీరము క్రుళ్లిపోవును. 10. నరుని దీర్ఘవ్యాధి వైద్యుని చీకాకు పెట్టును, నేడు బ్రతికి యున్న రాజు కూడ రేపు చచ్చి శవమగును. 11.నరుడు చచ్చిన పిదప అతనికి దక్కునది పరుగులు, ఈగలు మాత్రమే. 12. సృష్టికర్తయైన ప్రభువును విడనాడుట గర్వమునకు తొలిమెట్ట

Sirach Chapter 9 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 9వ అధ్యాయము

 1. నీవు అనురాగముతో చూచుకొను భార్యను శంకింపకుము. శంకింతువేని ఆమెను నీకు కీడు చేయ ప్రోత్సాహించినట్లగును. 2. ఏ స్త్రీకి మనసిచ్చి దాసుడవు కావలదు. 3. పరకాంతతో సాంగత్యము వలదు, నీవు ఆమె వలలో చిక్కుకొందువు. 4. పాట కత్తెతో చెలిమి వలదు, ఆమె నిన్ను బుట్టలోవేసికొనును. 5. కన్నెవైపు వెట్టిగా చూడకుము, ఆమెకు నష్ట పరిహారము చెల్లింపవలసి వచ్చును. 6. వేశ్యకు హృదయము అర్పింపకుము. నీ ఆస్తి అంత గుల్లయగును. 7. నగర వీదులలో నడుచునపుడు నలువైపుల తేరిపార చూడకుము. నరసంచారము లేని తావుల లోనికి పోవలదు. 8. అందకత్తె ఎదురుపడినపుడు నీ చూపు లను ప్రక్కకు త్రిప్పుకొనుము. పరకాంత సౌందర్యము మీదికి మనస్సు పోనీకుము. స్త్రీ సౌందర్యము వలన చాల మంది తప్పుత్రోవ పట్టిరి. అది అగ్ని జ్వాలలను రగుల్కొల్పును. 9. పరకాంత్ర సరసన కూర్చుండి భోజనము చేయకుము, ఆమెతో కలిసి పానీయము సేవింపకుము. నీవు ఆమె ఆకర్షణకు లొంగిపోయి, ఉద్రేకమునకు గురియై, స్వీయ నాశము తెచ్చుకోవచ్చును. తోడి నరులతో మెలగవలసిన తీరు 10. ప్రాత మిత్రుని పరిత్యజింపకుము. క్రొత్త మిత్రుడతనికి సాటిరాడు. నూత్న మిత్రుడు నూత్న ద్రాక్షాసవము వంటి వాడు, ప్రాతపడిన పిదపగాని మధువు సేవించుటకింపుగా నుండద

Sirach Chapter 8 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 8వ అధ్యాయము

 1. పేరు ప్రసిద్దులు కలవానితో పోటీకి దిగవద్దు. నీవతని ఆధిక్యమునకు లొంగిపోవలసివచ్చును. 2. సంపన్నునితో కలహము తెచ్చుకోవద్దు. అతడు లంచము పెట్టి నిన్నోడింప వచ్చును. బంగారము చాలమందిని చెరచినది. రాజుల హృదయాలను అపమార్గము పట్టించినది. 3.మదరు బోతుతో వివాదమునకు దిగవద్దు. నీవు అతని అగ్నికి సమిధలు పేర్చినట్లగును. 4. సభ్యత లేని వానితో సరసమునకు దిగవద్దు. అతడు నీ పూర్వులను దెప్పిపొడవవచ్చును. 5. తన పాపములకు పశ్చాత్తాప పడినవానిని నిందింపవద్దు. మన మందరము తప్పులు చేయువారమే కదా! 6. వృద్దుని చిన్నచూపు చూడ వలదు. మన మందరము ముసలి వారమగుదుముకదా! 7. ఎట్టివాడు చనిపోయినను సంతోషింపవలదు. మన మందరము మరణింప వలసినదేకదా! 8. విజ్ఞల బోధను అనాదరము చేయవద్దు. వారి సూక్తులను జాగ్రత్తగా పఠింపుము. వాని వలన నాగరికతను అలవరచుకొని ఉన్నతులకు సేవలు చేయు విధానమును నేర్చుకొందువు. 9. వృద్దుల ఉపదేశములను అనాదరము చేయవలదు. వారు తమ పూర్వుల నుండియే వానిని నేర్చుకొనిరి. వారి నుండి నీవు విజ్ఞానమును గడింతువు. అవసరము కల్గినప్పుడు జవాబును ఎట్లు చెప్పవలెనో కూడ తెలిసికొందువు. 10. దుష్టుని ఉద్రేకములను రెచ్చగొట్ట వలదు. అప్పుడు అతడు నీకు హాని చేయవచ్చును

Sirach Chapter 7 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 7వ అధ్యాయము

 1. నీవు దుష్కార్యములను చేయకుందువేని అవి నీకెట్టి కీడు చేయవు. 2. అధర్మమునువిడనాడెదవేని అది నిన్ను విడనాడును. 3. అధర్మమను నాగటిచాళ్లలో విత్తనములు విత్తకుము. విత్తెదవేని ఏడు రెట్లుగా పండిన చెడ్డపంటను కోసికోవలసి వచ్చును. 4. దేవుని నుండి ఉన్నతమైన పదవిని కోరుకొనకుము. రాజు నుండి గౌరవప్రదమైన ఉద్యోగమును అర్ధింపకుము. 5. దేవుని ముందు నీ పుణ్యమును ఏకరువు పెట్టవద్దు. రాజునెదుట నీ విజ్ఞతను ప్రదర్శింపవద్దు. 6. అన్యాయమును తొలగించు సామర్థ్యము లేనపుడు న్యాయాధిపతివి కావలె నని ఉబలాట పడకుము. నీవు ఎవడైన పేరు ప్రఖ్యాతులు కలవానికి లొంగిపోయి న్యాయము చెరచి అపఖ్యాతి తెచ్చుకోవచ్చును. 7. పౌరులకు అపకారము చేసి లోకమునెదుట నగు బాట్లు తెచ్చు కొనకుము. 8. ఒకసారి చేసిన తప్ప మరల చేయవద్దు. అసలు ఒక తప్పకే శిక్ష పడవలెను. 9. “నేను ఉదార బుద్ధితో సమర్పించిన కానుకలను మహోన్నతుడైన ప్రభువు అంగీకరించునులే, నేనేమిచ్చినను అతడు చేకొనునులే” అని తలపకుము. 10. విసుగు చెందక ప్రార్ధింపుము. దాన ధర్మములు చేయటలో వెనుకాడకుము. 11. భంగపాటుకు గురియైన నరుని పరిహాసము చేయకుము. నరుని తగ్గించుటకు హెచ్చించుటకు గూడ ప్రభువే సమరుడు. 12. నీసోదరుని మీద చాడీలు

Sirach Chapter 6 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 6వ అధ్యాయము

 1. మిత్రుడుగా మెలగ వలసిన చోట శత్రువుగా మెలగవలదు. చెడ్డపేరు వలన నీవు అపకీర్తి తెచ్చుకొందువు. కల్లలాడు దుర్మార్గులకు అట్టిది చెల్లును. 2. ఆశాపాశములకు తావీయకుము. అవి నిన్ను ఎదువలె కొమ్ములతో పొడిచివేయును. 3. నీవు ఎండిపోయి, ఆకులను పండ్లను కోల్పోయిన చెట్టు వంటివాడ వగుదువు. 4. ఆశాపాశము వలన నరుడు చెడును. నీ శత్రువులు నిన్ను చూచి నవ్వుదురు. 5. మృదుభాషణము వలన చాలమంది స్నేహితులు కల్గుదురు, మర్యాద వర్తనము వలన మిత్రులు పెరుగుదురు. 6. నీకు పరిచితులు చాల మంది ఉండవచ్చు గాక! సలహా దారునిగా మాత్రము వేయి మందిలో ఒక్కని ఎన్నుకొనుము. 7. పరీక్షించి చూచినపిదపనేగాని ఎవనినైన మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరిని నమ్మరాదు. 8. కొందరు తమకు అనుకూలముగా ఉన్నపుడు నీకు మిత్రులగుదురు. కాని ఆపదలువచ్చినపుడు నిన్ను పట్టించుకొనరు. 9. మరికొందరు ఏదో వివాదమును పరస్కరించుకొని నీ నుండి విడిపోయెదరు. ఆ వివాదమును ఎల్లరికిని తెలియజేసి నిన్ను చీకాకు పెట్టెదరు. 10-11. ఇంక కొందరు నీ యింట భుజింతురు. నీ కలిమిలో నీకు అంటి పెట్టుకొని ఉండి, నీ సేవకులకు ఆజ్ఞలిడుదురు. కాని నీకు ఆవదలు వచ్చినపుడు నీ చెంతకు రారు. 12. నీకు దీనదశ ప్రాప్తించినపు

Sirach Chapter 5 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 5వ అధ్యాయము

 1. నీవు ధనము మీద ఆధారపడకుము. డబ్బుతో "నాకు స్వయం సమృద్ధి" కలదని, అన్ని కలవు" అని తలపకుము. 2. నీవు కోరుకొనినదెల్ల సంపాదించు యత్నము చేయకుము. నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకుము. 3. "నా మీదెవరికి అధికారము కలదు?” అని ఎంచకుము. అట్లు ఎంచెదవేని ప్రభువు నిన్ను శిక్షించును. 4. నేను పాపము చేసినను శిక్ష పడలేదుకదా అనుకొనకుము. ప్రభువు దీర్ఘకాలముసహించి ఊరకుండును. 5. దేవుడు క్షమింపక పోడులే అని యెంచి పాపముమీద పాపము మూట గట్టుకోవలదు. 6. "ప్రభువు మహా కృప గలవాడు. కనుక నేనెన్ని పాపములు చేసినను క్షమించునులే” అని తల పకుము. ఆయన కృపను, కోపమును గూడ ప్రదర్శించును. పాపులను కఠినముగా దండించును. 7. కనుక నీవు రోజుల తరబడి జాప్యము చేయక శిఘ్రమే   దేవుని యొద్దకు మరలిరమ్ము ప్రభువు కోపాగ్ని నీ మీద దిడీలున రగుల్కొన వచ్చును. అప్పుడు ఆయన శిక్ష వలన నీవు సర్వనాశమయ్యెదవు. 8. అన్యాయార్జితమైన ధనమును నమ్మకుము. నాశము సంభవించినపుడు అది నిన్ను కాపాడలేదు. 9. ప్రతిగాలికి తూర్పార పట్టవద్దు. ప్రతిత్రోవ త్రోక్కవద్దు. చిత్తశుద్ధిలేని పాపులకది చెల్లును. 10. నీవు నమ్మినదానికి కట్టువడి ఉండుము. నీ పలుకులలో నిజాయితి చ

Sirach Chapter 4 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 4వ అధ్యాయము

 1. కుమారా! నీవు పేదవాని బ్రతుకుదెరువును చెడగొట్టవలదు. అతడినాదుకొనుటలో ఆలస్యము చేయవలదు. 2. ఆకలిగొన్నవానికి ఆగ్రహము రప్పింపకుము. అక్కరలో ఉన్నవాని కోపమును రెచ్చగొట్టకుము. 3. నిరాశ చెందియున్న వాని బాధలను అధికము చేయకుము. అతడు చేయిచాచి అడిగినచో జాప్యము చేయకుము. 4. బిచ్చగాడు యాచించినపుడు నిరాకరింపకుము. పేదవాని నుండి మొగము ప్రక్కకు త్రిప్ప కొనకుము. 5. దరిద్రుని నుండి చూపు మరల్పకుము. అతడు నిన్ను శపింపకుండునట్లు చూచుకొనుము. 6. హృదయ వేదనను భరింపజాలక ఆ దరిద్రుడు నిన్ను శపించినచో ప్రభువతని మొరను ఆలించును 7. నీవు భక్త సమాజ మన్నన పొందుము. ఉన్నతవ్యక్తికి తలయొగ్గుము. 8. పేదలు విన్నవించుకొను సంగతులు వినుము. వారికి మర్యాదగా బదులు చెప్పుము. 9. పీడకుని బారి నుండి పీడితుని విడిపింపుము. నీవు తీర్చు తీర్పులలో ఖండితముగా నుండుము. 10. అనాథలకు తండ్రి వలె నుండుము. వితంతువులకు వారి భర్త వలె సాయపడుము. అప్పుడు నీవు మహోన్నతుడైన దేవునికి పుత్రుడవగుదువు. అతడు నీ సొంత తల్లి కంటె గూడ అధికముగా నిన్ను ప్రేమించును. 11. విజ్ఞానము తన బిడ్డలను పెంచి గొప్ప వారిని చేయును. తన చెంతకు వచ్చు వారిని ఆదరించును. 12. విజ్ఞానమును ప్రేమిం

Sirach Chapter 3 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 3వ అధ్యాయము

 1. బిడ్డలారా! మీ తండ్రినైన నా పల్కు లాలింపుడు. నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కల్గును. 2. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. తల్లికి బిడ్డల మీద హక్కును ప్రభువు కల్పించెను. 3. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసికొనినట్లే, 4. తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే, 5. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలించును. 6. తండ్రిని ఆదరించువాడు దీర్గాయుష్మంతుడగును. తల్లిని సంతోష పెట్టవాడు దేవునికి విధేయుడైనట్లే, 7. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి యుండవలెను. 8. నీవు వాక్కు,క్రియలలో నీ తండ్రికి లొంగియుండుము. అప్పుడు నీవతని దీవెనలు పొందుదువు. 9. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధిచెందును. తల్లి శాపమువలన పిల్లల కొంపలు కూలిపోవును. 10. నీవు కీర్తిని పొందుటకు నీ తండ్రిని అవమానపరపరాదు. తండ్రికి అవమానము కలిగినపుడు పుత్రునికి గౌరవము కలుగదు. 11. తండ్రిని సన్మానించుట వలన తనయుడు గౌరవము పొందును. తల్లిని అవమాన పరచు సంతానము నిందను తెచ్చుకొనును. 12. నాయనా! వృద్దుడైన నీతండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి యున్నంతవరకు కష్టపె

Sirach Chapter 2 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 2వ అధ్యాయము

 1. కుమారా! నీవు దేవుని సేవింపగోరెదవేని పరీక్షకు సిద్దముగా ;నుండుము. 2. చిత్తశుద్ధితో, పట్టుదలతో మెలగుము. ఆపదలు వచ్చినపుడు నిబ్బరముగా నుండుము. 3. ప్రభువును ఆశ్రయింపుము. ఆయనను విడనాడకుము. అప్పుడు నీ జీవితాంతమున విజయమును పొందుదువు. 4. నీకెట్టి ఆపదలు వచ్చిన వానినెల్ల అంగీకరింపుము. శ్రమలు కలిగినను సహనముతో ఉండుము. 5. కుంపటిలో పుటము వేయుట బంగారమునకు పరీక్ష. శ్రమలకు గురియగుట నరునికి పరీక్ష 6. ప్రభువును నమ్మెదవేని ఆయన నిన్ను కాపాడును. ఋజు మార్గమున నడచుచు ప్రభువును విశ్వసింపుము. 7. దైవభీతి కలవారందరు ప్రభుని దయకొరకు వేచియుండుడు. అతనిని విడనాడెదరేని మీరు తప్పక నశించెదరు. 8. దైవభీతి కలవారందరు ప్రభుని నమ్ముడు. మీరు బహుమతిని పొందెదరు. 9. దైవభీతి కల వారందరు శుభముల నాశింపుడు. ప్రభువునుండి కరుణ, నిత్యానందము పొందుడు. 10.పూర్వ తరములను పరిశీలించి చూడుడు ప్రభువును నమ్మిన వాడెవడైన భంగపడెనా? నిరంతర దైవభీతి కలవానినెవనినైన ప్రభువు చేయివిడచెనా? తనకు మొరపెట్టిన వానినెవనినైన ఆయన అనాదరము చేసెనా? 11. ప్రభువు దయ, కనికరముకలవాడు. ఆయన మనపాపములను మన్నించును. ఆపదలలో నుండి మనలను కాపాడును. 12. పిరికివారు అధోగతి పాలయ్యెదరు.

Sirach Chapter 1 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 1వ అధ్యాయము

 1. సర్వ విజ్ఞానము ప్రభువు నుండి వచ్చును. అది కలకాలము ఆయన చెంతనే ఉండును. 2. సముద్రపు ఇసుక రేణువులను, వర్ష బిందువులను, అనంతకాలపు దినములను గణీంపగల వాడెవడు? 3. ఆకాశము ఎత్తును, భూమి వైశాల్యమును, అగాధ విజ్ఞానముల లోతును తెలియగల వాడెవడు? 4. అన్నిటికంటె ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను. కావున వివేకము ఎల్లవేళల ఉన్నదియే. 5. ఆకాశమందలి దేవుని వాక్కే విజ్ఞానమునకు ఆధారము. శాశ్వతములైన ఆజ్ఞలు దానికి నిలయములు. 6. విజ్ఞానపు జన్మస్థానము ఎవరికి తెలియును? దాని తెలివిని ఎవరు గ్రహింపగలరు? 7. విజ్ఞానమునకు ఉండు తెలివిని ఎవరు అర్ధము చేసికోగలరు? దానికి ఉన్న అనుభవమును ఎవరు గ్రహింపగలరు? 8. జ్ఞానియైన వాడొక్కడే, అతడు మహా భయంకరుడు, సింహాసనాసీనుడైన ప్రభువు. 9. ఆయనే విజ్ఞానమును సృజించెను. దానిని పరిశీలించి చూచి దాని విలువను గ్రహించెను. తాను సృజించిన ప్రతి వస్తువును విజ్ఞానముతో నింపెను. 10. ప్రభువు ప్రతి నరునికి విజ్ఞానము నొసగెను. తనను ప్రేమించు వారికి మాత్రము దానిని సమృద్దిగా దయచేసెను. 11. ప్రభువు పట్ల భయభక్తులు గలవారికి గౌరవాదరములను, సంతోష సౌభాగ్యములను చేకూర్చును. 12. దేవుని పట్ల భయ భక్తులు కలవాని హృదయము సంతసించు

Genesis chapter 50 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 50వ అధ్యాయము

 1. యోసేపు తండ్రి ముఖముమీద వ్రాలి అతనిని ముద్దుపెట్టుకొని రోదించెను. 2. శవమును సుగంధ ద్రవ్యములతో చేర్పుడని అతడు తన కొలువున ఉన్న వైద్యులను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. 3. నలుబది దినములు పూర్తి అయ్యెను. ఆ నలువది దినములలో వైద్యులు సుగంధ ద్రవ్యములతో శవమును భద్రపరచిరి. ఐగుప్తు దేశీయులు డెబ్బది రోజుల పాటు యాకోబుకొరకు అంగలార్చిరి. 4. దుఃఖ దినములు ముగిసిన తరువాత యోసేపు ఫరోరాజు కుటుంబము వారి వద్దకు వెళ్ళి “మీకు నామీద దయ గలదేని నా మాటగా ఫరోరాజుతో ఇట్లు మనవి చేయుడు: 5. 'నేను చనిపోవుచున్నాను. కనాను దేశములో నాకై నేను సిద్ధముచేసికొన్న సమాధిలో నన్ను పాతిపెట్టుము' అని చెప్పి మా తండ్రి నాచేత ప్రమాణము చేయించుకొనెను. సెలవైనచో అక్కడకి వెళ్ళి తండ్రిని పాతి పెట్టి తిరిగివత్తునని ఏలినవారితో చెప్పుడు” అనెను. 6. "ప్రమాణము చేసిన విధముగా వెళ్ళి తండ్రిని పాతి పెట్టుము” అని వరోరాజు సెలవిచ్చెను. 7. యోసేపు తండ్రిని సమాధి చేయుటకు వెళ్ళెను. ఫరో సేవకులు, రాజుఇంటి పెద్దలు, ఐగుప్తుదేశపు పెద్దలు, యోసేపు ఇంటివారు, అతని సోదరుల కుటుంబమువారు, తండ్రి కుటుంబమువారు, వీరందరును యోసేపు వెంటవెళ్ళిరి. 8. అతని సోదరులు తమ

Genesis chapter 49 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 49వ అధ్యాయము

 1. యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను: “నాయనలారా! దగ్గరకు రండు మునుముందు మీకేమి జరుగునో చెప్పెదను. 2. యాకోబు కుమారులారా! నా చుట్టుచేరి సావధానముగా వినుడు. యిస్రాయేలైన ఈ తండ్రిమాటలు వినుడు. 3. రూబేనూ! నీవు నా పెద్ద కుమారుడవు. నా బలము నీవే. నా ఓజస్సుకు ప్రథమఫలమును నీవే. బలగర్వములచే అతిశయించువాడవు నీవే. జలప్రవాహమువలె నీవు చంచలుడవు. అయినను నీవు అతిశయిల్లలేవు. 4. నీవు తండ్రిమంచము మీదికి ఎక్కి సవతి తల్లిని కూడితివి. నా శయ్యను మైలపరచి నన్ను ధిక్కరించితివి. 5. షిమ్యోను, లేవి సోదరులు. వారు తమ ఆయుధములను హింసకు వాడిరి. 6. నేను వారి పన్నాగములను అంగీకరింపను. నేను వారి మంత్రాలోచనలలో పాల్గొనను. వారు కోపావేశముతో మనుష్యులను చంపిరి. వారు క్రోధముతో ఎద్దుల గుదికాలినరములు తెగగొట్టిరి. 7. దారుణమైన వారి ఆగ్రహము నిందాపూరితము. ఉగ్రమైన వారి కోపము శాపారము. వారిని యాకోబు దేశములో చిందరవందర చేసెదను, వారిని యిస్రాయేలు భూమిలో చెల్లాచెదరుచేసెదను. 8. యూదా! నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని, వారిమెడలు విరుతువు. తోడబుట్టినవారు నీముందు సాగిలబడుదురు. 9. యూదా! నీవు సింహపుపిల్లవు. వేటాడి విడిదికి తిరిగ

Genesis chapter 48 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 48వ అధ్యాయము

 1. పిమ్మట తండ్రికి జబ్బు చేసినదని యోసేపునకు వార్తవచ్చెను. అతడు తన కుమారులైన మనష్షేను, ఎఫ్రాయీమును వెంటబెట్టుకొని తండ్రి కడకు వెళ్ళెను. 2. కుమారుడు యోసేపు వచ్చుచున్నాడని యాకోబునకు తెలిసెను. తన బలమంతయు కూడగట్టుకొని అతడు మంచముమీద లేచి కూర్చుండెను. 3. యాకోబు కుమారుని చూచి "కనాను దేశమందలి లూజులో సర్వశక్తిమంతుడగు దేవుడు నాకు ప్రత్యక్షమై నన్నాశీర్వదించెను. 4. దేవుడు నాతో 'యాకోబూ! నీవు పెంపొందునట్లు చేయుదును. ఒక మహాజాతిగా అవతరింప నీ సంతతిని విస్తరిల్లచేయుదును. ఈ దేశమును నీ తరువాత నీ సంతతికి శాశ్వత భుక్తి యగునట్లు ప్రసాదింతును' అనెను. 5. యోసేపూ! నేను రాకముందు ఐగుప్తుదేశములో నీకు పుట్టిన కుమారులిద్దరు నా కుమారులే అగుదురు. రూబేను షిమ్యోనుల మాదిరిగా మన్మ, ఎఫ్రాయీములుగూడ నా సొంతపుత్రులే. 6. వారి తరువాత పుట్టినవారు మాత్రము నీ సంతానమే. కాని వారు నివసించు ప్రదేశములనుబట్టి పిలువవలసి వచ్చినపుడే వారు తమ అన్నల పేరులతో పిలువబడుదురు. 7. పద్దనారాము నుండి వచ్చుచున్నప్పుడు కనాను దేశములో ఎఫ్రాతాకు ఇంకా కొంతదూరమున నుండగా త్రోవలో రాహేలు చనిపోయినది. బేత్లెహేము అను ఎఫ్రాతా నగరమార్గ మున ఆమెను పాతి పెట్